సాక్షి, నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు రోజు వ్యవధిలోనే రెండు చోట్ల భారీ గండ్లు పడ్డాయి. రాజవరం మేజర్ కాలువకు గండి పడింది. అలవాల సమీపంలో గండి పడటంతో నీరు వృధాగా పోతోంది. నిన్న త్రిపురారం మండలం తుంగపాడు మేజర్ కాలువకు గండి పడింది.
నీళ్లు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వేసవి కాలంలో కాలువల మరమ్మతులు చేయకపోవడంతో కాలువలు బలహీనంగా మారాయి. గండ్లు పడినా స్పందించడం లేదంటూ రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


