
- పొన్నం మౌనం వహిస్తే అణగారిన వర్గాల ఐక్యతకు భంగం కలుగుతుంది.
- సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ పైన జరిగిన దాడిని ఖండిస్తున్నాం.
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
హైదరాబాద్: మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ముందు నిర్వహించిన మీటిలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ ను ఉద్దేశించి దున్నపోతు అనే మాటను ఉపయోగించి మాట్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అహంపూరిత వ్యాఖ్యల వల్ల దళితులు , బలహీన వర్గాల మధ్య దూరం పెరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని జరిగిన తప్పును సరిసిద్దుకునే విధంగా వెంటనే పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని ఇప్పటికే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు తప్పు జరిగింది వాస్తవమేనని అంగీకరించి పున్నం గారి చేత క్షమాపణ చెప్పించే విధంగా చూస్తామని తెలిపారని అన్నారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యచరణను తీసుకోవలసి వస్తుందని అన్నారు మాకు ఆత్మగౌరవమే ముఖ్యమని అన్నారు ఆత్మగౌరవ విషయంలో రాజీ పడే ప్రసక్తి ఉండదు అనే విషయం స్పష్టం చేశారు.
కార్యక్రమం మైనార్టీ వర్గాలకు చెందిన ఆయనప్పటికీ ఆ శాఖ మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఉండగా వాటి మీద పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోక్యం ఎందుకు అలాగే కార్మిక శాఖ మంత్రి ఉన్న వివేక్ జోక్యం ఎందుకు జరిగిందో ముఖ్యమంత్రి పరిశీలన చేయాలన్నారు.
బీసీ సంక్షేమ శాఖలో వేరే మంత్రులు జోక్యం చేసుకుంటే పొన్నం సహించగలుగుతాడా అలాగే కార్మిక శాఖలో వేరే మంత్రులు జోక్యం చేసుకుంటే వివేక వెంకట్ స్వామి సహించగలుగుతారా తెలుసుకోవాలని అన్నారు. లక్ష్మణ్ కుమార్ దూషిస్తున్న సమయంలో పక్కనే ఉన్న వివేక్ మౌనంగా ఉండడం ఆయన దుర్మార్గమైన మనస్తత్వానికి అద్దం పడుతుందని అన్నారు నిజంగా వివేక్ లో దళిత సృహ ఉంటే సాటి దళిత మంత్రిని అలా అనకూడదని వెంటనే ఖండించాల్సిన అవసరం ఉండేది కానీ వివేకలో ఆస్పృహ లేదని అర్థమైంది.
వివేక్ వెంకటస్వామి మాదిగలను పోర్చుకోలేకపోతున్నాడని అన్నాడు కాక జయంతి వేడుకల్లో అన్ని వర్గాలను ఆహ్వానించిన వివేక్ వెంకటస్వామి.. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అయిన లక్ష్మణ్ కుమార్‌ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. వివేక్‌లో దళిత సోదర సోదర భావం కనుమరుగైందని అన్నారు. ఉమ్మడిగా దళితులకు రావలసిన హక్కులను సాధించడం కోసం అందని కలుపుకోవాల్సిన బాధ్యత ఉన్న వివేక్ సోయి లేకుండా వ్యవహరిస్తున్నాడని అన్నారు.
బీసీలకు ఇస్తున్న 42 శాతం రిజర్వేషన్లను మాదిగ జాతి సంపూర్ణంగా స్వాగతిస్తుందని అన్నారు ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదటి నుండి బీసీలకు 50 శాతం వాటా రావాలని కోరుతుందని అన్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల ఐక్యతను కోరుకుంటున్నామని అన్నారు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని స్వాగతించినట్లుగానే బీసీలకు ఇస్తున్న 42 శాతం రిజర్వేషన్లను సమాజంలోని అన్ని వర్గాలు స్వాగతించాలని పిలుపునిచ్చారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. గవాయ్ దళితుడు కావడం వలనే కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని అందులో భాగంగానే చెప్పులతో దాడికి తెగబడే పరిస్థితికి వచ్చారని, ఆ స్థానంలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదని అన్నారు.