Actress Irra Mor Interesting Comments About Kondaa Movie And Konda Surekha - Sakshi
Sakshi News home page

Kondaa Movie: ఏ నటికి అయినా సరే ఆమెలా ఉండటం కష్టం : ‘కొండా’ హీరోయిన్‌

Jun 16 2022 4:09 PM | Updated on Jun 16 2022 4:49 PM

Actress Irra Mor Talk About Kondaa Movie - Sakshi

కాలేజీ జీవితం నుంచి రాజకీయ ప్రయాణం వరకూ ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. నటిగా ఫెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న రోల్

‘కొండా సురేఖ వెరీ స్ట్రాంగ్ లేడీ. జీవితంలో ఆవిడ ఎన్నో మంచి పనులు చేశారు. ఆవిడ కఠిన పరిస్థితులను తట్టుకుని నిలబడ్డారు. నా జీవితం ఇప్పుడే మొదలైంది. మా ఇద్దరికీ చాలా వ్యత్యాసం ఉంది. ఆవిడతో కంపేర్ చేసుకోలేను. మా మధ్య ఉన్న ఒక్క కామన్ పాయింట్ ఏంటంటే... నేను కూడా స్ట్రాంగ్. భయపడకూడదని నా తల్లిదండ్రులు చెప్పారు’అని హీరోయిన్‌ ఇర్రా మోర్‌ అన్నారు. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన చిత్రం ‘కొండా’. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కొండా మురళిగా త్రిగుణ్‌, సురేఖగా ఇర్రా మోర్‌ నటించారు.శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 23న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం హీరోయిన్‌ ఇర్రా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

అలా ‘కొండా’లో అవకాశం
రామ్‌గోపాల్ వర్మ్‌ శిష్యుడు సిద్దార్థ్‌ తెరకెక్కించిన 'భైరవగీత’ చిత్రంతో నా సినీ కెరీర్‌ స్టార్ట్‌ అయింది. ఈ చిత్రం తర్వాత రెండు వెబ్‌ సిరీస్‌లు చేశా. లాక్‌డౌన్‌లో ఉండగా వర్మ గారు 'కొండా' సినిమా స్క్రిప్ట్ పంపారు. నాకు సురేఖమ్మ పాత్ర బాగా నచ్చింది. కాలేజీ జీవితం నుంచి రాజకీయ ప్రయాణం వరకూ ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. నటిగా ఫెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న రోల్. అందులో నటించగలనని వర్మగారు అనుకోవడం నా అదృష్టం. 

కాపీ చేయలేదు.. నా శైలీలో నటించా
‘కొండా’మూవీ స్క్రిప్ట్ చదివాక... యూట్యూబ్‌లో ఆమె వీడియోస్ చూశా. లాక్‌డౌన్‌ కారణంగా అప్పట్లో సురేఖమ్మతో మాట్లాడటం కుదరలేదు. ఆ తర్వాత మా ఇంట్లో లుక్ టెస్ట్ చేశా. శారీ కట్టుకుని చూశా. ఆమె రాజకీయ నాయకురాలు కూడా.. అందువల్ల, ఎటువంటి దుస్తులు వేసుకోవాలి? ఏవి వేసుకోకూడదు? అని డిస్కస్ చేసుకున్నాం. వర్మ గారితో మాట్లాడి సురేఖమ్మ గురించి తెలుసుకున్నా. ఆ తర్వాత ఆమెతో మాట్లాడాను. ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడేవారు? అనేది చూశా. ఆవిడను కాపీ చేయాలనుకోలేదు. నా శైలిలో నటించా. కానీ, ఆవిడ వ్యక్తిత్వం పాత్రలో కనిపించేలా చూసుకున్నా.

అది వర్మకు బాగా తెలుసు
కొండా కంటే ముందే వర్మ ప్రొడక్షన్ హౌస్‌లో 'భైరవగీత' చేశాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించా. ప్రతి సన్నివేశాన్ని ఆయన దగ్గరుండి తీశారు. నటీనటుల నుంచి ఏం తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. వెరీ క్లియర్. అలాగే, ఆయన మేకింగ్ ఫాస్ట్‌గా ఉంటుంది. త్రిగుణ్‌ చాలా మంచి నటుడు.చాలా ఈజీగా పాత్రలోకి వెళతాడు. వెంటనే బయటకు వస్తారు. యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సెట్‌లో సీరియస్‌గా ఉంటాడు. కానీ, బయట సరదాగా ఉంటాడు.  

ఆమెలా ఉండటం కష్టం
బయోపిక్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనిషి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడం. మనం లుక్స్ పరంగా మార్పులు చేయవచ్చు. మనిషిని పోలిన మనిషిని తీసుకు రావడం కష్టం కదా! అయితే... క్యారెక్టర్ పరంగా ఎటువంటి మార్పులు చేయలేం. అందువల్ల, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సురేఖమ్మ పబ్లిక్‌లో ఉన్న మనిషి. రాజకీయాల్లో ఉన్నారు. ఆమెకు ఓ ఇమేజ్ ఉంది. ఏ నటికి అయినా సరే ఆమెలా ఉండటం కష్టం. అయితే, సురేఖమ్మలా నటించి ప్రజల చేత గౌరవం సంపాదించుకోవడం ముఖ్యం. సినిమా చూశాక... ప్రేక్షకులు నన్ను గౌరవిస్తారని ఆశిస్తున్నాను. 

సురేఖమ్మ పాత్రకు వెయ్యి శాతం న్యాయం చేశావని మెచ్చుకున్నారు
సురేఖమ్మ గారి అమ్మాయి సుష్మిత మా సినిమా ప్రొడ్యూసర్. ఆవిడను నేను ముందు కలవలేదు. ఒక నెల షూటింగ్ చేశాం. ఆ తర్వాత ఆవిడ రషెస్ చూశారు. ఫోన్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్‌లో కొండా మురళి గారిని షూట్ చేసే సన్నివేశం వస్తుంది. నిజంగా జరిగినప్పుడు సుష్మిత ఆయన దగ్గర ఉన్నారు. సినిమా స్టార్ట్ చేసే ముందు నేను ముంబై నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి ఎలా యాక్ట్ చేస్తానోనని అనుకున్నారట. ఇంటర్వెల్ సీన్ చూశాక మెచ్చుకున్నారు. సురేఖమ్మ పాత్రకు వెయ్యి శాతం న్యాయం చేశానని చెప్పారు.'కొండా' షూటింగ్ చేసేటప్పుడు వరంగల్‌లోని మురళి - సురేఖమ్మ గారి గెస్ట్ హౌస్‌లో ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీతో చాలా కలిసిపోయాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement