
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ వద్ద నున్న కేంద్రం పంపించిన ఎరువుల ను 24 గంటల్లో రైతులకు ఇవ్వక పోతే...ఆ కార్యాలయాలను బీజేపీ కార్యకర్తలు ముట్టడించి ప్రజలకు పంపిణీ చేస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 17న సభ కోసం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్ ఇవ్వా లంటూ కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ–బీఆర్‌ఎస్ ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితల మధ్య వ్యాపార సంబంధాలు, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్–బీఆర్‌ఎస్‌లు కలిసి పోటీ చేయడంపై చెప్పాలని డిమాండ్ చేశారు.