RGV Konda Trailer Out Now - Sakshi
Sakshi News home page

Kondaa Trailer: నా పేరు కొండా మురళీ.. ఏ మురళీ?

Jan 26 2022 2:41 PM | Updated on Jan 26 2022 2:50 PM

Konda Movie Triler Out - Sakshi

నా నిర్ణయాలకు నేనే బాధ్యుడిని, కాబట్టి నా మాటే నేను వింటా

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా మురళీ, సురేఖల జీవిత నేపథ్యాన్ని  బేస్ చేసుకుని వర్మ ఈ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ‘కొండా’ ట్రైలర్ విడుదల చేశాడు ఆర్జీవీ.  ‘సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు.. బాగు చెయ్యాలె.. పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప’అంటూ ఆర్జీవీ వాయిస్‌తో ఈ ట్రైలర్‌ ప్రారంభం అవుతోంది.

విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కార్ల్‌ మార్క్స్‌ 180 ఏళ్ల క్రితం  చెప్పారు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య నుంచే పుట్టిన వ్యక్తి కొండా ముళీ’ అంటూ హీరోని పరిచయం చేశాడు ఆర్జీవీ. ఈ సినిమాలో కొండా మురళీగా త్రిగణ్, కొండా సురేఖ పాత్రలో ఈరా మోర్ నటించింది. ట్రైలర్‌లోని ప్రతి సీన్‌లోనూ త్రిగణ్‌ నటన అద్భుతంగా ఉంది. ‘నా నిర్ణయాలకు నేనే బాధ్యుడిని, కాబట్టి నా మాటే నేను వింటా’, నా పేరు కొండా మురళీ.. ఏ మురళీ? అనే డైలాగ్స్‌ ఆట్టుకునేలా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement