కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎ​ప్పుడేం జరిగింది? | Konda Surekha issue how began where originated when concluded | Sakshi
Sakshi News home page

కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎ​ప్పుడేం జరిగింది?

Sep 3 2026 3:20 PM | Updated on Sep 3 2026 3:38 PM

Konda Surekha issue how began where originated when concluded

మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌ అయ్యారు. కొండా సురేఖ గురించి చెప్పాలంటే ఆమె చుట్టూ ఎప్పుడూ వివాదాలే. జెన్‌ జీ భాషలో చెప్పాలంటే వివాదాలు ఎల్లప్పుడూ ఆమె చుట్టూ వైఫైలా ఉంటాయి. ఇటీవల ఆమెను చుట్టుకున్న వివాదం ఆమె పదవి పోవడానికి కారణమైంది. కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎ​ప్పుడేం జరిగింది? ఆమె మంత్రి పదవి పోవడానికి ఎలా కారణమైంది?

ఆగస్టు 16న రేవూరిని మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు సీఎం రేవంత్‌ రెడ్డి. ‘‘పరకాలకు కాబోయే ఎమ్మెల్యే కొండా సుస్మిత’’ అంటూ ఆగస్టు 18న కొండా సురేఖ కూతురు సుస్మిత తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ స్టోరీ పోస్ట్ చేశారు. ‘‘కొండా టీమ్‌’’ అనే ఖాతాలో చేసిన పోస్ట్‌నే ఆమె తన స్టోరీగా పెట్టుకున్నారు. దీంతో వివాదం మొదలైంది. ఆగస్టు 19న కొండా సుస్మిత తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు టికెట్‌ ఇవ్వడానికి రేవంత్‌ రెడ్డి ఎవరు?’’ అంటూ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపేలా కామెంట్లు చేశారు. దీంతో కొండా సురేఖ స్పందించకతప్పలేదు. తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని అన్నారు.

ఆ తర్వాత ఏం జరిగింది?

ఆగస్టు  21: కొండా సురేఖపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రెస్‌మీట్‌. రాజీనామాకు డిమాండ్‌.

ఆగస్టు 23: బెంగళూరులో ఖర్గేను కలిసిన కొండా సురేఖ

ఆగస్టు 24: విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి

ఆగస్టు 24: కొండా సురేఖ వివరణపై సంతృప్తి చెందని క్రమశిక్షణ కమిటీ

ఆగస్టు 25: కాంగ్రెస్‌ హైకమాండ్‌కు చేరిన క్రమశిక్షణ కమిటీ నివేదిక

ఆగస్టు 26: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా దంపతుల భేటీ

ఆగస్టు 27: వ్యవహారం ఏఐసీసీ పరిధికి వెళ్లిందన్న పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌

ఆగస్టు 28: సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి రాఖీ కట్టిన కొండా సురేఖ

సెప్టెంబరు 2: కాంగ్రెస్‌ పెద్దలతో రేవంత్‌ రెడ్డి భేటీ

సెప్టెంబరు 3: మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement