త్వరలోనే ఎమ్మెల్యే పీఏ అరెస్ట్‌? | Bhadrachalam MLA Tellam Venkat Rao PA Kalyan Big Sca | Sakshi
Sakshi News home page

త్వరలోనే ఎమ్మెల్యే పీఏ అరెస్ట్‌?

Sep 3 2026 11:46 AM | Updated on Sep 3 2026 12:01 PM

Bhadrachalam MLA Tellam Venkat Rao PA Kalyan Big Sca

భద్రాచలంటౌన్‌: ఉద్యోగాల పేరిట వసూళ్లకు పాల్పడినట్లు భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌పై ఆరోపణలు రావడం, ఆపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదైన విషయం విదితమే. ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐదు రోజులుగా భద్రాచలం డీఎస్పీ ఆధ్వర్యాన రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే, కల్యాణ్‌ను అధికారికంగా అరెస్ట్‌ చూపించే విషయంలో జాప్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఇంకొన్ని వివరాలపై స్పష్టత వచ్చాక ఒకటి, రెండు రోజుల్లో అరెస్ట్‌ చూపించే అవకాశమున్నట్లు సమాచారం. 

భద్రాచలానికి చెందిన ఒక ఆటో డ్రైవర్‌ డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం తొలుత వెలుగులోకి వచ్చింది. తాజాగా దుమ్ముగూడెం మండలానికి చెందిన మరో బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ దుమ్ముగూడెం మండల అధ్యక్షుడు తెల్లం హరికృష్ణ తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తాననే హామీతో రూ.15 లక్షలు చెల్లించినట్లు ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇందులో మూడు విడతల్లో రూ.14.50 లక్షలను కల్యాణ్‌ కుటుంబ సభ్యుల ఖాతాల్లో, మరో రూ.50 వేలు హరికృష్ణ ఖాతాలో జమ చేసినట్లు ఆధారాలు సమర్పించినట్లు తెలిసింది.

బినావీులపై నజర్‌
అధికార పార్టీ నాయకుల పాత్ర సైతం కుంభకోణంలో బయటపడుతుండడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారి సైతం కల్యాణ్‌ను స్వయంగా విచారించినట్లు సమాచారం. అయితే విచారణలో కల్యాణ్‌ చెబుతున్న సమాధానాలు నమ్మశక్యంగా లేవని తెలిసింది. ఆయనకు మణుగూరుతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు, బినామీల ఖాతాలు, లావాదేవీలపై దృష్టి సారించారు. కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి భారీగా నగదు జమ కావడం, ఆ వెంటనే ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారని తెలిసింది. ఈక్రమాన రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉద్యోగిని విచారించగా, కల్యాణ్‌కు బినామీగా వ్యవహరించాడనే అనుమానంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని ఒకరికి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  

చదవండి: కవితపై అనుచిత వ్యాఖ్యలు..కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement