ఆశావర్కర్లకు స్మార్ట్‌ ఫోన్‌ల పంపిణీ | Musheerabad MLA Muta Gopal Distributes Smartphones To Asha Workers | Sakshi
Sakshi News home page

ఆశావర్కర్లకు స్మార్ట్‌ ఫోన్‌ల పంపిణీ

Feb 19 2022 2:28 AM | Updated on Feb 19 2022 2:28 AM

Musheerabad MLA Muta Gopal Distributes Smartphones To Asha Workers - Sakshi

ఆశావర్కర్లకు స్మార్ట్‌ ఫోన్‌లు అందజేస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ 

కవాడిగూడ: ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆశావర్కర్లకు స్మార్ట్‌ ఫోన్‌లు అందించడం గర్వకారణమని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. శుక్రవారం కవాడిగూడ డివిజన్‌ దోమలగూడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 19 మంది ఆశావర్కర్లకు ఎమ్మెల్యే స్మాట్‌ఫోన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెల్‌ఫోన్‌లు అందించడంతో ప్రతి వ్యక్తి ఆరోగ్యం గురించి ఆశావర్కర్లు అందులో ఎంటర్‌ చేస్తారన్నారు.

టీకాలు, జ్వర పరీక్షలు, మందుల పంపిణీ వంటి సమాచారం ఎంట్రీ అవుతుందన్నారు. కరోనా సమయంలో ఆశావర్కర్లు ఇంటింటికి తిరిగి సమగ్ర విచారణ చేపట్టి కరోనా సోకిన వ్యక్తులను గుర్తించి మందుల కిట్‌లను పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఈ నెల 27న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement