
ఖైరతాబాద్(హైదరాబాద్): ప్రతి యేటా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులను జూన్ 6న నిర్జల ఏకాదశి రోజు కర్రపూజ నిర్వహించి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వరుసగా 71వ సంవత్సరం మహాగణపతిని ఖైరతాబాద్‌లో ప్రతిష్టంచనున్నామని చెప్పారు. మూడు నెలల ముందే ప్రతి సంవత్సరం వినాయక విగ్రహ తయారీ పనులను ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఆగస్ట్ 27న వినాయక చవితి ఉండటంతో జూన్ 6న సాయంత్రం 5 గంటలకు కర్ర పూజ నిర్వహించి పనులను ప్రారంభించనున్నారు.