డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పించండి.. | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పించండి..

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పించండి.. కొడుకు నుంచి ప్రాణహాని ఉంది

నాకు సొంత ఇల్లు లేదు. 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ కూలిపని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న. నా అర్హతను ప్రభుత్వం పరిశీలించి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు మంజూరు చేయాలి.

– అరుణ, నల్లగొండ

నా కొడుకు విజయ్‌ కుమార్‌ నల్లగొండలో పోలీస్‌ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. నన్ను చంపుతానని ఫోన్‌చేసి బెదిరిస్తున్నాడు. గతంలో దాడి కూడా చేశాడు. తన కుమారుడి పుట్టినరోజు పేరుతో నన్ను పిలిచి దూషించి, కొట్టాడు. వృద్ధాప్యంలో ఉన్న నాకు కొడుకు నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. నా పోషణ కోసం కుమారుడి జీతం నుంచి తగిన జీవనభృతి ఇప్పించడంతోపాటు రక్షణ కల్పించాలి.

– లక్షమ్మ, వృద్ధురాలు, కట్టంగూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement