ఐఐటీ హైదరాబాద్‌లో మంచిత‌నంపై కోర్స్‌! | IIT Hyderabad Launches India First Credit Course on Goodness | Sakshi
Sakshi News home page

ఐఐటీహెచ్‌లో గుడ్‌నెస్‌పై క్రెడిట్‌ కోర్స్‌

Oct 16 2026 5:41 PM | Updated on Oct 16 2026 5:51 PM

IIT Hyderabad Launches India First Credit Course on Goodness

గుడ్‌నెస్‌ క్రెడిట్‌ కోర్సులో చేరిన ఐఐటీహెచ్‌ విద్యార్థులు

దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సమాజం పట్ల, సాటి మనుషుల పట్ల ఎలాంటి బాధ్యతతో ఉండాలి.. మంచి జీవన విధానం అంటే ఏమిటి.. ఆదాయ, హోదాకు అతీతంగా విజయాన్ని ఎలా అందుకోవాలి.. వంటి అంశాలను బోధించే గుడ్‌నెస్‌పై క్రెడిట్‌ కోర్స్‌ను ఐఐటీ హైదరాబాద్‌ ప్రవేశపెట్టింది. దేశంలోనే మొట్టమొదటి ఈ క్రెడిట్‌ కోర్సులో అండర్‌ గ్రాడ్యుయేట్‌ చదువుతున్న 140 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు ఐఐటీహెచ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రోజువారీ దినచర్యలో మంచితనాన్ని ఎలా ఆచరించవచ్చు.. తదితర అంశాలను ఈ కోర్సులో బోధిస్తారు.

విద్యా, వృత్తిపరమైన నైపుణ్యాలకు అతీతంగా విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదల, బాధ్యత తదితర అంశాలు ఉంటాయి. మంచితనాన్ని అర్థం చేసుకోవడం నుంచి దానిని ఆచరించేలా.. మరింత బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మారేలా విద్యార్థులను నడిపించడం ఈ కోర్సు లక్ష్యమని.. తాము ఎలాంటి భారతదేశాన్ని నిర్మించడంలో సహాయపడాలనుకుంటున్నారో అనే దానిపై ఓ ఆలోచనతో ఈ కోర్సు ముగుస్తుందని పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గుడ్‌నెస్‌ వ్యవస్థాపకుడు, ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థి రవి శర్మ ఈ కోర్సును బోధిస్తారు.

26 నుంచి ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు
సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఫీజు చెల్లించే గడువును ఇంటర్‌ బోర్డ్‌ గురువారం ప్రకటించింది. ఈ పరీక్షలు మార్చి 2027లో జరుగుతాయి. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు ఈ నెల 26 నుంచి నవంబర్‌ 9 వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ. 100 ఆలస్య రుసుముతో నవంబర్‌ 11 నుంచి 20 వరకూ, రూ. 500 లేట్‌ ఫీజుతో వచ్చే నెల 22 నుంచి 29 వరకూ, రూ. వెయ్యి ఫీజుతో డిసెంబర్‌ 1 నుంచి 7 వరకూ, రూ. 2 వేల లేట్‌ ఫీజుతో డిసెంబర్‌ 14 వరకూ చెల్లించవచ్చు. ఫీజు వివరాలు సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్ల దగ్గర లభిస్తాయని బోర్డ్‌ తెలిపింది.

ఇదీ చ‌ద‌వండి: హైదరాబాద్‌ నడిబొడ్డున 35 అంతస్తుల భవనమా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement