ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి మూత్ర విసర్జన | man urinating inside the ATM | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి మూత్ర విసర్జన

Mar 20 2025 9:59 AM | Updated on Mar 20 2025 10:20 AM

man urinating inside the ATM

కేసు నమోదు చేసిన పోలీసులు 

హైదరాబాద్‌: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి అందులోనే మూత్ర విసర్జన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌భవన్‌ రోడ్డులో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఏటీఎం ఉంది. అందులో డబ్బులు డ్రా చేసేందుకు ఈనెల 10న వ్యక్తి వచ్చాడు. డబ్బులు డ్రా చేసిన తర్వాత ఏటీఎం డబ్బులు తీసుకునే ప్రాంతంలో మూత్ర విసర్జన చేశాడు. 

దీంతో ఏటీఎం సెన్సార్‌ పాడయ్యింది. ఇటీవల ఏటీఎం పరిశీలించేందుకు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ రవికుమార్‌ రాగా సెన్సార్‌ పని చేయడం లేదని గ్రహించాడు. దీంతో సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వ్యక్తి ఉద్ధేశపూర్వకంగా మూత్రవిసర్జన చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు రవికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement