కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ | Congress Vs BJP Members Clash In Nalgonda | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ

Sep 1 2026 6:09 AM | Updated on Sep 1 2026 6:10 AM

Congress Vs BJP Members Clash In Nalgonda

బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఆ పార్టీ ఫ్లెక్సీలు చించివేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి యూత్‌ కాంగ్రెస్‌ యత్నం 

కార్యాలయ గేటుకు నల్లరంగు పూసి నిరసన  

ప్రతిగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడి 

దానిని నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి 

అడ్డుకోబోయిన వర్షిత్‌రెడ్డి తల్లిని తోసివేసిన కార్యకర్తలు 

బీజేపీ ఆఫీసుపై కూడా దాడికి కాంగ్రెస్‌ నేతల యత్నం 

అడ్డుకున్న పోలీసులు..కానిస్టేబుల్‌కు గాయాలు  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ /హైదరాబాద్‌/గన్‌ఫౌండ్రీ: బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల దాడులు, నిరసనలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు కాంగ్రెస్‌ శ్రేణులు నల్లరంగు వేయగా, ప్రతిగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై, బిహార్‌లో విద్యార్థులపై బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. 

బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న గేటుకు నల్ల రంగు పూసి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిష్టి»ొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.  
గాం«దీభవన్‌ ముట్టడికి యత్నం..  
బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణులు నల్ల రంగు పూయడంపై బీజేవైఎం శ్రేణులు మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గాం«దీభవన్‌ ముట్టడికి యతి్నంచారు. గాంధీభవన్‌పై కోడ్డిగుడ్లు విసిరేసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  

అట్టుడికిన నల్లగొండ 
బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పర నిరసన దాడులతో నల్లగొండ జిల్లా కేంద్రం అట్టుడికింది. శ్రీనగర్‌ కాలనీలో ఉన్న మంత్రి కోమటి­రెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై (వ్యక్తిగత కార్యాలయం) సోమవారం బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నేతృత్వంలో కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేశారు. అక్కడే ఉన్న మంత్రి ప్లెక్సీకి నిప్పంటించారు. దీంతో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో దేవరకొండ రోడ్డు చైతన్యపురికాలనీలో ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడిచేశారు. ఇంట్లోని టీవీ, డైనింగ్‌ టేబుల్, ప్రిజ్, తదితర వస్తువులను పగులగొట్టారు.

అడ్డుకోబోయిన వర్షిత్‌రెడ్డి తల్లిని కాంగ్రెస్‌ కార్యకర్తలు తోసేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడొకరు ఆమె తలను టీవీకేసి కొట్టారని, దీంతో ఆమెకు గాయాలయ్యాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆమెను చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చినట్టు పేర్కొన్నారు. అనంతరం కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. పోలీసులు కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వైపు వెళ్లి ఫ్లెక్సీలను ధ్వంసం చేసి రాళ్లు రువ్వారు.

ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్‌ తలకు గాయమైంది. మరోవైపు పార్టీ కార్యాలయం లోపలినుంచి బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడం, ఇరువర్గాలు ఎదురుపడితే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉండటంతో పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. వంద మంది వచ్చి నా ఇంటిపై దాడి చేశారని వర్షిత్‌రెడ్డి తల్లి శ్రీదేవి చెప్పారు.

ప్రశ్నిస్తే దాడులేనా?  
– జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాంచందర్‌రావు, ఏలేటి  
అధికారం అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగడం, ఇళ్లలోకి చొరబడి ఫరి్నచర్‌ ధ్వంసం చేయడం ఏమిటని కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండ సంజయ్‌ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడి చేయడాన్ని ఇద్దరూ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. 

బీజేపీ కార్యాలయాలు, నాయకుల నివాసాలపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడుల యత్నం పిరికిపంద చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న అరాచకానికి, గూండా రాజ్యానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి ప్రత్యక్ష నిదర్శనమని బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement