కవితపై అనుచిత వ్యాఖ్యలు..కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌ | Police Constable Suspended For Making Objectionable Remarks About Kavitha On Social Media, Check More Details | Sakshi
Sakshi News home page

కవితపై అనుచిత వ్యాఖ్యలు..కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

Sep 3 2026 11:05 AM | Updated on Sep 3 2026 11:30 AM

Constable suspended for inappropriate comments on Kavitha

జీడిమెట్ల: సామాజిక మాధ్యమాలలో టీఅర్‌ఎస్‌ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ అధ్యక్షురాలు కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌ పై వేటు పడింది. 2018 బ్యాచ్‌కు చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ కే అనిల్‌ ప్రస్తుతం సైబరాబాద్‌ సీఏఆర్‌ నుంచి ఆర్డర్‌ టు సర్వ్‌లో భాగంగా హైదరాబాద్‌ సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సోషల్‌ మీడియాలో కవితనుద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు అధికారుల దృష్టికి వచి్చంది. 

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్‌ రమేష్‌.. కానిస్టేబుల్‌ అనిల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్‌ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తన, గౌరవప్రదమైన వ్యవహారశైలిని పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాను ఉపయోగించే సమయంలో కూడా పోలీస్‌ సిబ్బంది బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement