సాక్షి, హైదరాబాద్: నిరక్షరాస్యులైన ముగ్గురు వ్యక్తులు బతుకుదెరువు కోసం గిగ్ వర్కర్లుగా మారారు. స్మార్ట్‌ఫోన్‌లో రీల్స్ చూసి నకిలీ నోట్ల తయారీ విధానం తెలుసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దొరికిన ఫోన్ నంబర్‌లో సంప్రదించి ముడిసరుకు, ఉపకరణాలు పొందారు. వాటర్ మార్కు కోసం ర్యాపింగ్ కవర్లను నైపుణ్యంతో కత్తిరించి వాడారు. ఇలా రూపొందిన నకిలీ నోట్లను రాత్రి వేళల్లో వైన్, పాన్‌షాపుల వద్ద మారి్పడి చేస్తూ శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు.
కేసు వివరాలను బుధవారం రాజేంద్రనగర్‌లోని కార్యాలయంలో అదనపు డీసీపీ కేఎస్ రావు వెల్లడించారు. నల్లగొండ జిల్లా వాడిపట్ల చింతల్ తండాకు చెందిన సమీప బంధువులు రమావత్ రాము అలియాస్ మహమ్మద్, రమావత్ మోతిలాల్ గిగ్ వర్కర్లు కాగా, రమావత్ గాంధీ ఆటోడ్రైవర్. బతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చి బాలాపూర్‌లో నివసిస్తున్నారు. ఈ త్రయం తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలను అన్వేషించింది.
ఈ నేపథ్యంలోనే రాము తన స్మార్ట్‌ఫోన్‌లో ఓ ఇన్‌స్టా్రగామ్ రీల్ చూశాడు. నాగోల్ బండ్లగూడకు చెందిన చెర్ల సు«దీర్ పోస్టు చేసిన రీల్‌లో నకిలీ నోట్లు ఎలా తయారు చేయాలో ఉంది. దీంతో రాము.. ఈ విషయం మోతీలాల్, గాం«దీలకు చెప్పాడు. వాళ్లూ అంగీకరించడంతో ఇన్‌స్టాలోనే దొరికిన ఫోన్ నంబర్‌లో సంప్రదించి స్కానర్, కలర్ ప్రింటర్లతో పాటు కట్టర్, బాండ్ పేపర్లు కొన్ని రసాయనాలు ఖరీదు చేశాడు.
వాటర్ మార్క్ సైతం
ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.200 నోట్లను స్కాన్ చేసిన ఈ ముగ్గురూ కలర్ ప్రింటర్ ద్వారా బాండ్ పేపర్‌పై ప్రింట్ తీశారు. వీటిని కత్తిరించడంతో పాటు వాటర్ మార్క్ కోసం ర్యాపింగ్ కవర్లు కత్తిరించి, చాకచక్యంగా అతికించి అసలైన నోటుగా చేసి బాలాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లోని వైన్, పాన్ షాపుల్లో రాత్రి సమయంలో మార్చారు. రూ.లక్ష అసలు కరెన్సీ ఇస్తే రూ.2.5 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామంటూ పరిచయస్తులకు సమాచారం అందించారు.
మరోపక్క ఓ పాన్‌షాప్ నిర్వాహకుడు నగదును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లగా వాటిలో నకిలీ నోట్లు ఉన్నట్లు తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం బాలాపూర్‌లో రాము, మోతిలాల్, గాంధీలను పట్టుకున్నారు. రూ.2.91 లక్షల నకిలీ కరెన్సీతో పాటు సామగ్రి, ప్రింటర్, స్కానర్ స్వా«దీనం చేసుకున్నారు.
మన చావును ఇలా తెలుసుకోవచ్చట.. షాకిస్తున్న జపాన్ అధ్యయనం!


