ఆరోగ్య శాఖలో 52 ఉద్యోగాలు | Medical Recruitment Board has released notifications for filling up the posts | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శాఖలో 52 ఉద్యోగాలు

Jun 27 2025 4:28 AM | Updated on Jun 27 2025 4:28 AM

Medical Recruitment Board has released notifications for filling up the posts

48 డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్, 4 స్పీచ్‌ ఫాథాలజిస్ట్‌ పోస్టులు

భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు

త్వరలో 6 వేల పోస్టుల భర్తీకి కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగా ల భర్తీకి రెండు నోటిఫి కేషన్లు విడుదలయ్యాయి. డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్, స్పీచ్‌ పాథాలజిస్ట్‌ పోస్టులకు సంబంధించి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు గురువారం నోటిఫికేషన్లను విడుదల చేసింది. డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 48 ఉండ గా, స్పీచ్‌ పాథాలజిస్ట్‌ పోస్టులు 4 ఉన్నాయి. 

స్పీచ్‌ పాథాలజిస్ట్‌ పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకు, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, వి ద్యార్హత లు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb. telangana.gov.in/MHSRB/home.htm)  అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. 

మరో 6 వేల పోస్టుల భర్తీకి ప్రణాళిక
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసింది. ఇందులో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్స్‌ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 6 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసేందుకు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

కొత్తగా భర్తీ చేయాల్సిన వాటి లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు 1,284 ఉండగా, మల్టీ పర్పస్‌ ఫీమేల్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ 1,930, ఫార్మసిస్ట్‌ 732, నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్స్‌) 2,322 పోస్టులు ఉన్నాయి. త్వరలో మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement