ఉత్సవాలకు అన్ని పార్టీలకు ఆహ్వానం | MLA Yennam Srinivas Reddy About Telangana Formation Day | Sakshi
Sakshi News home page

ఉత్సవాలకు అన్ని పార్టీలకు ఆహ్వానం

Jun 2 2024 4:30 AM | Updated on Jun 2 2024 4:30 AM

MLA Yennam Srinivas Reddy About Telangana Formation Day

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఉద్యమకారులకు, అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వా నం అందజేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిందని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన గాం«దీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ కారణంగా పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే ఉత్సవ కార్యక్రమాన్ని పరిమితంగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే వేడుకలకు ఎలాంటి పరిమితులు లేవని చెప్పారు. ఉద్యమకారులను ఆ హ్వానించామని, ఉద్యమకారులే ముఖ్యు లుగా ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నా మని చెప్పారు. అనేకమంది ఉద్యమ కారులు ఎఫ్‌ఐఆర్‌ కాపీలు పంపించారని, హైదరాబాద్‌కు రాలేని వారు ఆయా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో నిర్వహించే వేడుకల్లో పాల్గొనాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement