ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలు: కొప్పుల | Minister Koppula Eshwar Christmas Celebrations Be Held On 21st Dec At LB Stadium. | Sakshi
Sakshi News home page

ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలు: కొప్పుల

Dec 20 2022 3:50 AM | Updated on Dec 20 2022 4:52 AM

Minister Koppula Eshwar Christmas Celebrations Be Held On 21st Dec At LB Stadium. - Sakshi

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): ఎల్బీ స్టేడియంలో ఈనెల 21న క్రి స్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  క్రి స్మస్‌ వేడుకలను తిలకించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కాగా, ఈ వేడుకల్లో పాల్గొనాలని మెథడిస్ట్‌ బిషప్‌ ఎంఏ డేనియల్‌ను కొప్పుల ఈశ్వర్‌ ఆహ్వానించారు. ఈ మేరకు అబిడ్స్‌ చాపల్‌ రోడ్డులోని బిషప్‌ హౌస్‌కు మంత్రి హాజరై ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌­తో సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. క్రైస్తవుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలపట్ల బిషప్‌ డేనియల్‌ సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, తెలంగాణ ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజుసాగర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనార్టీ కార్పొరేషన్‌ ఎండీ క్రాంతి వెస్లీ, చర్చి ఫాదర్‌లు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement