డ్రగ్‌ టెస్ట్‌కు మేం రెడీ.. సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్‌ సవాల్‌ | Mla Padi Kaushik Reddy Challenge To Revanth Reddy | Sakshi
Sakshi News home page

డ్రగ్‌ టెస్ట్‌కు మేం రెడీ.. సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్‌ సవాల్‌

Oct 30 2024 1:01 PM | Updated on Oct 30 2024 3:45 PM

Mla Padi Kaushik Reddy Challenge To Revanth Reddy

సాక్షి,హైదరాబాద్‌: తన పంచాయతీ కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌తో కాదని, సీఎం రేవంత్‌రెడ్డితో అని అన్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి. బుధవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నా పంచాయతీ అనిల్ కుమార్ యాదవ్‌తో కాదు. రేవంత్ రెడ్డితో నాకు పంచాయతీ. డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. మేం కౌశిక్ రెడ్డిని ట్రాప్ చేయలేదని ఇంటిలిజెన్స్ చీఫ్‌ను ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలతో డ్రగ్స్ టెస్ట్ కు రావాలి. మేం యూరిన్‌ డబ్బా పట్టుకుని రెడీగా ఉన్నాం. మా ఎమ్మెల్యేలు అందరు ఎదురు చేస్తున్నారు ఇప్పటి వరకు మమ్మల్ని పిలవలేదు.

ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి డ్రగ్స్ గురించి మాట్లాడితే చిత్తశుద్ధితో మాట్లాడాలి. నన్ను ట్రాప్ చేసినట్లు రాజ్ పాకాల కుటుంబాన్ని ఇరికించాలని చూశారు. కేసీఆర్ పేరు తలుచుకోకుండా రేవంత్ రెడ్డి మీటింగ్ జరిగిందా .రేవంత్ రెడ్డి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు, కేసీఆర్ పేరు. రేవంత్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు’’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌ రెడ్డి అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి సవాల్

Advertisement
 
Advertisement
Advertisement