నల్లగొండ : ఖైదీలకూ న్యాయ హక్కులు ఉంటాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి హిమబింధు అన్నారు. సోమవారం నల్లగొండ జైల్‌ఖానాలో ఖైదీలకు హక్కులు, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని తెలిపారు. ఖైదీల హక్కులను పరిరక్షించడంతో పాటు చట్టంపై అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో న్యాయబద్ధత బలోపేతమవుతుందని తెలిపారు. తొలుతలామె ఖైదీలతో మా ట్లాడి వారి కేసుల పరిస్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎన్.భీమార్జున్‌రెడ్డి, లా స్కూల్ డీన్ ప్రొఫెసర్ వై.ప్రతాప్‌రెడ్డి, లీగల్ ఎయిడ్ సొసైటీ కోఆర్డినేటర్ ఎస్.కన్నన్, జిల్లా జైల్ సూపరింటెండెంట్ ఆనందరావు కూన, జైలర్లు బాలకృష్ణ, అచ్చయ్య, సిబ్బంది వెంకటేశ్వర్లు, జనార్దన్, గడ్డికొప్పుల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
నకిరేకల్ ఆస్పత్రికి సామగ్రి సమకూరుస్తాం
ఫ వైద్యవిదాన పరిషత్ రాష్ట్ర ప్రత్యేకాధికారి డాక్టర్ రాహుఫ్
నకిరేకల్ : సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభకాబోతున్న నకిరేకల్‌లోని 100 పడకల వైద్యశాలకు అవసరమైన వైద్య సామగ్రి, పర్నిచర్‌ను ఈ నెల 3వ తేదీలోగా సమకురుస్తామని వైద్యవిధాన పరిషత్ రాష్ట్ర స్పెషల్ ఆఫీసర్, అడిషనల్ జాయింట్ కమిషనర్ డాక్టర్ రాహుఫ్ వెల్లడించారు. నకిరేకల్ ఆస్పత్రి ఎక్యూమెంట్ విభాగం ఇన్‌చార్జి డాక్టర్ అలేఖ్యతో కలిసి సోమవారం సందర్శించారు. ఆసుపత్రికి అవసరమైన సామగ్రిని అంచనా వేశారు. దాదాపు 112 పడకలను, శస్త్రచికిత్స సామాగ్రిని ఈనెల 3వ తేదీన ఇక్కడికి చేరుస్తామని తెలిపారు. ఆయన వెంట డీసీహెచ్‌స్ మాతృనాయక్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శోబారాణి, సిబ్బంది కాంపాటి శ్యాం తదితరులు ఉన్నారు.
కోర్టుల్లో సమస్యలు పరిష్కరించాలని వినతి
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలో న్యాయవాదులు, కక్షిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ – సెషన్స్ జడ్జి పి.వసంత్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐఏఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న ఫ్యామిలీ కోర్టు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, స్పెషల్ మొబైల్ కోర్ట్ జడ్జి పోస్టులను తక్షణమే భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐఏఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేపల్లి ఆదిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కట్ట అనంత రెడ్డి, గుండె వెంకటేశ్వర్లు, గోగికార్ జవహర్‌లాల్, ఎండీ నజీరుద్దీన్, ఐలయ్య, బరిగెల నగేష్, వెంకటేష్, కొండాపురం అరుణ్ కుమార్ న్యాయవాదులు పాల్గొన్నారు.
పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
నల్లగొండ : చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దరఖాస్తుదారులు ఇది గమనించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మహా శివుడికిసంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు ఘనంగా కొనసాగాయి.


