తెలంగాణ కరోనా రికవరీ రేటు 77.31శాతం | More 1763 New Coronavirus Cases Recorded In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ కరోనా రికవరీ రేటు 77.31శాతం

Aug 19 2020 8:41 AM | Updated on Aug 19 2020 10:28 AM

More 1763 New Coronavirus Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 24,542 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1763 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 95,700కు చేరింది. ఈ మేరకు బుధవారం ఉదయం వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా వైరస్‌తో కొత్తగా 8 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 719కు పెరిగింది.(కరోనా ఎఫెక్ట్‌.. 40శాతం మంది తిరిగి ఆస్పత్రికి)

కాగా బుధవారం  కొత్తగా 1789 మంది కోలుకోని ఆసుపత్రుల నుంచి డిశ్చార్చి అయ్యారు.  దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి మొత్తం సంఖ్య 73,991కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,990 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 7,97,470 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. తెలంగాణలో రికవరీ రేటు 77.31% ఉందని బులెటిన్‌లో వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
Advertisement