Konda Susmita Patel Fires On Errabelli Dayakar Rao At Kondaa Movie Pre Release Event - Sakshi
Sakshi News home page

Kondaa: సాయి పల్లవికి రెడ్‌కార్పె ట్‌ వేసి.. రేవంత్‌రెడ్డి ఆపారు : సుష్మితాపటేల్‌ ఫైర్‌ 

Jun 19 2022 2:50 PM | Updated on Jun 19 2022 3:31 PM

Kondaa Movie Pre Release Event: Sushmitha Patel Fires On Errabelli Dayakar Rao - Sakshi

రామ్‌ గోపాల్‌ వర్మ, కొండా మురళీ, సుష్మితా పటేల్‌, కొండా సురేఖ తదితరులు

సాక్షి,  హన్మకొండ అర్బన్‌: ‘చదువురానోడికి మంత్రి పదవి ఉన్నది కాబట్టి సినిమా ఫంక్షన్‌ వేడుకలకు అనుమతి ఇవ్వలేదు. అదే చదువుకున్న కడియం శ్రీహరి మంత్రిగా ఉంటే అనుమతి వచ్చేది’ అని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ నాయకుడు కొండా మురళి అన్నారు. కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా దర్శకుడు ఆర్జీవీ నిర్మించిన కొండా సినిమా ప్రీరిలీజ్‌ వేడుకను శనివారం రాత్రి హనుమకొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఆ చదువు రానోడి పేరు చెప్పనని, అతని గురించి సినిమాలో ఆర్జీవీ బాగా చూపించాడన్నారు. మురళి ఒక్కసారి మాట ఇచ్చాడంటే మెడ కోసుకుంటాడన్నారు.

(చదవండి: గద్దర్‌ పాటకి ఆర్జీవీ స్టెప్పులు.. వీడియో వైరల్‌)

సురేఖ మాట్లాడుతూ దౌర్జన్యాలు చేసే ప్రభుత్వాలను గద్దెదించాలని, అందుకు ఈ సినిమా స్ఫూర్తిగా ముందుకు సాగాలన్నారు. అణచి వేతలనుంచి పైకివచ్చామని, కష్టాలు తెలిసిన వారిగా ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. సినిమా నిర్మాత, కొండా దంపతుల కుమార్తె సుస్మితాపటేల్‌ మాట్లాడుతూ ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు నీ బతుకుమారదా..? నీ బతుకంతా భయంతోనేనా ... సాయి పల్లవికి రెడ్‌కార్పె ట్‌ వేశావు, నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవత్‌రెడ్డి వస్తుంటే భయపడి ఆపేశావు. ఇంకా ఎంతకాలం భయపడతావు.. ఎన్నికలు రానియ్‌ నీ సంగతి చెబుతా’ అంటూ  ఫైర్‌ అయ్యారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘కొండా మురళి, సురేఖ జీవించిన జీవితాన్ని రెండు గంటల్లో నాకు వీలైనంత బాగా సినిమా తీయడానికి ప్రయత్నించా. నేను ఆశించిన దానికంటే త్రిగుణ్‌ ఎక్కువ చేశాడు. ఇర్రా మోర్ అద్భుతంగా నటించింది. అభిలాష్ మెయిన్ విలన్ రోల్ చేశాడు. భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో అతడిని చూస్తారు. 'గాయం'లో 'చెలి మీద చిటికెడు దయ రాదా...' అని రొమాంటిక్ సాంగ్ తీశా. ఊర్మిళపై తీసిన ఆ పాటకు సుచిత్ర గారు కొరియోగ్రఫీ చేశారు. అప్పట్నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. గొప్ప గేయ రచయితల్లో ఒకరైన చంద్రబోస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన 'సురేఖమ్మ' పాట రాశారు. సుచిత్ర 'తెలంగాణ పోరి' పాటకు కొరియోగ్రఫీ చేశారు. గద్దర్ పాటలు కొన్ని తీసుకున్నాం. డి.ఎస్.ఆర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు' అని అన్నారు.

చిత్రంలో కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఈరామోర్‌ నటించారు. ఈ సినిమాకు  సుస్మితాపటేల్‌ నిర్మాతగా ఉండగా, శ్రేష్టపటేల్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుమ కనకాల యాంకర్‌గా వ్యవహరించారు. ఉమ్మడి జిల్లానుంచి కొండా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేడుకలో దర్శకుడు ఆర్జీవీ, సినిమా తారాగణం పాల్గొన్నారు.



     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement