బంపర్‌ ఆఫర్‌: ఒక్క ట్వీట్‌తో నాలుగేళ్ల వేతనం..

Minister KTR Respond On Pending Salary Issue In Mancherial - Sakshi

సాక్షి, నెన్నెల(మంచిర్యాల): ఉపాధి హామీ పథకం నాలుగేళ్ల కూలీ డబ్బులు ఒక్క ట్వీట్‌తో వచ్చేశాయి. కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య ట్వీట్టర్‌లో పరిష్కారమైంది. మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం కూలీ జమ్మిశెట్టి రజితకు నాలుగేళ్ల కూలి రూ.12వేలు రావాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో పెండింగ్‌లో పడింది. ఎంపీడీవో, మంచిర్యాల డీఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు.

చివరికి ఆమె సోదరుడు సతీష్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో కేటీఆర్, కలెక్టర్‌కు పోస్టు చేశాడు. కలెక్టర్‌ డీఆర్డీవోకు పంపించడంతో అధికారులు స్పందించారు. రెండు రోజుల్లో సమస్య పరి ష్కారం అవుతుందని సతీష్‌కు సమాచారం పంపించారు. బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ నరేష్‌ బుధవారం గ్రామానికి వచ్చి రజితకు రూ.12వేలు అందజేశారు. 

చదవండి: నలుగురి ప్రాణాలు తీసిన క్షణికావేశం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top