breaking news
Konda Murali
-
ఎవరికీ భయపడేది లేదు : కొండా మురళి
-
వరంగల్ రాజకీయంలో కొత్త ట్విస్ట్.. మీనాక్షితో కొండా దంపతుల ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, మురళి ఎపిసోడ్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. ఇంచార్జి మీనాక్షికి 16 పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో వరంగల్ జిల్లాలోగ్రూప్ రాజకీయాల గురించి వివరించినట్టు సమాచారం.ఈ క్రమంలో తమపై వచ్చిన ఆరోపణలపై కొండా దంపతులు ఇద్దరు సమాధానం చెప్పారు. ఉమ్మడి వరంగల్‌లో నియోజకవర్గం వారిగా ఇంచార్జీకి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిపారు. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోమని కోరారు. రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని వారిద్దరూ నివేదికలో క్లారిటీ ఇచ్చారు. నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చారు.అనంతరం, కొండా మురళి సాక్షితో మాట్లాడుతూ..‘నేను వెనకబడిన వర్గాల ప్రతినిధిని. నలభై నాలుగు ఏళ్ల నుండి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. వైఎస్సార్ హయం నుంచి మేము నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. పని చేసే వారిపైనే విమర్శలు వస్తాయి. క్షమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా నన్ను రెచ్చగొడుతున్నారు. నేను మొదటిసారి కాంగ్రెస్ ఇంచార్జిని కలిశాను. రేపటి సభకు వరంగల్ నుండి ఎంత జనసమీకరణ చేయాలని మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీని బతికించడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా లక్ష్యం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేళ్లు సీఎంగా ఉండేలా చూడడం నా లక్ష్యం. బీసీ బిడ్డగా పీసీసీకి నేను అన్ని రకాలుగా మద్దతు ఉంటుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ కాంగ్రెస్ గెలిచేలా నేను తీసుకుంటాను. రేపు ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత నాదే. నేను ఎవరికి భయపడేది లేదు. బీసీ కార్డుతోనే పనిచేస్తా.. బీసీల అభ్యున్నతికి పనిచేస్తాను. సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే నేను జోక్యం చేసుకుంటున్నాను. నాకు భయం లేదని ముందు నుంచే చెబుతున్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. పెద్ద పెద్ద కేసులకే నేను భయపడలేదు. ఇదే సమయంలో నాపై ఆరోపణలు చేస్తున్న వారు కూడా నాకు భయపడరు. మా ఇంట్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. నా కూతురు ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుసు?. నా కూతురు ఫ్యూచర్ ఏంటో ఆమె డిసైడ్ అవుతుంది. మాది పరకాల.. వంశపారంపర్యంగా పరకాల అడిగితే తప్పేంటి?. భవిష్యత్‌లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో గతంలో నటి సమంత, నటుడు నాగార్జునపై సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా మురళి తన లేఖలో వివరణ ఇచ్చారు. మహేష్ బాబు, రాజమౌళిలపై కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన అంశాలను మాత్రమే తాను పేర్కొన్నట్లు చెప్పారు. కొందరు కావాలని సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్ప సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని లేఖలో క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు మురళి వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాను. రూల్స్ ప్రకారమే నేను పని చేస్తున్నాను. నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ పరిశీలించుకోవచ్చు. మంత్రిగా నేను ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదు. నా మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా నేను స్పందించను అంటూ కామెంట్స్ చేశారు. -
కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
-
కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్!
సాక్షి, వరంగల్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, కొండా మురళి రాజకీయ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరంగల్ రాజకీయం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి తరుణంలో కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.తాజాగా వరంగల్‌లో ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో కొండా మురళి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొండా మురళి మాట్లాడుతూ..‘గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చుపెట్టి విజయం సాధించాం. నాకు 500 ఎకరాల భూమి ఉంది.. ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది. నా రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే నా పోటీ ఉంటుంది. వాసవి కన్యక పరమేశ్వరీ సాక్షిగా చెబుతున్నా నాకు ఎవరి పైసా అవసరం లేదు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. అలాగే, నేను ఎవరికీ భయపడను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌లో కొండా దంపతుల రాజకీయంపై ఉమ్మడి వరంగల్ జిల్లా హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొండా మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటీవల పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన శనివారం గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. గాంధీభవన్‌కు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చిన ఆయన.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ముందు వివరణ ఇచ్చారు. ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు.అనంతరం కొండా మురళి మాట్లాడుతూ.. ‘‘నా వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇచ్చాను. కాంగ్రెస్ నేతలంటే నాకు గౌరవం ఉంది. కొందరు నేతలపై వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు. నేను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసు. కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరాను. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావాలి. బీసీలకు మేలు జరగాలని 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన మా అందరిలో ఉంది’’ అని పేర్కొన్నారు. -
కొండా మురళీ లేఖ నేపథ్యంలో ఎమ్మెల్యేల సమావేశం
-
కాంగ్రెస్‌లో ‘కొండా’ కల్లోలం.. ఆ పార్టీ ఎమ్మెల్యేల అత్యవసర భేటీ
సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్ రాజకీయాలు.. అధికార కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తున్నాయి. కొండా మురళీ లేఖ నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్‌తో సహా పలువురు భేటీ అయ్యారు.కాగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్న లేఖ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మురళి శనివారం భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చి, నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమైన సంగతి తెలిసిందే. కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు శ్యాంమోహన్, జి.వి.రామకృష్ణ, కమలాకర్‌రావులతో గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగింది.ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి, తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఆ లేఖలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. సీఎం సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి గురించి పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.పొంగులేటి మాపై కక్షగట్టారు!: కొండా మురళి క్రమశిక్షణ కమిటీ భేటీకి వెళ్లడానికి ముందే ప్రచారంలోనికి వచ్చిన ఆ లేఖలో తొలుత మంత్రి పొంగులేటి గురించి ప్రస్తావించినట్లు సమాచారం. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దళితులు, గిరిజనులకు ఎక్కువ సీట్లు వచ్చేలా తాను పనిచేశానని, అందుకే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు రిజర్వుడ్ కేటగిరీకి వెళ్లాయని తెలిపారు.ఈ పరిణామంతో సీటు కోల్పోయిన కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి.. అందుకు తానే కారణమని చెబుతూ రాజకీయాలకు దూరమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన అల్లుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వచ్చి, ఆ కోపంతో తన సతీమణి, మంత్రి కొండా సురేఖపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డి గతంలో కొండా సురేఖపై పోటీ చేస్తే 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, డీలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయేందుకు కూడా తానే కారణమని నరేందర్‌రెడ్డి కోపం పెంచుకున్నారని లేఖలో పేర్కొనట్లు సమాచారం.జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కూడా కొండా మురళి తన లేఖలో వివరించినట్లు తెలిసింది. వర్ధన్నపేటలో తమ ప్రభావం బలంగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో సత్సంబంధాలున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నుంచి గత ఎన్నికల్లో తననే పోటీ చేయాలని ప్రజలు కోరినా టీడీపీ నుంచి వచ్చిన గండ్ర సత్యనారాయణకు మద్దతిచ్చామని, ఇప్పుడు ఆయన తమకు వ్యతిరేకంగా ఇతర నేతలతో కలిశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. -
కొండా లేఖ కలకలం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్న లేఖ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మురళి శనివారం భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చి, నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమ య్యారు. కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు శ్యాంమోహన్, జి.వి.రామకృష్ణ, కమలాకర్‌రావులతో గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి, తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఆ లేఖలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. సీఎం సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి గురించి పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పొంగులేటి మాపై కక్షగట్టారు!: కొండా మురళి క్రమశిక్షణ కమిటీ భేటీకి వెళ్లడానికి ముందే ప్రచారంలోనికి వచ్చిన ఆ లేఖలో తొలుత మంత్రి పొంగులేటి గురించి ప్రస్తావించినట్లు సమాచారం. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దళితులు, గిరిజనులకు ఎక్కువ సీట్లు వచ్చేలా తాను పనిచేశానని, అందుకే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు రిజర్వుడ్ కేటగిరీకి వెళ్లాయని తెలిపారు. ఈ పరిణామంతో సీటు కోల్పోయిన కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి.. అందుకు తానే కారణమని చెబుతూ రాజకీయాలకు దూరమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన అల్లుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వచ్చి, ఆ కోపంతో తన సతీమణి, మంత్రి కొండా సురేఖపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డి గతంలో కొండా సురేఖపై పోటీ చేస్తే 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, డీలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయేందుకు కూడా తానే కారణమని నరేందర్‌రెడ్డి కోపం పెంచుకున్నారని లేఖలో పేర్కొనట్లు సమాచారం.మా సాయం పొంది.. మాకే వ్యతిరేకంగా.. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కూడా కొండా మురళి తన లేఖలో వివరించినట్లు తెలిసింది. వర్ధన్నపేటలో తమ ప్రభావం బలంగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో సత్సంబంధాలున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నుంచి గత ఎన్నికల్లో తననే పోటీ చేయాలని ప్రజలు కోరినా టీడీపీ నుంచి వచ్చిన గండ్ర సత్యనారాయణకు మద్దతిచ్చామని, ఇప్పుడు ఆయన తమకు వ్యతిరేకంగా ఇతర నేతలతో కలిశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ములుగు నియోజకవర్గానికి చెందిన మంత్రి సీతక్కతో తమకు ఎలాంటి విభేదాలు లేవని మురళి తెలిపారు. మంత్రులు సురేఖ, సీతక్క మధ్య గ్యాప్ వచ్చిందని కడియం శ్రీహరి మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాల పూర్తిగా తమ నియోజకవర్గమేనని, అందులోనే తమ స్వగ్రామం ఉందని గుర్తుచేసిన ఆయన.. ఎన్నికల సమయంలో రేవూరి అభ్యర్థన మేరకు మనస్ఫూర్తిగా సహకారం అందించినట్లు తెలిపారు. అయినా ప్రకాశ్‌రెడ్డి తమకు వ్యతిరేకంగా గూడుపుఠాణీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డట్లు తెలిసింది. నాయిని రాజేందర్‌రెడ్డి (వరంగల్æ వెస్ట్) కూడా ఎన్నికల సమయంలో తమ మద్దతు కోరారని, ఇప్పుడు తమ నియోజకవర్గంలోకి వచ్చి (వరంగల్ ఈస్ట్) ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నారని అభ్యంతరం తెలిపారు. తమ పరిధిలోనికి వచ్చే ఎంజీఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. జనగామలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తమతో బాగానే ఉంటున్నారని వెల్లడించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి వచ్చి స్థానిక కాంగ్రెస్ ఇన్చార్జి ఇందిరకు చుక్కలు చూపిస్తున్నారని, కేడర్‌ను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు. పాలకుర్తిలో యశస్వినిరెడ్డి, డోర్నకల్ రాంచంద్రునాయక్లతో కూడా తమకు ఇబ్బంది లేదని మురళి తెలిపినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇప్పటివరకు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదని తెలిపారు. మా పవర్ గురించి చెప్పాల్సిన పనిలేదుతాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు తమతో వచ్చారని, వరంగల్‌లో కొండా దంపతుల పవరేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆ లేఖలో మురళి పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, ఆ లేఖ గురించి తనకు తెలియదని, బయట ఏం ప్రచారం జరుగుతుందో తన దృష్టికి రాలేదని క్రమశిక్షణ కమిటీ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొండా మురళి వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
ఎవరి బలం ఎంతో ప్రజలందరికీ తెలుసు.. దయచేసి నన్ను రెచ్చగొట్టొద్దు
-
బిగ్ ట్విస్ట్.. కొండా మురళీకి మళ్లీ నోటీసులు
గాంధీభవన్‌లో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఉల్టా వరంగల్ నేతలపైనే ఫిర్యాదు చేశారు. అయితే కాసేపటికే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనకు ట్విస్ట్ ఇచ్చింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ మళ్లీ నోటీసులు జారీ చేసింది. సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దుమారాన్ని రేపాయి. వరంగల్ జిల్లాలోని సొంత పార్టీనేతలపై కొండా మురళి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి వంటి సీనియర్ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యలు త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతీకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీలో అంతర్గతంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో శనివారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు కొండా మురళిని హాజరయ్యారు. కమిటీ ముందు తనపై ఫిర్యాదు చేసిన నేతలపైనే ఆయన ఫిర్యాదు చేశారు. అయితే, తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వని అంశాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కోరింది. కొండా ఇచ్చిన సమాధానం తర్వాత మిగత ప్రక్రియ ఉంటుందని కమిటీ తెలిపింది. కొండా మురళి ఇచ్చింది వివరణ కాదు: మల్లు రవికొండా మురళి తమపై చేసిన విమర్శలకు గాను కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌తో పాటు,క్రమ శిక్షణా కమిటీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలంటూ కొండా మురళీకి క్రమ శిక్షణా కమిటీ నోటీసులు పంపించింది. ఈ తరుణంలో ఇవాళ గాంధీ భవన్లో క్రమశిక్షణా కమిటీ ముందుకు కొండా మురళి వచ్చారు. ఇదే అంశంపై క్రమ శిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి చిట్‌చాట్ నిర్వహించారు. కొండా మురళీకి నేనే ఫోన్ చేశా. ఇవాళ కమిటీ ముందుకు వచ్చారు. కొండా మురళీ ఇచ్చింది వివరణ కాదు. ఇది ఆరంభం మాత్రమే. కొండా మురళీ కేసును ఇప్పుడే పరిశీలిస్తున్నాం.మా కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంది. కొండా మురళీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరాను. వారం రోజుల్లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పాము. ఏ ఫిర్యాదులు ఉన్నా లిఖిత పూర్వకంగా రాసి సంతకాలు పెట్టి ఇవ్వాలని కోరినట్లు చిట్‌చాట్‌లో మల్లు రవి వెల్లడించారు. మళ్లీ రేవంత్ అన్నే సీఎం: కొండా మురళిఇక క్రమ శిక్షణా కమిటీతో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. ‘ఎవరి బలమెంతో ప్రజలందరికి తెలుసు. దయ చేసి నన్ను గెలకొద్దు. రాహుల్ గాంధీ అంటే నాకు గౌరవం, కాంగగ్రెస్ను గౌరవిస్తాను. రేవంత్ అన్న మళ్లీ సీఎం అవ్వాలి. బీసీ నాయకుడు మహేష్ అన్నకు మరిన్ని పదవులు రావాలి. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అయినందుకు సంతోషపడుతున్నా. నేను మాట్లాడింది తప్పా? లేదా? అన్నది నా అంతరాత్మకు తెలుసు. నేను కేసులకు బయపడేవాడిని కాదు.’ అని వ్యాఖ్యానించారు. -
మాజీ MLC కొండా మురళీ రివర్స్ కౌంటర్
-
కాసేపట్లో క్రమశిక్షణ కమిటీ ముందుకు కొండా మురళి
-
కొండా మురళి ఎపిసోడ్లో ట్విస్ట్
ఓరుగల్లు కాంగ్రెస్ వర్గపోరు పంచాయితీలో ట్విస్ట్ చోటు చేసుకుంది. గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరైన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. వరంగల్ జిల్లా నేతలపైనే ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయ్యింది.హైదరాబాద్, సాక్షి: కొండా మురళి వ్యాఖ్యల వ్యవహారంపై శనివారం గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ అయ్యింది. కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని.. ఆయనపై చర్యలు తప్పవని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన రివర్స్ కౌంటర్‌కు దిగారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న వరంగల్ కీలక నేతలపైనే కమిటీకి ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిపై ఆయన క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. అందులో.. స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరను ఇబ్బంది పెడుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలను కడియం కష్టపెడుతున్నారని, అలాగే పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి రేవూరి సహకరిస్తున్నారని.. అక్రమ క్రషర్కు సహకరిస్తున్నారని ఆరోపించారు. వీళ్లిద్దరితో పాటు నాయిని రాజేందర్‌రెడ్డి పేరును కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణా కమిటీని కోరారు. ఈ నివేదికను కమిటీ స్వీకరించింది.క్రమశిక్షణ కమిటీతో కొండా మురళీ..కమిటీ ముందుకు రావాలని ఎవరూ నన్ను పిలవలేదు. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చా. భూపాలపల్లి నుంచి నేనే పోటీ చేయాలనుకున్నా. వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ పోటీ చేసింది కాబట్టి నేను తప్పకున్నా. మరో పార్టీ నుంచి గండ్ర వచ్చినా ఆయన మద్దతు ఇచ్చి ప్రచారం చేశా. ఇప్పుడు ఆయనే ఇతరులతో కలిసి నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. కొండా సురేఖ-సీతక్కలు కలిసే పని చేసుకుంటున్నారు. సీతక్కతో మాకు పంచాయితీ లేదు. వాళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని కడియం ప్రచారం చేస్తున్నారు. కడియం కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. పరకాల పూర్తిగా మాదే. రేవూరికి నిస్వార్ధంగా సహాయం చేశాం. అతనిప్పుడు మాపై గుడుపూటానీ రాజకీయాలు చేస్తున్నారు. మా మద్దతుతోనే రేవూరి గెలిచారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేస్తున్నారు. నాయిని తనకి సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నాడు. వేం నరేందర్ రెడ్డి సీటు ఎగిరిపోవడానికి నేనే కారణమని నాపై కోపంగా ఉన్నట్టున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు రాజీనామా చేసి వచ్చాను. పార్టీలోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లను తీసుకోవచ్చా. కొంతంది లాగా పార్టీ మారి పదవిని ఎంజాయ్ చేయడం లేదు. ఇండియాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని నేను అని కమిటీకి నిచ్చిన లేఖలో పేర్కొన్నారాయన. వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్‌లో చిచ్చు రాజేశాయి. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు కొండా మురళి సుమారు 60 వాహనాల్లో.. భారీ అనుచరగణంతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు బయల్దేరినట్లు వచ్చారు. లోపలికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్నెవరూ వివరణ ఇవ్వాలని కోరలేదు. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చా’’ అని అన్నారు. తన వివరణకు సంబంధించిన ఆరు పేజీల పత్రాన్ని ఆయన సమర్పించినట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో కొండా మురళి పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యాలు చేశారన్నది అభియోగం. ఆ వ్యాఖ్యలతో ఓరుగల్లు కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. అయితే.. ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా క్రమశిక్షణ కమిటీ కోరింది. అలాగే.. ఆయన తన కుమార్తెను పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తానని ప్రకటించడమే కాకుండా, కొందరు సీనియర్ నేతలపై విమర్శలు చేయడం పార్టీ లోపలే తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రధానంగా.. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి వంటి నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు కలిసి అత్యవసరంగా సమావేశమై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని AICC తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె జోక్యంతో ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ కొండా మురళికి సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. -
కాంగ్రెస్‌లో పొలిటికల్ వార్.. కొండా సురేఖపై చర్యలు తప్పవా?
సాక్షి, వరంగల్/హైదరాబాద్: వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు.. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు నేతలందరూ కూటమి కట్టారు. ఇక, తాజాగా హస్తం నేతల పంచాయతీ తాజాగా కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ వద్దకు చేరుకుంది.వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షీ నటరాజన్ భేటీ అయ్యారు. కడియం శ్రీహరి, కార్పొరేషన్ చైర్మన్, ఎర్రబెల్లి స్వర్ణ తదితర నేతలు మీనాక్షి నటరాజన్‌తో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో చర్చలో ఏం చేస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పటికే వరంగల్ పంచాయతీపై పీసీసీ చీఫ్‌కు సీనియర్ల నివేదిక అందింది. సీనియర్ల నివేదిక ఆధారంగా మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.కొండా మురళి వ్యాఖ్యల ఎఫెక్ట్.. అయితే, ఇన్ని రోజులు మంత్రి కొండా సురేఖ జిల్లాలో నేతలను కలుపుకుని పోవడం లేదన్న అసంతృప్తి ఉంది. ఇదే సమయంలో తాజాగా మంత్రి భర్త కొండా మురళి చేసిన తాజా వ్యాఖ్యలు అగ్గికి మరింత ఆజ్యం పోశాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఒకరిద్దరు నేతల్ని ఉద్దేశించి మురళి కామెంట్స్ చేశారు. పార్టీ మారినప్పుడు పదవులకు రాజీనామాలు చేసి రావాలంటూ.. మురళి అన్న ఆ మాటలే ఎమ్మెల్యేలందర్నీ ఏకం చేసినట్టు చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా.. ఎవరి దారి వారిదే అన్నట్టున్నగా ఉన్న శాసనసభ్యులు.. కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్క తాటి మీదికి వచ్చినట్టు సమాచారం.కొండా మురళి వ్యాఖ్యలతో.. కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి అంతా ఇప్పుడు ఏకమైనట్టు తెలిసింది. కొండా ఫ్యామిలీకి రేవూరి ప్రకాష్‌రెడ్డితో కూడా కయ్యం మొదలైంది. ఇప్పుడు వరంగల్ సిటీలోని ఎమ్మెల్యేలతో పాటు.. కడియం శ్రీహరి లాంటి వాళ్ళంతా కలిసి కొండా దంపతులపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో వీరంతా.. ఢిల్లీ వెళ్ళి అధిష్టానం పెద్దలకు మంత్రి మీద ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. -
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట
-
‘నా ముందు కూర్చోవడానికి ఆయనకు నామోషీ’
వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నేతలపై కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీలో ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుంటే, మంత్రి కొండా సురేఖ సైతం అదే తరహాలో మాట్లాడారు. కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషని, సీఎం రేవంత్ వద్దకు, పొంగులేటి వద్దకు వెళ్లా తన మీద ఉన్నది లేనిది చెబుతున్నారంటూ విమర్శలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు కడియం శ్రీహరి. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు. సీఎం దగ్గరకు, పొంగులేటి వద్దకు వెళ్లి నా మీద ఉన్నది లేనిది చెబుతున్నాడు. తెలుగుదేశంలో నడిపించుకున్నట్లు ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడు. నా అదృష్టం ఉంది నేను మంత్రి అయ్యాను. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడు. నన్ను దిగిపోవాలని అనుకుంటే ఎలా?, నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది. నేను ఆమె ఎంపీ పదవి తీయాలని అంటున్నానా?, అని కొండా సురేఖ ప్రశ్నించారు. భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు కాదు..వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్‌రెడ్డికి సురేఖ కౌంటర్ ఇచ్చారు. కొందరు భద్రకాళీ టెంపుల్ తమ సొత్తు అనుకుంటున్నారని, అది ఎవరి సొత్తు కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. రాజేందర్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడటం సరికాదు. ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆగమశాస్త్ర ప్రకారం భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయించుకున్నాం. అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమ్మవారు శాఖాహారీ అని అందరికీ తెలుసు. అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నాం. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తాం’ అని కొండా సురేఖ తెలిపారు. కేంద్రానికి వివక్ష తగదుగోదావరి పుష్కరాల విషయంలో రెండు రాష్ట్రాలను కేంద్రం ఒకేలా సమానంగా చూడాలన్నారు కొండా సురేఖ. పుష్కరాలకు రూ. 200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని, గోదావరి పుష్కరాలు ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతాయన్నారు. భద్రాచలం రాముని పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని, ఇక్కడే గోదావరి పుష్కరాలు ఘనంగా జరుగుతాయన్నారు. తెలంగాణ వివక్ష వద్దు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలి.తెలంగాణకు పుష్కరాల కోసం నిధులు ఇప్పించాలి. లేదంటే వారు చేతకాని మంత్రులుగా మిగిలిపోతారు’ అని ఆమె స్పష్టం చేశారు. -
వరంగల్ కాంగ్రెస్ పంచాయితీ గాంధీ భవన్ కు వచ్చింది: TPCC చీఫ్
-
‘ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’
వరంగల్: మంత్రి కొండా సురేఖ భర్త మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేతగా ఉండి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు నాయని. కొండా మురళి వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని, బీసీ కార్డు అడ్డుపెట్టుకుని మాట్లాడతామనడం సరికాదన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేల భేటీ జరిగింది. ఈ సమావేశం అనంతరం రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పార్టీ మంచి చెడులు చర్చించుకున్నాం. సీనియర్లు, అనుభవజ్ఞులు ఎక్కడ పడితే అక్కడ వివాదాస్పండగా మాట్లాడటం సరికాదు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని మాట్లాడతామనడం సరికాదు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలి. ఇప్పటికైనా అధిష్టానం ఆలోచన చేయాలి. మనమే పార్టీకి నష్టం చేసుకుంటే ఎలా?, ఎమ్మెల్యేల అందరి నిర్ణయం మేరకు తదుపరి చర్యలుంటాయి. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం’ అని నాయని స్పష్టం చేశారు. కొండా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో ప్రకంపనలుకడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిల పై కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొండా వ్యాఖ్యలపై అధికార ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే రాజేందర్‌రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కొండా మురళిపై ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకునే క్రమంలో ఆ సమావేశం ఏర్పాటు చేశారు. సొంత పార్టీ నేతలకు కొండా సురేఖ భర్త మాస్ వార్నింగ్ -
సొంత పార్టీ నేతలకు కొండా సురేఖ భర్త మాస్ వార్నింగ్
సాక్షి, వరంగల్: వరంగల్ కాంగ్రెస్‌లో వార్ ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. కనుబొమ్మలు లేని నాయకుడు నాడు టీడీపీని భ్రష్టు పట్టించాడు. మొన్న కేటీఆర్‌ను వెన్నుపోటు పొడిచిండు. ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాడు. మీకు ఇజ్జత్ ఉంటే బయటి పార్టీ నుంచి వచ్చిన నాయకులు మీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి’’ అంటూ కొండా మురళి వ్యాఖ్యానించారు.వరంగల్ పోలీస్ కమిషనర్‌కు చెపుతున్నా.. మీ డిపార్ట్మెంట్లో కోవర్డులు ఉన్నారు. నాకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై చర్యలు కాదు.. పోలీస్ డిపార్ట్మెంట్లో కోవర్డులపై చర్యలు తీసుకోండి. కొండా మురళి ఉన్నంత వరకు వరంగల్ తూర్పులో రెండో నాయకుడు ఎవరూ ఉండరు. పరకాలలో 75 ఏళ్ల వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నాడు’’ అంటూ కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘పరకాల నియోజకవర్గంలో నా కూతురు కొండా సుస్మిత పటేల్ రంగప్రవేశం చేయనుంది. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆమె మంత్రి పదవి ఎక్కడికి పోదు’’ అని కొండా మురళి పేర్కొన్నారు. -
వరంగల్ తూర్పులో టీఆర్ఎస్కు తప్పని తలనొప్పి.. పాలకుర్తిలో కొండా రెడీ?
ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రస్తుతం టిఆర్ఎస్ కోటగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఒంటెద్దు పోకడతో గులాబీ గూటిలో ముసలం పుట్టి గ్రూప్ రాజకీయాలతో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అధికార పార్టీ లోని గ్రూప్ రాజకీయాలను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మూడున్నరేళ్ళలో మారిన పరిణామాల కారణంగా.. నన్నపనేని నరేందర్ కి పోటీగా బస్వరాజ్ సారయ్య, గుండు సుధారాణి రేస్‌లో వుండే అవకాశం లేకపోలేదు. ఒకరంటే ఒకరికి పడక వర్గపోరు తీవ్రం అవుతుండడంతో టిఆర్ఎస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇటీవల పార్టీని వీడటం మరో ఇబ్బంది. సురేఖకు అదే ప్లస్! కాంగ్రెస్ పార్టీ నుండి ప్రస్తుతానికి కొండా సురేఖ ఒక్కరే పోటీలో కనిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉండడం కొండా సురేఖకి కలిసివచ్చే అంశం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలయింది.వరంగల్ తూర్పుతో పాటు పరకాల, పాలకుర్తి నియోజకవర్గాలు తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కొండా ఫ్యామిలీ కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, టిఆర్ఎస్ లో వర్గ పోరు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 4 వేల ఓట్లకు పరిమితమైన బీజేపీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 45 వేల ఓట్ బ్యాంక్ సాధించుకోగలిగింది. తూర్పు ప్రజలు బీజేపీకి కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి మైనస్ పాయింట్ గా మారింది. అయితే ఇది పూర్తిగా అర్బన్ ప్రాంతం కనుక బీజేపీకి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. రంగంలో కొండా? పాలకుర్తి నియోజకవర్గం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కంచుకోట. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే గా దయాకర్ రావు ను దీవించడం నియోజకవర్గ ప్రజలకు పరిపాటిగా మారింది. విపక్ష అభ్యర్థుల బలహీనతలను అనుకూలంగా మార్చుకుని ఎర్రబెల్లి జయకేతనం ఎగురవేస్తున్నారు. దయాకర్ రావును ఢీకొట్టే సరైన నాయకుడు ఇతర పార్టీల్లో లేకపోవడం ఆయనకు కలిసోస్తుందనే అభిప్రాయం వ్యక్త మవుతుంది. కానీ రాబోయే ఎన్నికల్లో మంత్రికి చుక్కలు చూపేందుకు రాజకీయ ప్రత్యర్ధి కొండా మురళి కాంగ్రెస్‌నుంచి బరిలో దిగుతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ నుండి గత ఎన్నికల్లో పెదగోని సోమయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రబెల్లి సుధాకర్ రావు , యతిరాజారావు కుటుంబం నుండి ఒకరు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎవరు పోటీ చేసినా బీజేపీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. -
అందుకోసం ఏడు కేజీల బరువు పెరిగాను: హీరో
‘‘రామ్‌గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’, ‘వంగవీటి’ చిత్రాలు బయోపిక్స్ క్యారెక్టర్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. ‘కొండా’ మూవీ బయోఫిక్షన్.. ఇందులో కొండా మురళి, సురేఖ జీవితంలో జరిగిన ఘటనలను తీసుకుని కల్పిత కథ రాశారు. బయోపిక్, బయోఫిక్షన్ చిత్రాల మధ్య వ్యత్యాసం ఉంది’’ అని హీరో త్రిగుణ్ అన్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించిన చిత్రం ‘కొండా’. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా త్రిగుణ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కొండా’ సినిమా కోసం దాదాపు ఏడు కేజీల బరువు పెరిగాను. అప్పటి కాలేజీ రాజకీయాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఎమోషనల్‌గా కూడా ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఇక నేను నటించిన ‘ప్రేమ దేశం’, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దేవా కట్టా శిష్యుడు సురేష్ దర్శకత్వంలో ఒక సినిమా, మిస్కిన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. రాక్‌లైన్ వారి కొత్త బ్యానర్ ‘పర్పుల్ రాక్’లో ‘లైన్‌మేన్’, ‘కిరాయి’ అనే సినిమాలు చేస్తున్నాను’’ అని త్రిగుణ్ తెలిపారు. చదవండి: దేవుడిచ్చిన లోపాన్ని కూడా సరిచేసే తల్లి కథ.. లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
సాయి పల్లవికి రెడ్కార్పె ట్ వేసి.. రేవంత్‌రెడ్డి ఆపారు : సుష్మితాపటేల్ ఫైర్
సాక్షి, హన్మకొండ అర్బన్: ‘చదువురానోడికి మంత్రి పదవి ఉన్నది కాబట్టి సినిమా ఫంక్షన్ వేడుకలకు అనుమతి ఇవ్వలేదు. అదే చదువుకున్న కడియం శ్రీహరి మంత్రిగా ఉంటే అనుమతి వచ్చేది’ అని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి అన్నారు. కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా దర్శకుడు ఆర్జీవీ నిర్మించిన కొండా సినిమా ప్రీరిలీజ్ వేడుకను శనివారం రాత్రి హనుమకొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఆ చదువు రానోడి పేరు చెప్పనని, అతని గురించి సినిమాలో ఆర్జీవీ బాగా చూపించాడన్నారు. మురళి ఒక్కసారి మాట ఇచ్చాడంటే మెడ కోసుకుంటాడన్నారు. (చదవండి: గద్దర్ పాటకి ఆర్జీవీ స్టెప్పులు.. వీడియో వైరల్) సురేఖ మాట్లాడుతూ దౌర్జన్యాలు చేసే ప్రభుత్వాలను గద్దెదించాలని, అందుకు ఈ సినిమా స్ఫూర్తిగా ముందుకు సాగాలన్నారు. అణచి వేతలనుంచి పైకివచ్చామని, కష్టాలు తెలిసిన వారిగా ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. సినిమా నిర్మాత, కొండా దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ మాట్లాడుతూ ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు నీ బతుకుమారదా..? నీ బతుకంతా భయంతోనేనా ... సాయి పల్లవికి రెడ్కార్పె ట్ వేశావు, నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవత్‌రెడ్డి వస్తుంటే భయపడి ఆపేశావు. ఇంకా ఎంతకాలం భయపడతావు.. ఎన్నికలు రానియ్ నీ సంగతి చెబుతా’ అంటూ ఫైర్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘కొండా మురళి, సురేఖ జీవించిన జీవితాన్ని రెండు గంటల్లో నాకు వీలైనంత బాగా సినిమా తీయడానికి ప్రయత్నించా. నేను ఆశించిన దానికంటే త్రిగుణ్ ఎక్కువ చేశాడు. ఇర్రా మోర్ అద్భుతంగా నటించింది. అభిలాష్ మెయిన్ విలన్ రోల్ చేశాడు. భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో అతడిని చూస్తారు. 'గాయం'లో 'చెలి మీద చిటికెడు దయ రాదా...' అని రొమాంటిక్ సాంగ్ తీశా. ఊర్మిళపై తీసిన ఆ పాటకు సుచిత్ర గారు కొరియోగ్రఫీ చేశారు. అప్పట్నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. గొప్ప గేయ రచయితల్లో ఒకరైన చంద్రబోస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన 'సురేఖమ్మ' పాట రాశారు. సుచిత్ర 'తెలంగాణ పోరి' పాటకు కొరియోగ్రఫీ చేశారు. గద్దర్ పాటలు కొన్ని తీసుకున్నాం. డి.ఎస్.ఆర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు' అని అన్నారు. చిత్రంలో కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఈరామోర్ నటించారు. ఈ సినిమాకు సుస్మితాపటేల్ నిర్మాతగా ఉండగా, శ్రేష్టపటేల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుమ కనకాల యాంకర్‌గా వ్యవహరించారు. ఉమ్మడి జిల్లానుంచి కొండా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేడుకలో దర్శకుడు ఆర్జీవీ, సినిమా తారాగణం పాల్గొన్నారు. -
ఏ నటికి అయినా సరే ఆమెలా ఉండటం కష్టం : హీరోయిన్
‘కొండా సురేఖ వెరీ స్ట్రాంగ్ లేడీ. జీవితంలో ఆవిడ ఎన్నో మంచి పనులు చేశారు. ఆవిడ కఠిన పరిస్థితులను తట్టుకుని నిలబడ్డారు. నా జీవితం ఇప్పుడే మొదలైంది. మా ఇద్దరికీ చాలా వ్యత్యాసం ఉంది. ఆవిడతో కంపేర్ చేసుకోలేను. మా మధ్య ఉన్న ఒక్క కామన్ పాయింట్ ఏంటంటే... నేను కూడా స్ట్రాంగ్. భయపడకూడదని నా తల్లిదండ్రులు చెప్పారు’అని హీరోయిన్ ఇర్రా మోర్ అన్నారు. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన చిత్రం ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కొండా మురళిగా త్రిగుణ్, సురేఖగా ఇర్రా మోర్ నటించారు.శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 23న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం హీరోయిన్ ఇర్రా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. అలా ‘కొండా’లో అవకాశం రామ్‌గోపాల్ వర్మ్ శిష్యుడు సిద్దార్థ్ తెరకెక్కించిన 'భైరవగీత’ చిత్రంతో నా సినీ కెరీర్ స్టార్ట్ అయింది. ఈ చిత్రం తర్వాత రెండు వెబ్ సిరీస్‌లు చేశా. లాక్డౌన్లో ఉండగా వర్మ గారు 'కొండా' సినిమా స్క్రిప్ట్ పంపారు. నాకు సురేఖమ్మ పాత్ర బాగా నచ్చింది. కాలేజీ జీవితం నుంచి రాజకీయ ప్రయాణం వరకూ ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. నటిగా ఫెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న రోల్. అందులో నటించగలనని వర్మగారు అనుకోవడం నా అదృష్టం. కాపీ చేయలేదు.. నా శైలీలో నటించా ‘కొండా’మూవీ స్క్రిప్ట్ చదివాక... యూట్యూబ్‌లో ఆమె వీడియోస్ చూశా. లాక్డౌన్ కారణంగా అప్పట్లో సురేఖమ్మతో మాట్లాడటం కుదరలేదు. ఆ తర్వాత మా ఇంట్లో లుక్ టెస్ట్ చేశా. శారీ కట్టుకుని చూశా. ఆమె రాజకీయ నాయకురాలు కూడా.. అందువల్ల, ఎటువంటి దుస్తులు వేసుకోవాలి? ఏవి వేసుకోకూడదు? అని డిస్కస్ చేసుకున్నాం. వర్మ గారితో మాట్లాడి సురేఖమ్మ గురించి తెలుసుకున్నా. ఆ తర్వాత ఆమెతో మాట్లాడాను. ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడేవారు? అనేది చూశా. ఆవిడను కాపీ చేయాలనుకోలేదు. నా శైలిలో నటించా. కానీ, ఆవిడ వ్యక్తిత్వం పాత్రలో కనిపించేలా చూసుకున్నా. అది వర్మకు బాగా తెలుసు కొండా కంటే ముందే వర్మ ప్రొడక్షన్ హౌస్‌లో 'భైరవగీత' చేశాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించా. ప్రతి సన్నివేశాన్ని ఆయన దగ్గరుండి తీశారు. నటీనటుల నుంచి ఏం తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. వెరీ క్లియర్. అలాగే, ఆయన మేకింగ్ ఫాస్ట్‌గా ఉంటుంది. త్రిగుణ్ చాలా మంచి నటుడు.చాలా ఈజీగా పాత్రలోకి వెళతాడు. వెంటనే బయటకు వస్తారు. యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సెట్లో సీరియస్‌గా ఉంటాడు. కానీ, బయట సరదాగా ఉంటాడు. ఆమెలా ఉండటం కష్టం బయోపిక్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనిషి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడం. మనం లుక్స్ పరంగా మార్పులు చేయవచ్చు. మనిషిని పోలిన మనిషిని తీసుకు రావడం కష్టం కదా! అయితే... క్యారెక్టర్ పరంగా ఎటువంటి మార్పులు చేయలేం. అందువల్ల, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సురేఖమ్మ పబ్లిక్‌లో ఉన్న మనిషి. రాజకీయాల్లో ఉన్నారు. ఆమెకు ఓ ఇమేజ్ ఉంది. ఏ నటికి అయినా సరే ఆమెలా ఉండటం కష్టం. అయితే, సురేఖమ్మలా నటించి ప్రజల చేత గౌరవం సంపాదించుకోవడం ముఖ్యం. సినిమా చూశాక... ప్రేక్షకులు నన్ను గౌరవిస్తారని ఆశిస్తున్నాను. సురేఖమ్మ పాత్రకు వెయ్యి శాతం న్యాయం చేశావని మెచ్చుకున్నారు సురేఖమ్మ గారి అమ్మాయి సుష్మిత మా సినిమా ప్రొడ్యూసర్. ఆవిడను నేను ముందు కలవలేదు. ఒక నెల షూటింగ్ చేశాం. ఆ తర్వాత ఆవిడ రషెస్ చూశారు. ఫోన్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్‌లో కొండా మురళి గారిని షూట్ చేసే సన్నివేశం వస్తుంది. నిజంగా జరిగినప్పుడు సుష్మిత ఆయన దగ్గర ఉన్నారు. సినిమా స్టార్ట్ చేసే ముందు నేను ముంబై నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి ఎలా యాక్ట్ చేస్తానోనని అనుకున్నారట. ఇంటర్వెల్ సీన్ చూశాక మెచ్చుకున్నారు. సురేఖమ్మ పాత్రకు వెయ్యి శాతం న్యాయం చేశానని చెప్పారు.'కొండా' షూటింగ్ చేసేటప్పుడు వరంగల్‌లోని మురళి - సురేఖమ్మ గారి గెస్ట్ హౌస్‌లో ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీతో చాలా కలిసిపోయాం. -
Kondaa Trailer: నా పేరు కొండా మురళీ.. ఏ మురళీ?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా మురళీ, సురేఖల జీవిత నేపథ్యాన్ని బేస్ చేసుకుని వర్మ ఈ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ‘కొండా’ ట్రైలర్ విడుదల చేశాడు ఆర్జీవీ. ‘సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు.. బాగు చెయ్యాలె.. పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప’అంటూ ఆర్జీవీ వాయిస్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతోంది. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కార్ల్ మార్క్స్ 180 ఏళ్ల క్రితం చెప్పారు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య నుంచే పుట్టిన వ్యక్తి కొండా ముళీ’ అంటూ హీరోని పరిచయం చేశాడు ఆర్జీవీ. ఈ సినిమాలో కొండా మురళీగా త్రిగణ్, కొండా సురేఖ పాత్రలో ఈరా మోర్ నటించింది. ట్రైలర్‌లోని ప్రతి సీన్లోనూ త్రిగణ్ నటన అద్భుతంగా ఉంది. ‘నా నిర్ణయాలకు నేనే బాధ్యుడిని, కాబట్టి నా మాటే నేను వింటా’, నా పేరు కొండా మురళీ.. ఏ మురళీ? అనే డైలాగ్స్ ఆట్టుకునేలా ఉన్నాయి. -
‘కొండా’మూవీపై ఆర్జీవీ ఆసక్తికర వీడియో... స్టోరీ ఇదేనా!
Konda Movie Secrets Revealed by Rgv: కాంట్రవర్సీకి కేరాఫ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). ఆయన సినిమా కథలన్నీ వివాదాల చుట్టూ అల్లుకున్నవే. తాజాగా ఆయన తెరకెక్కించిన మరో చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా మురళీ, సురేఖల జీవిత నేపథ్యం బేస్ చేసుకుని వర్మ ఈ సినిమా తెరకెక్కించాడు. . ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ‘కొండా’ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఈ సందర్భంగా ‘కొండా’ సినిమా గురించి చెప్తూ ఓ వాయిస్ ఓవర్ ఉన్న వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఈ వీడియోలో ‘కొండా’మూవీ ఎలా ఉండబోతుందో చెప్పేశాడు ఆర్జీవీ. ‘కనీ వినీ యెరుగని అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడ అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి. కొండా లాంటి అసాధారణ శక్తికి, ఆదిపరా శక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు ఆ శక్తులిద్దరిని చూసి ఓర్వలేక మనిషి రూపంలో ఉన్న కొందరు జంతువులు చేసిన క్షుద్ర మైన కుట్రలను, తిప్పికొడుతూ తెలంగాణలో చేసిన ఒక కురుక్షేత్ర యుద్దమే, మా కొండా చిత్రం. ఇకపోతే ఒక మాదిరి రంగులో ఉండే నల్ల సుధాకర్ విషయానికొస్తే కొన్ని పరిస్థితుల నుండి కొందరు నాయకులు పుడుతారు. కానీ పరిస్థితులను ఏర్పాటు చేసుకొని నాయకుడై, ఒకే అమ్మకి, నాన్నకి పుట్టానని పదే పదే చెప్పుకుంటూ తిరిగే వాడే నల్ల సుధాకర్. ఆర్కే, భారతక్క విషయానికొస్తే.. తెలంగాణలో ఒక్క సామెత ఉంది. 'పొట్టోన్ని పొడుగోడు కొడ్తే, పొడుగోన్ని పోశమ్మ కొట్టిందంటరు' ప్రజలను కాలరాస్తు బలిసిపోయిన నాయకులను, వాళ్ళకు అమ్ముడు పోయిన కొందరూ పోలీసులను, పోచమ్మలా నరికేదందుకు పుట్టినోళ్ళే ఆర్కే, భారతక్క. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు విప్లవమనేది తుపాకీ తూటల్లో నుంచి కాదు, కొండా మురళి చెప్పినట్టు గుండెల్లోతుల్లోని బాధల నుంచి పుడుతుంది. అందుకే మనిషిని అనగదొక్కే పరిస్థితి ఉన్నంత వరకు, విప్లవం అనే ఒక దైవసర్పం కాటేస్తూనే ఉంటుంది. పెత్తందారులకి ఎదురు పోరాడిన ఆ కొండా దంపతుల కత్తులు బెజవాడ దుర్గమ్మ, అనంతపురం సుంకాలమ్మని మించిన మైసమ్మ శాక్తులుగా నాకు అనిపించ బట్టే మీకు కనిపించ చెయ్యబోతున్నాను.ఈ నిజాలన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా కొండా చిత్రంలో కనబడతాయి . కొండా చిత్రం మొదటి ట్రైలర్ జనవరి 26న, రిపబ్లిక్ డే రోజు ఉదయం 10గంటల 25 నిముషాలకి విడుదల కాబోతుంది. ఈ ఖచ్చితమైన సమయం నిర్ణయించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఏమిటంటే, యెన్నో సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి 26న, రిపబ్లిక్ డే రోజున అదే 10గంటల 25 నిముషాలకి కొండా మురళి పైన వంచనగిరిలో ఒక్క అత్యంత దారుణ హత్య ప్రయత్నం జరిగింది. మైసమ్మ దయ వల్ల కొండా బ్రతికి పోయినప్పటికి, ఆ దాడికి సంబంధించిన కొన్ని బుల్లెట్ లు ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉండి పోయాయి. ఆ బుల్లెట్లకి ముందు కథ, వాటి తర్వాత కథే మా కొండా కథ’అని చెబుతూ.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాడు ఆర్జీవి. -
నక్సలైట్‌గా మారిన ఆర్జీవీ.. ముక్కలు ముక్కలుగా కేక్ కటింగ్
RGV Cake Cutting AT Konda Movie Wrap Up Praty: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన సినిమాల కంటే కాంట్రవర్సరీస్తోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. తాజాగా నక్సలైట్ అవతారం ఎత్తి మరోసారి వార్తల్లో నిలిచాడు. సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా వర్మ చేసిన రచ్చ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. కాగా వరంగల్‌కు చెందిన పొలిటికల్ లీడర్స్ కొండా మురళి-సురేఖ దంపతుల జీవి కథ ఆధారంగా ఆర్జీవీ కొండా అనే ఫ్యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా వరంగల్‌లోని గోపాల్పూర్ కొండామురళి గెస్ట్‌హౌస్‌లో ముగింపు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొండా మురళి, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో నక్సలైట్ గెటప్‌లో వచ్చిన ఆర్జీవీ.. పెద్ద తల్వార్‌తో కేకును ముక్కలు ముక్కలుగా కోశాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. కిల్లింగ్ ఏ కేక్ ఫర్ కొండా అంటూ రాసుకొచ్చాడు. చదవండి: Rgv Hotel: 'ఆర్జీవీ హోటల్'.. అక్కడ అన్నీ అవే కనిపిస్తాయి KILLING a CAKE for KONDA pic.twitter.com/BXMmJIpV5F — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2021 -
‘కొండా’ సినిమా: పొలిటీషియన్‌కి ఆర్జీవీ ఇండైరెక్ట్ వార్నింగ్
రాంగోపాల్ వర్మ.. ఈ పేరు వెంట ఎప్పుడూ వివాదాలు తిరుగుతుంటాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమాలతో సంచనాలు సృష్టించడమే కాదు. ట్వీట్లతోనూ సోషల్ మీడియాని ఊపేస్తుంటాడు ఈయన. తాజాగా ఆయన కొండా మురళీ, సురేఖ బయోపిక్‌గా ‘కొండా’ సినిమాని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీని గురించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో..‘ అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి...జై తెలంగాణ’ అంటూ రాసుకొచ్చాడు వర్మ. ఇది ఇప్పుడు నెట్టింట హట్ టాపిక్ అయ్యింది. ‘కొండా’ సినిమా విషయంలో వరంగల్‌కి చెందిన ప్రముఖ పొలిటిషీయన్ నుంచి ఆర్జీవీకి బెదిరింపులు వచ్చినట్లు సినీ జనాలు అనుకుంటున్నారు. అందుకే ఆయన ఈ ట్వీట్లో ‘నల్ల బల్లి సుధాకర్’ అనే పేరుతో ఆ పొలిటిషీయన్కి వార్నింగ్ ఇచ్చినట్లు ఫిల్మీ దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: బ్యాక్ బెంచర్ ఎలా ఉంటాడో చెప్పిన వర్మ.. ట్వీట్ వైరల్ అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతి ని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి...జై తెలంగాణ — Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2021 -
ఈ కథ అందరికీ తెలియాలి: ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘కొండా’ పేరుతో మరో బయోపిక్‌కి శ్రీకారం చుట్టారు. వరంగల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ‘కొండా’ చిత్రం వరంగల్‌లో ప్రారంభం అయింది. అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యోయో టాకీస్ పతాకంపై మల్లారెడ్డి, నవీన్ రెడ్డి నిర్మిస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘మురళి, సురేఖ గార్ల జీవిత కథని అందరికీ తెలియాలనే ‘కొండా’ చిత్రం నిర్మిస్తున్నాం. వారి జీవిత చరిత్రను పదిశాతం సినిమాలో చూపించినా నా ప్రయత్నం విజయవంతం అయినట్టే’’ అన్నారు. ‘‘నిజజీవితంలో కొండా దంపతులు ఎలా ధైర్యంగా నిలబడ్డారు? అనేది ‘కొండా’ ద్వారా చూపించబోతున్నాం’’ అన్నారు నిర్మాత ముకుంద్. ‘ ఈ చిత్రానికి కెమెరా: మల్హర్‌భట్ జోషి. -
కొండా దంపతులకు 2+2 భద్రతే
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి 2+2 భద్రతను గతంలోలాగానే కొనసాగించాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. వారి భద్రతను ఉపసంహరించడానికి కారణాలు ఏమిటో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమకున్న భద్రతను ఉపసంహరించడాన్ని సవాలు చేస్తూ సురేఖ, మురళీలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాది రఘువీర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ..వారికి డిసెంబర్ 31 నుంచి భద్రతను ఉపసంహరించారని తెలిపారు. కొండా సురేఖ 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారని, అప్పటి నుంచి మొన్నటి వరకు ఆమెకు భద్రతను కొనసాగిస్తూ వచ్చారని వివరించారు. రాజకీయ ప్రత్యర్థులు, నిషేధిత గ్రూపుల నుంచి పిటిషనర్లకు ప్రాణహాని ఉందన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వం పిటిషనర్ల భద్రతను ఉపసంహరించిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తరçఫున ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లపై క్రిమినల్ కేసులున్నాయన్నారు. గతంలో వారు ప్రజాప్రతినిధులుగా ఉన్నందున భద్రతను కల్పించారని, అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ ఓడిపోయారని తెలిపారు. -
‘ఎర్రబెల్లి కోసం జూపల్లిని ఓడగొట్టారు’
సాక్షి, హైదరాబాద్ : ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రిని చేయడం కోసమే మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావును ఓడగొట్టారని కొండా దంపతులు ఆరోపించారు. శనివారం కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖతో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసారు. తన రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేసిన కొండా మురళి అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నప్పటికి నామీద గౌరవంతో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో నిలవలేదు. వారందరికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో తొలిసారి నేను ఏకగ్రీవంగా గెలిచాను. విలువలు పాటిస్తున్న నాయకుడిని కాబట్టే రాజీనామా చేశాను. ప్రతిపక్షమే లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. నేను, సురేఖ రాజకీయవిలువలతో ప్రజల మధ్య బతుకుతున్నాం. మాకు పదవులు ముఖ్యం కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణానంతరం మూడు నెలలకే ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశాం. మాకు పదవులు కాదు ఆత్మాభిమానమే ముఖ్యం. ఆత్మాభిమానం చంపుకున్నోళ్లే టీఆర్ఎస్లో చేరుతారు. మొదట మంచిగా మాట్లాడుతారు. భోజనం పెడతరు తర్వాత నాలుగేళ్లు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. 30 ఏళ్లుగా మాకు శత్రువుగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును టీఆర్ఎస్లో చేర్చుకోవడం మాకు నచ్చలేదు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారు. దొరల పాలనను ప్రతిఘటించి ప్రజల మధ్య ఉండి పోరాడుతాం’ అని కొండా మురళి స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగంతోనే టీఆర్ఎస్ గెలిచింది: కొండా సురేఖ ‘స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ అందించాం. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజీనామా చేయాలని ముందే అనుకున్నాం. కేసీఆర్ ఇచ్చిన బీ ఫార్మ్ మీద మురళీ గెలవలేదు. ప్రజల అండతోనే మురళి ఎమ్మెల్సీగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో టీఆర్ఎస్ గెలిచింది. మాట్లాడే వాళ్ళని అసెంబ్లీలోకి రాకుండా చేసిన కేసీఆర్.. మా లాంటి వారి నియోజకవర్గాల్లో గెలుపు కోసం రూ.50 కోట్లు ఖర్చు చేశారు. కౌన్సిల్ లో ప్రతిపక్షం లేకుండా విలీనం చేసుకోవాలని చూడటం ప్రజాస్వామ్యం ఖూనీ చేయటమే. వ్యక్తుల ద్వారా పదవులకు వన్నె రావాలి కానీ మేము పదవుల కోసం పాకులాడే వాళ్ళం కాదు. దయాకర్‌కు మంత్రి పదవి కోసం జూపల్లిని ఓడగొట్టారు. ప్రజాస్వామ్య పద్దతిలో పాలన చేయండి. కుటుంబ పెత్తనం పక్కన పెట్టి ప్రజా క్షేమం మీద దృష్టి పెట్టాలి. గతంలో పార్టీలు మారిన వారి మీద ఎలాంటి చర్యలు లేవు. వాళ్ళది అనుకున్న పదవి మాకు అవసరం లేదు.. కావున రాజీనామా చేశాం. ఏదైనా ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం’ అని కొండా సురేఖ పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. కొండామురళితో పాటు ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఉన్నారు. వరంగల్ స్థానిక సంస్థల ద్వారా కొండా మురళి టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా 2015లో ఎన్నికైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తొలుత ప్రకటించిన జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో మనస్థాపానికి గురైన కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తరఫున పరకాల నుంచి పోటీచేసిన కొండా సురేఖ పరాజయం పాలయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ.. శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన వివరణ కోరుతూ కొండా మురళికి నోటీసులు జారీ చేశారు. దీంతో 2021వరకు పదవీ కాలం ఉన్నా.. కొండా మురళి తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలి చైర్మన్‌ను కలసి కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ శాసనమండలి పక్షంలో విలీనం చేయాలని కోరుతూ లేఖ సమర్పించారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా సైతం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎం.ఎస్. ప్రభాకర్, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గతంలోనే టీఆర్ఎస్లో చేరారు. ఇదే పార్టీకి చెందిన ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ గురువారం సీఎం కేసీఆర్‌ను కలవడంతో వారు టీఆర్ఎస్లో చేరడం ఖాయమైపోయింది. ఇక కొండా మురళి రాజీనామాను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆమోదించారు. -
అజహరుద్దీన్, ‘కొండా’ వాహనాల తనిఖీ
సాక్షి, మామునూరు/వరంగల్ అర్బన్: రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీఏ జంక్షన్లో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ గ్రామాలకు ప్రచార నిమిత్తం వెళ్తున్న ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, క్రికెట్ మాజీ కెప్టన్ ఎండీ అజహారుద్దీన్ ప్రయాణించే వాహనాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనంలో ఎలాంటి అక్రమ తరలింపులు లేకపోవడంతో వాహనాలను వదిలేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాహనాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బు, మద్యం తరలిస్తే చర్యలు తప్పవని చెక్‌పోస్ట్ ఇన్చార్జ్ అధికారి శాంతకుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై రమేష్, కానిస్టేబుల్ యాకూబ్‌పాషా, హెడ్ కానిస్టేబుల్ రాకేష్, సాంబయ్య, ఫొటోగ్రాఫర్ శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు. -
మా ప్రభావమేంటో చూపిస్తాం: కొండా సురేఖ
సాక్షి, న్యూఢిల్లీ: కొండా సురేఖ, కొండా మురళి దంపతులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి ఆర్సీ కుంతియా, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ కొండా దంపతులకు కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ దంపతులు, మైనారిటీ నేత పాషా కూడా రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుమారు గంట పాటు నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. అందరూ కలసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. కొండా దంపతులు, రమేశ్ రాథోడ్ దంపతులు కాంగ్రెస్‌లో చేరడంపై రాహుల్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. వీరి చేరికలపై ఆయన సానుకూలంగా ఉన్నారని, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ రెండు జిల్లాల్లో వచ్చే ఎన్నికల్లో మెజారీటీ స్థానాల్లో గెలుపొందేందుకు వీరి చేరికలు దోహదపడతాయని రాహుల్ అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. బలహీనవర్గాల్లో బలమైన కుటుంబంగా కొండా కుటుంబాన్ని రాహుల్ పరిగణిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రమేశ్ రాథోడ్ చేరిక ప్రభావం చూపుతుందని రాహుల్ చెప్పినట్లు తెలిపారు. బేషరతుగా చేరిక.. ఎన్నికల్లో పోటీపై రాహుల్‌తో భేటీ సందర్భంగా ఎలాంటి చర్చ జరగలేదని, ఎలాంటి షరతుల్లేకుండా కొండా దంపతులు పార్టీలో చేరినట్లు ఉత్తమ్ చెప్పారు. స్థానిక నాయకులతో మాట్లాడిన అనంతరం టికెట్ల విషయంలో నిర్ణయం తీసకుంటామని వెల్లడించారు. కొండా సురేఖను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి పంపుతామని చెప్పారు. మా ప్రభావమేంటో చూపిస్తాం: కొండా సురేఖ ‘ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలు మాపై లేనిపోని ఆరోపణలు చేశారు. ఇప్పుడు మేం కాంగ్రెస్‌లో చేరాం. ఇక నుంచి కొండా దంపతుల ప్రభావమేంటో చూపిస్తాం. మాలాంటి వారందరి సహకారంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్ర ప్రజల సమస్యలను పక్కన పెట్టి కుటుంబ లాభాపేక్ష కోసమే పనిచేశారు. టీఆర్ఎస్లో జరుగుతున్న అన్యాయంపై మాలాంటి వారు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో మమ్మల్ని బయటకు పంపేలా చేశారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉంది. రాహుల్ గాంధీ సమక్షంలో భేషరతుగా పార్టీలో చేరాం. మా లక్ష్యం టికెట్లు కాదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా సేవలందిస్తాం. వరంగల్ తూర్పుతో పాటు 5 నుంచి 6 సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించాకే మళ్లీ వచ్చి కలుస్తానని రాహుల్‌కు హామీ ఇచ్చాం’అని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల టీఆర్ఎస్లో చేరామని, తమను వారు తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు కొండా మురళి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రమేశ్ రాథోడ్, సుమన్ రాథోడ్ దంపతులు పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు
-
కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్ఎస్ అసమ్మతి నేతలు కొండా సురేఖ, మురళీ దంపతులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్లో తమకు టికెట్ కేటాయించలేదని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తిన కొండా దంపతులు.. కాంగ్రెస్ గూటికి చేరనున్నట్టు మంగళవారమే సంకేతాలు ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన తర్వాత సాయంత్రానికి వారిద్దరూ ఢిల్లీ చేరుకున్నారు. దీంతో వారు కారు దిగి హస్తం గూటికి చేరబోతున్నట్టు స్పష్టమైంది. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. తమకు కేటాయించాల్సిన సీట్లపై పూర్తి స్థాయిలో హామీ తీసుకున్న అనంతరమే వారు పార్టీలో చేరినట్టు సమాచారం. కొండా దంపతులు కాంగ్రెస్‌లోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండమంటూ కేటీఆర్‌కు సవాల్ విసిరిన వీరు.. కాంగ్రెస్ గూటికి చేరడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం స్వాగతిస్తున్నారు. -
కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు..!
సాక్షి, హైదరాబాద్ : తనకు టికెట్ ఇవ్వకుండా నిరాకరించిన టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై ఆ పార్టీ అసమ్మతి నేత కొండా సురేఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అని, ధనికులకే మేలు చేసేవిధంగా ఆయన అన్యాయమైన పాలన చేస్తున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. కొండ దంపతులు మంగళవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘నాకు జరిగిన నమ్మకం ద్రోహం గురించి కేసీఆర్, కేటీఆర్‌ను అడిగినా సమాధానం రాలేదు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి టికెట్లు రావని కేటీఆర్ అంటున్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేయడమేనా మేం చేసిన క్రమశిక్షణ ఉల్లంఘనా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్ టికెట్ల ప్రకటన చేసిన తర్వాత అధిష్టానానికి తాము లేఖ రాశామని, తమ లేఖపై టీఆర్ఎస్ అధినాయకత్వం స్పందిస్తారని ఆశించి పదిరోజులు వేచి చూశామని, కానీ తమకు నిరాశే ఎదురైందని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ నిరాకరించి తమ ఆత్మాభిమానాన్ని టీఆర్ఎస్ అధినాయకత్వం దెబ్బతీసిందని ఆమె మండిపడ్డారు. మౌనం అర్థాంగికారం అన్నట్టు ఈ విషయంలో కేసీఆర్ వ్యవహరించారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒక్కరోజు కూడా సచివాలయానికి వెళ్లలేదని మండిపడ్డారు. ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్తున్నారని విమర్శించారు. తన ప్రభుత్వంలో ఒక్క మహిళను కూడా మంత్రిగా చేయలేదు. అమరవీరుల కుటుంబాల్లో ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు. శ్రీకాంతచారి తల్లికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు’ అని కొండా సురేఖ ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖను మీడియా సమావేశంలో కొండా సురేఖ చదివి వినిపించారు. లేఖ పూర్తి పాఠం ఆమె మాటల్లో.. ‘ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసిన కేసీఆర్‌కు నా బహిరంగ లేఖ. మహిళలకు క్యాబినెట్లో చోటు ఇవన్ని పాలన. ప్రజలని ఒక్కసారి కూడా కలవని పాలన. ఎంపీ, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవన్ని గుడ్డి పాలన. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవని దుర్మార్గ పాలన. సోనియా లేకుండా తెలంగాణ వచ్చేది కాదు అని అసెంబ్లీలో మొదట ప్రవేశపెట్టిన తీర్మానం ఒక్కసారి కేటీఆర్ చూడాలి. నాలుగేళ్లు అయినా నాకు కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకదు. సీఎంవో నుంచి అపాయింట్మెంట్లు ఉండవు. ఇక మిమ్మలని ఎలా నమ్మాలి? ఆత్మ గౌరవం మాకు ముఖ్యం. టీఆర్ఎస్లో ఉన్నన్ని రోజులు ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఉన్నాం. బీసీ మహిళ అయిన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఒకరు మందు గోళీలు, ఇంకొకరు భోజనం పెట్టినందుకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఎంపీగా ఉన్న బాల్క సుమన్, మల్లారెడ్డికి ఎమ్మెల్యే గా టికెట్ ఎందుకు ఇచ్చారు? శ్రీకాంతాచారి తల్లికి ఒక్క పదవి ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారికి టికెట్లు ఎందుకు ఇవలేదు? ఎన్నికలు ఆలస్యం అయితే ఓడిపోతామని ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత కేటీఆర్ చేతిలో తెలంగాణను పెట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ పెట్టిన కొన్ని పథకాలవల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. రైతుబంధు పథకం వల్ల ధనిక రైతులకు లాభం జరుగుతోంది. మేము ఎక్కడా క్రమశిక్షణ ఉల్లంఘించలేదు. మిమ్మలి తిట్టిన వాళ్లను మంత్రులుగా చేయడమేనా క్రమశిక్షణ అంటే. కేసీఆర్ పాలన అంటేనే అవినీతి పాలన. వేలకోట్ల ప్రజాధనంతో కేసీఆర్ ఖజానా నిండిపోయింది. హైదరాబాద్‌లో కేటీఆర్, ఆయన బినామిలు సెటిల్మెంట్లు చేశారు. విచ్చలవిడిగా కేటీఆర్ బార్లకు అనుమతులు ఇచ్చారు. ఉద్యోగుల సమస్య తీర్చలేని అసమర్థ పాలన కేసీఆర్‌ది. ఎర్రబెల్లి దయాకర్‌రావును పార్టీలో చేర్చుకొని కులతత్వంతో మమ్మల్ని అణగదొక్కారు. పుటకోమాట మాట్లాడటం.. పెద్దలని అవమానించడం కేసీఆర్‌కు అలవాటు. తెలంగాణ కేసీఆర్ ఆస్తి కాదు.. కేటీఆర్‌కు రాసి ఇవ్వడానికి. కేటీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదు. కవిత అమెరికా నుంచి వచ్చినప్పుడు తిరిగిన కారు ఎవరిదో చెప్పాలి. సీఎంవోలో ఉన్న పెండింగ్ ఫైళ్లు ప్రజల ముందు ఉంచాలి. బీజేపీతో మీకున్న లోపాయకారి ఒప్పందాలు ఏమిటి? డ్రగ్స్, నయీం కేసులు ఏమయ్యాయి? కేసీఆర్ ఎప్పుడూ చంద్రబాబుతో వైరమే పెట్టుకున్నారు. సఖ్యత లేదు. మరి హరికృష్ణ ఎవరు? ఉద్యమకారుడా? ఎవడబ్బా సొమ్ము అని హరికృష్ణ స్మారకానికి భూమి ఇచ్చారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు.. జయశంకర్ తెలంగాణ జాతిపిత. ఆయన బతికి ఉంటే, ఈ పాలన చూసి ఆత్మహత్య చేసుకునేవారు. కేటీఆర్ టీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా. కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలి. ప్రతిపక్షాల చేతిలో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదు. మేం హరీశ్ వర్గం.. ఇంకా చాలామంది ఉన్నారు. మాకు పదిహేను పార్టీల నుంచి ఆహ్వానం వస్తుంది. అవసరమైతే సీఎం అభ్యర్థిని చేస్తామంటున్నారు. నాలుగు రోజుల్లో మా కార్యాచరణ ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాలో కొండా సురేఖకు చోటు (వరంగల్ తూర్పు) లభించకపోవడంతో తన భర్త, ఎమ్మెల్సీ మురళీధర్‌రావుతో కలసి ఈ నెల 8న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేటీఆరే తన టికెట్‌ను అడ్డుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు టికెట్ కేటాయించకపోవడానికి రెండు రోజుల్లో కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి నేపథ్యంలో ఇన్నాళ్లూ వేచి చూసినా టీఆర్ఎస్ పెద్దల నుంచి మాత్రం స్పందన రాలేదు. దీంతో కొండా దంపతులు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఆ పార్టీ తరుపున వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో రెండు చోట్ల పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం తరుపున వీరికి హామీ లభించినట్లు సమాచారం. -
‘కొండా’ కోర్టులోనే బంతి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ ఎవరికి ఇవ్వాలో తేల్చి చెప్పాలని అపద్ధర్మ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ కొండా దంపతులను కోరినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. కొండా దంపతులు రెండు శాసనసభ టికెట్లు అడుగుతుండగా రెండు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని తూర్పు టికెట్ మాత్రమే ఉందని, కొండా సురేఖ లేదా సుస్మితా పటేల్‌లో ఎవరికి ఇవ్వమంటే వాళ్లకే ఇస్తామని కేసీఆర్ కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతి సమాధానంగా తమ కూతురు సుస్మితా పటేల్‌కే ఇవ్వండని కొండా దంపతులు సూచనప్రాయంగా చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.వారి సమాధానంతో కొంత సందిగ్ధంలో పడిన పార్టీ అధినాయకత్వం ఫైనల్‌గా ఏ విషయమైంది.. రెండు రోజుల్లో తేల్చిచెప్పాలని కొండా దంపతులను కోరినట్లు తెలుస్తోంది మరోవైపు టీఆర్ఎస్ అధినాయకత్వం తీరుతో ఇబ్బందిపడుతున్న కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు, ఈ నెల 12న కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం కూడా జరుగుతోంది. ఖచ్చితంగా తమకు రెండు టిక్కెట్లు కావాలని కొండా దంపతులు గట్టిగా పట్టుపడుతున్నారు. శనివారం కొండా మురళి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను కలిసే ప్రయత్నంలోఉన్నట్లు తెలిసింది. ఆయన సమయమిస్తే తన కూతురు సుస్మితా పటేల్, తన భార్య కొండా సురేఖకు చెరో టికెట్ ఇవ్వాలని చివరి ప్రయత్నంగా కోరే అవకాశం ఉంది. అందుకు కేసీఆర్ అంగీకరించకపోతే టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉందని మురళి అనుచరులు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొండా దంపతులను తిరిగి ఆహ్వానించి వరంగల్‌లో పార్టీకి పునఃవైభవం తేవాలనే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. వారు కోరిన రెండు టికెట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు పార్టీ తొలి జాబితాలో సురేఖకు చోటు దక్కకపోవడంతో ఆగ్రహంగా ఉన్న కొండా అనుచరులు తిరిగి సొంతగూటికి వెళ్దామని ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి రాజకీయ భవిష్యత్ కొంత సందిగ్ధంలోపడినట్లు తెలుస్తోంది. -
మూడు ముల్లుల గులాబీ
ఒకే పార్టీలో కడియం, ఎర్రబెల్లి, కొండా జిల్లా టీఆర్ఎస్లో విభిన్న పరిస్థితి విభేదాలు సమసిపోవడం కష్టమే సయోధ్య, సమన్వయంపై కార్యకర్తల్లో సందేహాలు ఇప్పటికే తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన టీఆర్ఎస్లోకి సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయూకర్‌రావు చేరడంతో జిల్లాలో ఆ పార్టీ మరింత బలం పుంజుకుంటుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు కీలక నేతలు ఎక్కువ మంది కావడంతో సమన్వయం లేక భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొండా మురళీధర్‌రావు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరికీ మరొకరితో సత్సంబంధాలు లేవు. తీవ్రమైన విభేదాలు, వ్యక్తిగత వైరుధ్యాలు ఉన్నాయి. ఈ నేతలు టీఆర్ఎస్ బలోపేతం కోసం కలిసి పనిచేస్తారా అనేది ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది. కడియం శ్రీహరి మంత్రిగా పనిచేశారు. దయాకర్‌రావు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, ప్రభుత్వ విప్‌గా వ్యవహరించారు. ఇద్దరు నేతల మధ్య అన్ని విషయాల్లోనూ భేదాభిప్రాయలు ఉండేవి. టీడీపీని రెండు వర్గాలుగా నడిపించారు. టీడీపీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు తోడు, ఇద్దరు కీలక నేతల వర్గపోరుతోనే 2004 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా పరాజయం పాలైందనే అభిప్రాయం ‘దేశం’ శ్రేణుల్లో ఇప్పటికీ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ వైఖరికి నిరసనగా కడియం శ్రీహరి 2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కడి యం శ్రీహరి అనూహ్య పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి టీడీఎల్పీ నేతగా నియమితులయ్యారు. వేర్వేరు పార్టీల్లో ఉన్న ఇద్దరు నేతల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఇద్దరి వ్యక్తిగత వైరం చివరికి పాలకుర్తి మార్కెట్ ఆవరణలో టీఆర్ఎస్-టీడీపీ నేతల మధ్య ఘర్షణ వరకు వెళ్లింది. ఇప్పుడు వీరిద్దరు ఎలా కలిసి పనిచేస్తారనేది భవిష్యత్ నిర్ణయించనుంది. సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మధ్య సుదీర్ఘకాలంగా వైరం ఉంది. రెండు వర్గాల మధ్య హత్యా రాజకీయాలు కొనసాగాయనే అభిప్రా యం ఉంది. వీరి వర్గపోరుపై అసెంబ్లీ స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నారు. సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన కొండా దంపతులకు రాజకీయంగా మంచి అవకాశాలు వచ్చాయి. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికకాగా.. మురళీధర్‌రావుకు ఆ పార్టీ ఇటీవలే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. కొండా సురేఖకు మంత్రివర్గంలో ఎప్పటికైనా చోటు దక్కుతుందనే ఆశాభావంతో వీరి శిబి రం ఉంది. అరుుతే, మూడు రోజుల క్రితం టీ ఆర్ఎస్లో చేరిన తమ నాయకుడికి మంత్రి పదవిపై టీఆర్ఎస్ నాయకత్వం హామీ ఇచ్చిందని ఎర్రబెల్లి దయాకర్‌రావు సన్నిహితులు చెబుతున్నారు. జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నందున కొత్తగా మరో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉండదనే అభిప్రాయం ఉంది. ఒక్కరికే ఇస్తే వీరి లో ఎవరికి ఇస్తారు, పదవి దక్కని వారు వైఖరి భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారనుంది. 2014 సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మధ్య అం తరం బాగానే ఉంది. దాదాపు రెండేళ్లుగా ఒకే పార్టీలో పనిచేస్తున్నా ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్నాయని టీఆర్ఎస్ వారే చెబుతుంటారు. కొండా మురళీధర్‌రా వు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే సందర్భంలోనూ జిల్లా నేతలెవరినీ పరిగణనలోకి తీసుకోకుండానే టీఆర్ఎస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమా ల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొనరని, ఇద్దరు నేతల మధ్య అంతరమే దీనికి కారణమని అంటున్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్లోకి వచ్చిన నేపథ్యంలో కడి యం, కొండా మధ్య సంబంధాలు మారతాయా, లేదా అనేది వేచి చూడాలి. -
కొండా మురళీ ఏకగ్రీవ ఎన్నిక
వరంగల్: వరంగల్ జిల్లాలోని స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. వరంగల్ ఎమ్మెల్సీగా కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు గురువారం ఉపసంహించుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు టీఆర్ఎస్ వశమైంది. ఈ స్థానానికి ఇండిపెండెంట్లు మినహాయిస్తే రాజకీయ పార్టీలకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కొండా మురళీ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆ పార్టీకి పోటీ లేకుండా పోయింది. నామినేషన్ దాఖలు సమయంలోనే విపక్షాలన్నీ చేతులెత్తేశాయి.కాగా కొండా మురళీ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల రెండో జాబితా
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ మంగళవారం మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ జిల్లా నుంచి కొండా మురళి, రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం నరేందర్‌రెడ్డి, శంభిపూర్ రాజు, మహబూబ్‌నగర్ నుంచి జగదీశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్లను ఖరారుచేసింది. తెలంగాణలో మొత్తం 12 స్థానాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ఏడుగురు అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ నుంచి పురాణం సతీష్, మెదక్ నుంచి భుపాల్ రెడ్డి, కరీంనగర్ నుంచి నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌రావు, నిజామాబాద్ నుంచి భుపతిరెడ్డి, ఖమ్మం నుంచి బాలసాని లక్ష్మీనారాయణ, నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి పేర్లను ఇదివరకే టీఆర్ఎస్ ప్రకటించింది. తాజాగా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించడంతో మొత్తం 12 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించినట్టైంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు కే కేశవరావు, డీ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి వరంగల్ విజయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పునరావృతం చేస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికలో సమతుల్యత పాటించామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు ఇతర పార్టీలు కలిసినా తమని ఓడించలేవని పేర్కొన్నారు. తెలంగాణవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. -
'శాసించే స్థితిలో ఉండాలనే టీఆర్ఎస్లో చేరుతున్నాం'
హైదరాబాద్: బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమని కొండా సురేఖ అన్నారు. టీఆర్ఎస్తోనే తెలంగాణ పునర్ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. తన భర్త కొండా మురళితో కలిసి కేసీఆర్‌తో భేటీ అయిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సమక్షంలో ఈ సాయంత్రం టీఆర్ఎస్ చేరుతున్నట్టు ఆమె వెల్లడించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. ఇన్నాళ్లు ఆయనను అపార్థం చేసుకున్నామని అన్నారు. పదవుల కోసం పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ మాట్లాడిన విధానం, భవిష్యత్ కార్యాచరణ నచ్చే పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉందన్నారు. శాసించే స్థితిలో ఉండాలన్న లక్ష్యంతోనే టీఆర్ఎస్ చేరుతున్నట్టు చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఎవరిపై విమర్శలు చేయలేదని సురేఖ అన్నారు. తన వల్ల టీఆర్ఎస్ శ్రేణులకు ఇబ్బంది కలిగితే అన్యదా భావించోదన్నారు. మహబూబాబాద్ ఘటన దురదృష్టకరమన్నారు. -
పాత గూటికి కొండా
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాలో కాంగ్రెస్ ముఖ చిత్రం మారుతోంది. ఒక్కరొక్కరుగా ఇతర పార్టీల నేతలు చేరుతుండడంతో పార్టీలో కొత్త సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికేవర్గ విభేదాలు, గ్రూపులతో ముక్కలు చెక్కలుగా ఉన్న కాంగ్రెస్‌లో ఇప్పుడు అంతర్గత కలహాలు మరింత పెచ్చరిల్లనున్నాయి. ఇటీవల వైఎస్సార్సీపీని వీడిన మాజీ మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులు పాత గూటికి చేరారు. సీఎం కిరణ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సురేఖ.. తమ రాజకీయ పుట్టినిల్లు, తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కాంగ్రెసేనని అన్నారు. ఇటీవలే టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి విజయరామారావు సైతం దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ హయాంలో కొండా దంపతులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. అప్పుడు సురేఖ మంత్రి పదవిలో ఉండటంతో పార్టీ జిల్లా శ్రేణుల్లోనూ వారి మాటే చెల్లుబాటయ్యేది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయం తారుమారైంది. జిల్లాలో పార్టీ ముఖ్యులే గ్రూపులుగా విడిపోయారు. ఇప్పటివరకు కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య కలిసి కట్టుగా ఒకే వేదికను పంచుకున్న దాఖలాలు లేవు. ముందు నుంచీ కొండాకు వ్యతిరేకంగా ఉన్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య, గండ్ర వెంకట రమణారెడ్డి, దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్‌లో కీలక స్థాయికి ఎదిగారు. చీఫ్ విప్ పదవిలో ఉండడంతో గండ్ర.. పార్టీలో పట్టు సాధించారు. ముగ్గురు మంత్రులకు దీటుగా సొంత వర్గాన్ని నిలబెట్టుకున్నారు. దొంతి మాధవరెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పట్లో కొండా అనుచరుడిగా ముద్ర వేసుకున్న జంగా రాఘవరెడ్డి ఇటీవలే డీసీసీబీ అధ్యక్షునిగా గెలుపొందారు. సహకార ఎన్నికల్లో సొంత పార్టీలోనే మాధవరెడ్డికి వ్యతిరేకంగా పోటాపోటీ క్యాంపులు పెట్టి పీఠాన్ని దక్కించుకున్నారు. మరోవైపు ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు మాలోతు కవిత, శ్రీధర్, మాజీ మంత్రి రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావులు ముఖ్య నేతలకు అంటీముట్టన్నట్లు ఉంటూ నియోజకవర్గాలకు పరిమితమయ్యారు. గ్రూపులకు అతీతంగా డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన రామసాయం రఘురాంరెడ్డి ఇటీవల జిల్లా రాజకీయాల్లో కేంద్ర బిందువయ్యారు. సీఎం సన్నిహితుడు కావటంతో హైదరాబాద్‌లో క్యాంప్ ఆఫీసు కేంద్రంగా చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో కొండా దంపతుల చేరికతో గ్రూపు రాజకీయాలు మలుపు తిరుగుతాయని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ముందుగా అడ్డుకున్న నేతలు ఆదరిస్తారా..? గతంతో పోలిస్తే పార్టీలో కొండా దంపతుల ప్రాబల్యం.. ప్రాధాన్యం పెరుగుతుందా..? తగ్గుతుందా..? ఇప్పటికే ముగ్గురు మంత్రులు.. ఆరు గ్రూపులుగా చీలిన జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మరింత ముదురుతాయా..? వేచి చూడాల్సిందే. -
చదరంగం.........
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పరకాల నియోజకవర్గంపై కన్నేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సమయం అదే సెగ్మెంట్లో వెచ్చిస్తున్నారు. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ కొత్త పరిణామాలు రాజకీయ శ్రేణుల్లో ఆసక్తి రేపుతు న్నాయి. రానున్న ఎన్నికల్లో తాను... లేకుంటే తన సతీ మణి గండ్ర జ్యోతిని అక్కడి నుంచి పోటీకి దింపేందుకు గండ్ర వ్యూహాత్మకంగా అడు గులు వేస్తున్నారనే ప్రచా రం జరు గుతోంది. పక్కనే ఉన్న భూపాల పల్లి సిట్టింగ్ స్థానమైనప్పటికీ.. గండ్ర ఈ సెగ్మెంట్‌పై దృష్టి సారించడం వెనుక రకరకాల కారణాలున్నాయని విశ్లేషి స్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్తో పొత్తు కూడుతుం దని... సీట్ల సర్దుబాటులో జిల్లాలో ముందుగా భూపా లపల్లి, నర్సంపేట సెగ్మెంట్లు త మకే ఇవ్వాలని టీఆర్ ఎస్ పట్టుబడుతుందనే వాదనలు న్నా యి. అందుకే తన సీటు చేజారితే ఏం చేయాలనే ముందు చూ పుతో... పక్కనే ఉన్న పరకాలలో గండ్ర దస్తీ వేసుకుంటు న్న ట్లు ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది. పొత్తులేమీ లే కుండా కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికలకు వెళితే తన సీటుకు ఢో కా ఉండదని.. బోనస్‌గా తన భార్య జ్యోతిని పరకాల నుంచి పోటీకి దింపాలనే ఆలోచనతో ఉన్నట్లు గండ్ర అనుచరగ ణంలో గుప్పుమంటోంది. పరకాల ఉప ఎన్నికల సమయంలో నే జ్యోతిని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దింపేందుకు గండ్ర చి వరి నిమిషం వరకు తీవ్రంగా ప్రయత్నించడం తెలిసిందే. మ రోవైపు కొండా దంపతులకు గట్టి పట్టు ఉన్న నియోజక వర్గం కావడంతో.. గండ్ర వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు స్ప ష్టమవుతోంది. వైఎస్సార్ సీపీని వీడిన తర్వాత మాజీ మంత్రి సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు తమ రాజ కీయ భవిష్యత్‌ను నిర్దేశించుకునే సంధి కాలంలో ఉన్నారు. మొదట్లో బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ, తెలం గాణ ఆకాంక్ష నెరవేర్చినందుకు పాత గూటిలో చేరేందుకు కొండా దంపతులు మొగ్గు చూపుతున్న వాదనలు వినిపిస్తు న్నాయి. ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌తో ఇప్పటికే మాటామంతి కుదిరిందని.. త్వరలోనే ఆయన స మక్షంలోనే పార్టీలో చేరే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోం ది. మళ్లీ కొండా దంపతులు ఎంట్రీ ఇస్తున్నారనే సంకేతాలపై జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్లోనూ భిన్నమైన వాదనలున్నా యి. ఇప్పటికే మంత్రులు పొన్నాల, సారయ్య, కేంద్ర మంత్రి బలరాం నాయక్, చీఫ్ విప్ గండ్ర కాంగ్రెస్‌లో పాతుకుపో యారు. బాహాటంగా ఎదురు చెప్పకపోయినా వీరిలో కొంద రు నేతలు కొండా రీ ఎంట్రీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కొండా దంపతులు పార్టీలో చేరితే కొత్త పవర్ సెంటర్ ఏర్ప డుతుందని.. కానీ గతంతో పోలిస్తే అక్కడ ప్రాధాన్యం తగ్గి పోతుందనే వాదనలు కొండా వర్గీయులను సైతం కలవర పెడుతున్నాయి. ఇదే అనువైన సమయంగా చీఫ్ విప్ గండ్ర ప రకాలలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుం డడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వరుసగా పర కాల కేంద్రంగా పార్టీ సమావేశాలు నిర్వహించడం... తెలం గాణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం... ఇదే సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తామంటూ గండ్ర జ్యోతి ప్రకటించడం... ఇవన్నీ సరికొత్త సంకేతాలు.