పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు.. రాకేష్‌రెడ్డిని దోషిగా తేల్చిన కోర్టు..

Nampally Court Convicts Jayaram Murder Accused Rakesh Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చింది. ఈనెల 9న శిక్షను ఖరారు చేయనుంది.

2019 జనవరి 31న జయరాం దారణహత్యకు గురయ్యారు. ఈయనను హత్య చేసిన రాకేష్ రెడ్డి.. తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.  జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ రహదారిపై వాహనంలో ఉంచారు.

నాలుగేళ్లుగా విచారణ సాగుతున్న ఈ కేసులో 11 మంది నిందితులపై కేసు కొట్టివేసింది న్యాయస్థానం. రాకేష్‌ రెడ్డే కుట్ర చేసి జయరాంను హత్యచేసినట్లు నిర్ధరించి అతడ్ని దోషిగా తేల్చింది. ఏసీపీ మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు సీఐలను నిర్దోషులుగా ప్రకటించింది. మొత్తం 73 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.

చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top