Ram Gopal Varma Aggressive Dance At Kondaa Pre Release Event, Video Viral - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma గద్దర్‌ పాటకి ఆర్జీవీ స్టెప్పులు.. వీడియో వైరల్‌

Jun 19 2022 2:23 PM | Updated on Jun 19 2022 3:04 PM

Ram Gopal Varma Dance For Gaddar Song In Kannada Movie Pre Release Event - Sakshi

సినిమా ప్రమోషన్‌ విషయంలో నలుగురు నడిచే దారిలో కాకుండా.. కాస్త భిన్నంగా వ్యవహరించడం ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అలవాటు. ఆయన తన సినిమాని ప్రమోట్‌ చేసుకోవడం కోసం రకరకాల పాట్లు పడతాడు. ఏదో ఒకటి చేసి మొత్తానికి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. తాజాగా తన కొత్త సినిమా ‘కొండా’ ప్రమోషన్స్‌ కోసం ఏకండా స్టేజ్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు ఆర్జీవి. 

(చదవండి: మీరు లేకుండా నేను లేను నాన్నా..మహేశ్‌బాబు ఎమోషనల్‌ పోస్ట్‌)

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. కొండా సుష్మితా పటేల్ నిర్మించారు. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.ఈ ఈవెంట్‌లో ఆర్జీవి తొలిసారి స్టేజ్‌పై డాన్స్‌ చేశాడు. గద్దరన్న పాటకు తనదైన శైలీలో స్టెప్పులేసి మెప్పించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement