స్టేజ్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టిన మంత్రి | Minister Puvvada Ajay Kumar Dance In Khammam | Sakshi
Sakshi News home page

స్టేజ్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టిన మంత్రి

Apr 26 2022 8:40 PM | Updated on Apr 26 2022 9:35 PM

Minister Puvvada Ajay Kumar Dance In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ కళాకారులతో కలిసి పాటలు డాన్సులు చేస్తూ సందడి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గ పరిధిలో 1000 మందికి దళిత బంధు అమలు అవడమే కాకుండా అదనంగా చింతకాని మండలంలో 4500 మందికి దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని మంత్రి పువ్వాడ అన్నారు.

చదవండి👉: తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌

రానున్న రోజుల్లో నియోజకవర్గ పరిధిలో 1500 మంది లబ్ధిదారులకు పధకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. దళిత బంధు పథకంపై అవాకులు చెవాకులు పేలే వారిని పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. దళిత బంధు పథకాన్ని ఉపయోగించుకుని దళిత సోదరులు ఆర్థికాభివృద్ధి చెందాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement