మాటల్లో చెప్పలేం.. మీర్‌ పేట్‌ హత్య కేసులో నివ్వెరపోయే విషయాలు | Latest Updates On Madhavi And Gurumurthy Meerpet Case | Sakshi
Sakshi News home page

గురుమూర్తి మనిషి కాదు.. నరరూప రాక్షసుడు: రాచకొండ సీపీ

Jan 28 2025 5:26 PM | Updated on Jan 28 2025 6:54 PM

Latest Updates On Madhavi And Gurumurthy Meerpet Case

సంచలనం సృష్టించిన మీర్‌ పేట్‌ వెంకట మాధవి హత్య కేసులో భర్త గురుమూర్తి గురించి పోలీసులు విస్తుపోయే వాస్తవాల్ని వెల్లడించారు.

సాక్షి,హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన మీర్‌పేట (meerpet)  వెంకట మాధవి (venkata madhavi) హత్య కేసులో భర్త గురుమూర్తి (gurumurthy) గురించి పోలీసులు విస్తుపోయే వాస్తవాల్ని  వెల్లడించారు. గురుమూర్తి మనిషి కాదని.. మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు. ఆయనలో ఎలాంటి పశ్చాతాపం కనిపించడం లేదంటూ రాచకొండ సీపీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సుధీర్‌ బాబు కేసు విషయాల్ని వెల్లడించారు. 
 
భార్యను ఇంత దారుణంగా చంపిన గుర్తుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు.  క్షణికావేశంలో జరిగిన హత్య కాదు.. పథకం ప్రకారమే హత్య చేశాడు. చూడటానికి మనిషి బాగున్నా. స్వతాహాగానే క్రూరుడు. గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్య ఎలా చేశాడో మాటల్లో చెప్పలేం.  ఈ నెల 15,16 తేదీల్లో దంపతుల మధ్య గొడవ జరిగింది.  

16న ఉదయం 8 గంటలకు ఆమెతో అకారణంగా గొడవపెట్టుకొని ఘర్షణకు దిగాడు. మాధవి తల గోడకేసి మోదాడు. ఆపై గొంతు నులిమి హతమార్చాడు. ఇంట్లో ఉన్న కత్తితో కాళ్లు, చేతులు, బాడీ, తల నాలుగు భాగాలుగా కట్‌ చేశాడు. శరీర భాగాల్ని వాటర్‌ హీటర్‌తో నీళ్లు మరిగించి ఉడక బెట్టాడు. ఉడక బెట్టిన శరీర భాగాల్ని మరింత చిన్నవిగా చేసేందుకు ఇంట్లో ఉన్న పెద్ద గ్యాస్‌ మీద పెట్టి కాల్చాడు. కాల్చిన అనంతరం రోకలి బండతో శరీరభాగాలను దంచి పొడి చేశాడు. ఆ పొడిని సాయంత్రం ఆరుగంటల సమయంలో ప్లాస్టిక్‌ బకెట్‌లో తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో పోశాడు.

ఇంటికొచ్చిన తర్వాత ఉదయం ఎలా అయితే శుభ్రంగా ఉందో.. అలాగే శుభ్రం చేశాడు. ఆ తర్వాత బంధువుల ఇంటికి వెళ్లి పిల్లల్ని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికొచ్చిన పిల్లలు తమ అమ్మ గురించి అడగ్గా.. మాధవి గురించి పిల్లలకు లేనిపోనివి అన్నీ చెప్పాడు. మమ్మి నాతో గొడవ పెట్టుకుని ఎక్కడికో వెళ్లిందని నమ్మించాడు.

భార్యను హత్య చేసిన తర్వాత శరీర భాగాల్ని కట్‌ చేసిన బెడ్ రూంకు తాళ వేశాడు. అలా రెండ్రోజుల పాటు మేనేజ్‌ చేసిన తర్వాత.. బాధితురాలి తల్లిదండ్రులు రావడం.. తప్పని సరి పరిస్థితుల్లో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు మిస్సింగ్‌ కప్లయింట్‌ నమోదు చేయడం. ఆ కంప్లయింట్‌ ద్వారా విచారణ చేపట్టాం.

పోలీసుల విచారణలో గురుమూర్తి పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ముందుగా మాధవి డెడ్‌ బాడీ గురించి అడ్డగా.. జిల్లెల గూడా చెరువు పక్కనే ఉన్న మున్సిపాలిటీ చెత్తకుప్పలో పడేశానని చెప్పాడు. కానీ వాస్తవం అది కాదు. కేసు నుంచి తప్పించుకోవాలనే అలా చెప్పాడు. ఈ కేసులో నిందితుడు ఉపయోగించిన 16 రకాల ఆధారాల్ని లభ్యం చేసుకున్నాం.’అని వెల్లడించారు.  

👉చదవండి : ఏపీ యువతి కేసులో సుప్రీం సంచలన తీర్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement