
సూర్యాపేట జిల్లా: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తాము వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 21వ తేదీ) పాలకవీడు మండలం జవహర్ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ ఆల్మట్టి డ్యాంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. నేను రేపు స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తాను.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. వారి హయాంలోనే కూలిపోయింది. తప్పు చేసిన ఎవరినైనా వదిలిపెట్టం. తుమ్మిడిహెట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. కృష్ణా, గోదావరి నది జలాల్లో తెలంగాణకి రావాల్సిన వాటా కోసం ఏ రాష్ట్రంతో నైనా పోరాడుతాం. కృష్ణా, గోదావరి నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది’ అని పేర్కొన్నారు.