శభాష్‌ గాడ్గే మీనాక్షి.. ముఖరా(కె) పచ్చదనం భేష్‌.. | Minister Giriraj Singh Appreciates Sarpanch Gadge Meenatchi In Telangana | Sakshi
Sakshi News home page

శభాష్‌ గాడ్గే మీనాక్షి.. ముఖరా(కె) పచ్చదనం భేష్‌..

Aug 1 2021 8:42 AM | Updated on Aug 1 2021 8:42 AM

Minister Giriraj Singh Appreciates Sarpanch Gadge Meenatchi In Telangana - Sakshi

ఇచ్చోడ: ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి ఎకో ఫ్రెండ్లీగా తీర్చిదిద్దిన తీరు అభినందనీయమని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ శనివారం ట్వీట్‌ చేశారు. ఇందుకు కృషి చేసిన సర్పంచ్‌ గాడ్గే మీనాక్షిని అభినందించారు. అడవులు అంతరించిపోతున్న ఈ సమయంలో హరితహారం ద్వారా ఒకటిన్నర ఎకరంలో ఒకేచోట పెద్ద మొత్తంలో మొక్కలు నాటి సంరక్షించడం బాగుందన్నారు. గ్రామాల్లో మొక్కలునాటి పచ్చదనాన్ని పెంపొందించడానికి దేశంలో ఇతర పంచాయతీలకు ముఖరా(కె) ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement