న్యూస్‌రీల్
బీజేపీ – కాంగ్రెస్
నల్లగొండలో పొలిటికల్ హీట్
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : బీజేపీ–కాంగ్రెస్ పరస్పర దాడులతో నల్లగొండ పట్టణంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్‌లో మొదలైన రాజకీయ వివాదం జిల్లాకు చేరడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పరస్పర దాడులు, ఆరోపణలు, ఫ్లెక్సీల ధ్వంసం, నినాదాలతో పట్టణంలో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు
వరుస ఘటనలతో నల్లగొండలో పోలీసులు భారీగా మోహరించారు. మంత్రి క్యాంపు కార్యాలయం, బీజేపీ కార్యాలయం, బస్టాండ్, గడియారం సెంటర్, దేవరకొండ రోడ్డు తదితర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఎదురుపడకుండా పోలీసులు అడ్డుకట్ట వేశారు.
నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మంగళవారం నల్లగొండకు రానున్నారు. నల్లగొండలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిని కార్యకర్తలను పరామర్శించనున్నారు.
ఫ మంత్రి క్యాంపు ఆఫీస్‌పై బీజేపీ దాడి
ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంట్లో సామగ్రి ధ్వంసం
ఫ పట్టణంలో ఉద్రిక్తత
ఫ పోలీసుల భారీ బందోబస్తు


