సెక్రటేరియట్‌ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతల అరెస్ట్‌ | Tension during BJP's siege of the Secretariat | Sakshi
Sakshi News home page

సెక్రటేరియట్‌ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతల అరెస్ట్‌

Sep 3 2026 1:06 PM | Updated on Sep 3 2026 1:16 PM

Tension during BJP's siege of the Secretariat

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫీజురీయంబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈ రోజు (గురువారం) బీజేపీ చేపట్టిన సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ముట్టడికి పెద్దఎత్తున బీజేపీ నేతలు తరలివచ్చారు.  సెక్రటేరియట్ ముందు బైఠాయించి ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.

అనంతరం గేటు ఎక్కి మరి సచివాలయంలోకి వెళ్లడానికి యత్నించారు.  దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అనంతరం అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ముట్టడిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ రావు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement