'శాసించే స్థితిలో ఉండాలనే టీఆర్ఎస్లో చేరుతున్నాం' | Konda Surekha and her husband Murali to join TRS | Sakshi
Sakshi News home page

'శాసించే స్థితిలో ఉండాలనే టీఆర్ఎస్లో చేరుతున్నాం'

Mar 18 2014 3:32 PM | Updated on Sep 2 2017 4:52 AM

'శాసించే స్థితిలో ఉండాలనే టీఆర్ఎస్లో చేరుతున్నాం'

'శాసించే స్థితిలో ఉండాలనే టీఆర్ఎస్లో చేరుతున్నాం'

బంగారు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యమని కొండా సురేఖ అన్నారు. టీఆర్ఎస్తోనే తెలంగాణ పునర్ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు.

హైదరాబాద్: బంగారు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యమని కొండా సురేఖ అన్నారు. టీఆర్ఎస్తోనే తెలంగాణ పునర్ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. తన భర్త కొండా మురళితో కలిసి కేసీఆర్తో భేటీ అయిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సమక్షంలో ఈ సాయంత్రం టీఆర్ఎస్ చేరుతున్నట్టు ఆమె వెల్లడించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. ఇన్నాళ్లు ఆయనను అపార్థం చేసుకున్నామని అన్నారు.

పదవుల కోసం పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ మాట్లాడిన విధానం, భవిష్యత్ కార్యాచరణ నచ్చే పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. పరకాల నుంచి స్వతంత్ర  అభ్యర్థిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉందన్నారు. శాసించే స్థితిలో ఉండాలన్న లక్ష్యంతోనే టీఆర్ఎస్ చేరుతున్నట్టు చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఎవరిపై విమర్శలు చేయలేదని సురేఖ అన్నారు. తన వల్ల టీఆర్ఎస్ శ్రేణులకు ఇబ్బంది కలిగితే అన్యదా భావించోదన్నారు. మహబూబాబాద్ ఘటన దురదృష్టకరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement