ఎన్టీఆర్‌ స్మారక రూ.100 నాణేలకు భారీ డిమాండ్‌ | Huge Demand To NTR 100 Rupees Coin - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ స్మారక రూ.100 నాణేలకు భారీ డిమాండ్‌

Aug 30 2023 2:49 AM | Updated on Aug 30 2023 9:50 AM

NTR 100 Rupees Coin Huge Demand - Sakshi

లక్డీకాపూల్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్మారక రూ.100 నాణేలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఆయన చిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని ముద్రించింది. దీనిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మొదటి విడతగా 1,2000 నాణేలను ప్రభుత్వం విడుదల చేయగా, వీటి కోసం ఎన్టీఆర్‌ అభిమానులు పోటీపడుతున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి హైదరాబాద్‌కు భారీగా తరలివస్తున్నారు. మంగళవారం సైఫాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌ వద్ద నాణేల అమ్మకాలు ప్రారంభం కాగా, గంటల తరబడి క్యూలో ఉండి ఎన్టీఆర్‌ నాణేలను చేజిక్కించుకుంటున్నారు. రూ.4,850, రూ.4,380, రూ.4,050గా ధరలు నిర్ణయించిన అధికారులు గిఫ్ట్‌ బాక్స్‌తోపాటు వంద నాణేన్ని అమ్ముతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement