
ఎడపల్లి (బోధన్): నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో పిచ్చెక్కిన ఆవు స్వైర విహారం చేసి 13 మందిని గాయపరిచింది. గ్రామంలో మూడు రోజుల క్రితం ఒక ఆవును కుక్కలు కరిచాయి. ఈ క్రమంలో మతిస్థిమితం తప్పిన ఆవు.. గురువారం ఉదయం నుంచి గ్రామంలో తిరుగుతూ పలువురిపై దాడి చేసి గాయపరిచింది.
సాయంత్రం ఆటోపై దాడి చేయడంతో అందులోని ముగ్గురికి గాయాలయ్యాయి. ఆవు సైతం గాయపడి మృతి చెందింది. సమాచా రం అందుకున్న ఎస్‌ఐ వంశీచందర్ రెడ్డి గ్రామానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వెటర్నరీ సిబ్బంది ఆవును పరీక్షించి కళేబరాన్ని తరలించారు.