సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ ఎపిసోడ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మారింది. రేవంత్ ఫిర్యాదుతో కొండా సురేఖపై వేటు వేసిన కాంగ్రెస్ అధిష్టానం..మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. కొండా భవిష్యత్ కార్యాచరణపై ఉఠ్కంత కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని తన నివాసం ముందు కొచ్చిన కొండా సురేఖ భర్త కొండా మురళి.. మీసం మెలేయడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, తన నివాసంలో మీడియ సమావేశంలో మాట్లాడిన కొండా సురేఖ.. తన బిడ్డ వ్యాఖ్యలకు తనను టార్గెట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. నాకు పదవులపై వ్యామోహం లేదు. నా వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావడం సంతోషం. సీఎం రేవంత్ బ్లాక్‌మెయిల్ రాజకీయం చేశారు. అధిష్టానానికి నన్ను తొలగించే ఆలోచన లేదు. రేవంత్ బ్లాక్‌మెయిల్ చేయడంతోనే నన్ను తొలగించారు. నన్ను బర్తరఫ్ చేయకపోతే తాను వెళ్లిపోతానని బెదిరించారు. రేవంత్ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. కావాలని నన్ను ఇబ్బందిపెడుతున్నారు’’ అని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.


