breaking news
Fertilizers Corporation of India
-
ఐదేళ్లలో ఎరువుల రాయితీ రూ. 9.7 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతన్నలపై ఎరువుల ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో రాయితీ చెల్లించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆగస్టు 7వ తేదీ వరకు ఎరువుల తయారీదారులు, దిగుమతిదారులకు రాయితీ కింద రూ.9.7 లక్షల కోట్లకు పైగా విడుదల చేసినట్లు కేంద్ర ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీ రూ.83,467.85 కోట్లు కాగా, 2020–21లో అది రూ. 1,31,229.51 కోట్లకు చేరింది. 2021–22లో రూ.1,57,640.08 కోట్లు, 2022–23లో రికార్డు స్థాయిలో రూ.2,54,798.93 కోట్లు, 2023–24లో రూ.1,95,420.51 కోట్లు, 2024–25లో రూ.1,77,129.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరం ఆగస్టు 7 వరకు రూ.62,983.61 కోట్ల సబ్సిడీ భారం భరించినట్లు మంత్రి వెల్లడించారు. పెరిగిన ఉత్పత్తి.. తగ్గిన దిగుమతులు 2019–20లో దేశంలో 425.95 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, 2023–24 నాటికి ఇది 503.35 లక్షల టన్నులకు చేరుకుంది. 2024–25లో 517.90 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, 2025–26లో జూన్ వరకు 120.63 లక్షల టన్నుల ఎరువులు ఉత్పత్తి అయిననట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. మరోవైపు విదేశాల నుంచి ఎరువుల దిగుమతులు క్రమంగా తగ్గుతుండడం ప్రభుత్వానికి ఊరటనిస్తోంది. దిగుమతులు 2019–20లో 184.09 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2023–24లో 176.95 లక్షల టన్నులకు, 2024–25లో 160.29 లక్షల టన్నులకు తగ్గాయి. 2025–26లో జూలై వరకు 48.54 లక్షల టన్నుల ఎరువులు దిగుమతి అయ్యాయి. -
ఎరువు కరువు
సాక్షి, అమరావతి: ఆదిలోనే హంసపాదు అన్నట్టు.. కూటమి ప్రభుత్వం పుణ్యమాని ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రైతులు ఎరువుల కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. సొసైటీ కేంద్రానికి ఎరువులు వస్తున్నాయని తెలియడం ఆలస్యం.. వ్యవసాయ పనులు మానుకుని గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. కొన్ని జిల్లాల్లో గతంలో మాదిరిగా చెప్పులు, సంచులను వరుసలో పెట్టి ఎదురుచూపులు చూస్తున్నారు. రాష్ట్రంలో ఎరువుల నిల్వలపై అధికారులు చెబుతున్న లెక్కలకు, క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్న నిల్వలకు పొంతన లేకుండా ఉంది. రైతు సేవా కేంద్రాలకే కాదు.. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, జిల్లా కేంద్ర మార్కెటింగ్ కేంద్రాలకు సైతం అరకొరగా కేటాయిస్తుండడంతో క్షేత్ర స్థాయిలో కొరత ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లు ఎమ్మార్పీకి మించి అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్నారు. అవసరం లేకున్నా పురుగు మందులను బలవంతంగా అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.పొంతన లేని ఎరువుల లెక్కలురాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో 85.26 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా, పట్టుమని 12 లక్షల ఎకరాల్లో కూడా పంటలు సాగవలేదు. సీజన్ ప్రారంభమై 45 రోజులు దాటినా వర్షాభావ పరిస్థితులతో సాగు ఊపందుకోలేదు. » గతంలో ఏటా ఖరీఫ్ సీజన్‌కు 19 లక్షల టన్నుల ఎరువులు కేటాయించేవారు. అయితే, 2024–25లో 17.50 లక్షల టన్నులకు, 2025–26లో 16.76 లక్షల టన్నులకు కుదించారు. ప్రారంభ నిల్వలతో కలిపి 13.56 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. గత 45 రోజుల్లో 4.89 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం 8.66 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా ఏటా 1.50 లక్షల టన్నులు బఫర్ స్టాక్ రూపంలో నిల్వ చేసి డిమాండ్ మేరకు పీఏసీఎస్‌లు, ఆర్ఎస్కేలు, డీసీఎంఎస్‌ల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచేవారు. బఫర్ స్టాక్ కేటాయింపులను ఈ ఏడాది నుంచి 2 లక్షల టన్నులకు పెంచినట్టుగా గొప్పలు చెప్పుకొన్నారు. క్షేత్ర స్థాయిలో చూద్దామంటే ఎరువు కట్ట కూడా కనిపించడం లేదు. రైతు సేవా కేంద్రాలకే కాదు సొసైటీలు, డీసీఎంఎస్ కేంద్రాల్లో సైతం డిమాండ్‌కు సరిపడా నిల్వల్లేక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు.80 శాతం ఎరువులు.. ఎమ్మార్పీకి మించి విక్రయాలుజిల్లాలకు సరఫరా చేస్తున్న ఎరువుల్లో 70–80 శాతం ప్రైవేటు వ్యాపారులకే కేటాయిస్తున్నారు. సొసైటీలు, డీసీఎంఎస్‌లకు అరకొరగా ఇస్తుండడంతో వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. యూరియా, డీఏపీ ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పైగా ఎమ్మార్పీకి తాము చెప్పినంత ధర ఇవ్వాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. కారణం ర్యాక్‌ల నుంచి రిటైల్, హోల్‌సేల్ దుకాణాలకు తీసుకొచ్చేందుకు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని చెబుతున్నారు. యూరియా బస్తా ధర రూ.266.50 కాగా, బహిరంగ మార్కెట్లో రూ.350–రూ.450 వరకు విక్రయిస్తున్నారు. డీఏపీ బస్తా రూ.1,350 కాగా, బహిరంగ మార్కెట్లో రూ.1,450 నుంచి రూ.1,500 మధ్య విక్రయిస్తున్నారు. మిగిలిన ఎరువులు కూడా ఎమ్మార్పీపై రూ.50–100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. పెద్దగా డిమాండ్ లేని, రైతులకు అవసరం లేని ఎరువులను రైతులకు బలవంతంగా అంటగడుతున్నారు. డీఏపీ కట్ట కావాలా? అయితే మిశ్రమ ఎరువులు తీసుకోండి అంటూ మెలికపెడుతున్నారు. భారంగా మారిన ఎరువుల ధరలుగత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎరువుల ధరలు అనూహ్యంగా పెరిగాయి. యూరియా, డీఏపీ, 28–28–0 ఎరువులు మినహా మిగతావాటి ధరలన్నీ భారీగా పెరిగాయి. సగటున బస్తాకు రూ.50–రూ.330 మేర పెరిగాయి. అత్యధికంగా 10–26–26 ఎరువు బస్తా (50 కిలోల) ధర రూ.1,470 నుంచి రూ.1,800కు పెరిగింది. పొటాష్ (50 కిలోల) ధర రూ.1,535 నుంచి రూ.1,800 కావడం రైతులకు పెనుభారంగా మారింది.మరోవైపు చైనా నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో డ్రిప్ ఎరువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే 25–60 శాతం మేర పెరిగాయి. ఎంఏపీ, ఎంకేపీ ఎరువులు ధరలు సైతం కిలోకు రూ.60–80, ఫె–ఈడీడీహెచ్ఏ (ఐరెన్ చెలేట్) వంటి సూక్ష్మ ఎరువుల ధరలు కిలో‡ రూ.280–రూ.320 ఉండగా, వీటి ధరలు రూ.500 నుంచి రూ.600కు, జెడ్ఎన్–ఏడీటీఏ అనే జింక్ ఎరువుల ధరలు కిలో రూ.150–180 ఉండగా, రూ.280 నుంచి రూ.350కు పెరిగాయని చెబుతున్నారు. ఉద్యాన పంటల సాగులో కీలక భూమిక పోషించే సూక్ష్మ పోషక ఎరువులు (మైక్రో న్యూట్రియెంట్స్) కొరత తీవ్రంగా ఉంది.ఆర్ఎస్కేల్లో కానరాని వైనం..రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల కొరత వేధిస్తోంది. 2020 మే 30న ఆర్బీకేలు ఏర్పాటవగా, 2023–24 సీజన్ వరకు ఏనాడూ గ్రామ స్థాయిలో లోటు తలెత్తలేదు. సొసైటీలకు ప్రాధాన్యమిసూ్తనే ఆర్బీకేలకు ఏటా నిల్వలు పెంచుతూ వెళ్లారు. ఏటా సగటున 8.53 లక్షలమందికి 3.26 లక్షల టన్నుల చొప్పున నాలుగేళ్లలో ఆర్బీకేల ద్వారా 34.11 లక్షల మందికి 13.31 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేశారు. 2024–25 సీజన్లో 10 లక్షల టన్నుల ఎరువులు నిల్వ చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించగా, గతేడాది అతికష్టమ్మీద లక్ష టన్నులకు మించి సరఫరా చేయలేకపోయారు. కానీ, ఈ ఏడాది మరీ ఘోరం. ఆర్ఎస్కేలకు మొక్కుబడి కేటాయింపులతోనే సరిపెడుతున్నారు. జిల్లాల పరిధిలోని ఆర్ఎస్కేల్లో కనీసం 10 శాతం కేంద్రాలకు కూడా కేటాయింపులు జరపడం లేదు. అది కూడా రేషన్ బియ్యం మాదిరిగా బస్తా లెక్కన సరఫరా చేస్తున్నారు. ఆర్ఎస్కేల్లోనే కాదు.. సొసైటీలు, డీసీఎంఎస్‌లకు కేటాయించే ఎరువులను కూటమి నేతలు సిఫార్సుల మేరకు ఇస్తున్నారు. రాష్ట్రంలో 8.66 లక్షల టన్నుల ఎరువులున్నాయని చెబుతుండగా, ఆర్ఎస్కేల్లో మాత్రం 14 వేల టన్నులకు మించి నిల్వల్లేవు. వాటిలో యూరియా 8 వేలు, డీఏపీ 5 వేల టన్నులే ఉన్నాయి. ఇక కాంప్లెక్స్ ఎరువులు వెయ్యి టన్నులు, ఎంవోపీ 400 టన్నులు, ఎస్ఎస్పీ కేవలం 40 టన్నులు మాత్రమే ఆర్ఎస్కేల్లో ఉన్నాయి. ఎరువుల సరఫరాలో వికేంద్రీకరణ విధానం పాటించాలని, ఆర్ఎస్కేలకు కూడా స్థానిక డిమాండ్ మేరకు తగినంత కేటాయింపులు జరపాలని జిల్లా కలెక్టర్లు ప్రతిపాదిస్తున్నా ఆర్ఎస్కేల ప్రాధాన్యం తగ్గించాలన్న కుట్రలో భాగంగా వాటికి ప్రభుత్వం కేటాయింపులు జరపడంలేదు. నాలుగేళ్లు.. కానరాని క్యూలైన్లువైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2019–24 మధ్యన.. ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఎరువులు సరçœరా చేశారు. గ్రామంలోనే ఎరువులు లభించడంతో రవాణా, లోడింగ్, అన్లోడింగ్ రూపంలో రూ.100 కోట్ల వరకు రైతులకు ఆదా అయింది. అన్నిటికి మించి క్యూలైన్లలో నిల్చొవాల్సిన బాధ తప్పింది. బ్లాక్ మార్కెట్ బెడద లేకుండా పోయింది. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ గత ఏడాదిగా సొసైటీలు, డీసీఎంఎస్ కేంద్రాలతో పాటు మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 2019కి ముందు కనీసం నాలుగైదుసార్లు తిరిగితే కానీ ఎరువులు దొరికేవి కావు. మండల స్థాయిలో జరిగే పంపిణీ వల్ల రవాణా చార్జీలు తడిసి మోపెడయ్యేవి. వెళ్లిన ప్రతిసారి దూరాభారాన్ని బట్టి తక్కువలో తక్కువ రూ.100 ఖర్చయ్యేవి. భోజనసాదర్లు మరో రూ.50. ఎరువుల కట్ట (బస్తా) గ్రామానికి తెచ్చేందుకు రూ.20–30. డిమాండ్ చేసిన ధర ముట్టజెప్పడంతో పాటు అవసరం ఉన్నా లేకున్నా డీలర్ అంటగట్టే పురుగు మందులు కొంటే కానీ.. ఎరువుల కట్ట చేతికొచ్చేది కాదు. ఎక్కడికెళ్లినా విత్తనాల కోసం చెప్పుల క్యూ కన్పించేవి. మండుటెండలో నిల్చొని స్పృహ తప్పిపడిపోవడం, వడగాడ్పుల బారినపడి మత్యువాత పడడం అప్పట్లో సాధారణంగా కనిపించేది. బ్లాక్ మార్కెట్లో ఎమ్మార్పీకి మించి ముట్టజెబితే కానీ ఎరువులు దొరికే పరిస్థితి ఉండేది కాదు. రైతులు మళ్లీ ఇప్పుడు ఇవే అవస్థలు పడుతున్నారు. యూరియా కొరత తీవ్రంగా ఉంది..ఖరీఫ్ సీజన్ వచ్చి మూడు వారాలు కావస్తోంది. వరి నాట్లు వేసే సమయానికి వేయాల్సిన ఎరువులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. డీఏపీ రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నప్పటికీ, యూరియా కొరత తీవ్రంగా ఉంది. డీఏపీపాటు ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, చెరకు పంటలకు ఉపయోగించే యూరియాను పంపిణీ చేయాలి. – రెడ్డి తవిటినాయడు, రామవరం, సీతానగరం మండలం పదహేను రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నానాకు ఐదెకరాల పొలం ఉంది.మొక్కజొన్న పంటను సాగు చేశాను. పంట పెరుగుదలకు యూరియా అవసరం.15 రోజులుగా గ్రామంలోని రైతు సేవా కేంద్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా. ఇప్పటికీ యూరియా లభించలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేలో డబ్బు కట్టిన వెంటనే ఎరువులు, పురుగు మందులు ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. – నాగేంద్ర, రైతు, బసంపల్లి, శెట్టూరు మండలం, అనంతపురం జిల్లాయూరియా ఎక్కడ?సోమశిల: యూరియా కోసం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం అన్నదాతలు రోడ్డెక్కారు.అనంతసాగరం సొసైటీ ఎదుట రోడ్డుపై రెండు గంటల పాటు బైఠాయించారు. సొసైటీలో యూరియా స్టాక్ ఉందనే సమాచారంతో బుధవారం ఉదయం 7 గంటలకు పెద్ద ఎత్తున రైతులు సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సొసైటీలో రెండు లోడుల కన్నా ఎక్కువగా యూరియా స్టాక్ ఉన్నప్పటికీ రైతులను చూసి సొసైటీ సిబ్బంది గేట్లు తీయలేదు. రైతులు అధికంగా ఉన్నారని, గొడవలు తలెత్తుతాయని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకుని యూరియాను అందిస్తామని వెళ్లిపోయారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీ ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు 200 మంది రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో మండల వ్యవసాయాధికారులు సొసైటీ వద్దకు చేరుకుని రైతులకు యూరియాను పంపిణీ చేశారు. -
కల్తీ ఎరువులపై కఠిన చర్యలు: కేంద్రం∙
సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ, నాసిరకం ఎరువుల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రులను కోరారు. ఆదివారం ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకని, రైతుల ఆదాయంలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, వారికి సరైన సమయంలో సరసమైన ధరలకు ప్రామాణికతతో నాణ్యమైన ఎరువులను అందించడం చాలా అవసరమని నొక్కి చెప్పారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఎరువుల లభ్యతను నిర్ధారించాలని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించడం, సబ్సిడీ ఎరువుల మళ్లింపు వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. సంప్రదాయ ఎరువులతో పాటు నానో–ఎరువులు, బయో–స్టిమ్యులెంట్ ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టడాన్ని వెంటనే అరికట్టాలన్నారు. దోషులుగా తేలితే లైసెన్స్‌ల రద్దు వంటి కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, తగు శిక్షలు పడేలా చూడాలని సూచించారు. ఎరువుల్లో కల్తీపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. -
Sagubadi ఎరువుల లోకం..!
రసాయనిక ఎరువులు, అధిక దిగుబడినిచ్చే వంగడాలు, నీటిపారుదల సదుపాయాలు.. ఈ మూడింటిని ఒక ప్యాకేజీగా రైతులకు అందుబాటులోకి తెచ్చింది ‘హరిత విప్లవం’. ఆంగ్లంలో ఈ మూడిటిని కలిపి గ్రీన్ రెవెల్యూషన్ టెక్నాలజీస్ (జిఆర్టిలు) అంటారు. హరిత విప్లవ కాలంలో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో రైతులకు ఈ మూడే విస్తృతంగా అందుబాటులోకి రావటంతో పంట దిగుబడులు ఇబ్బడిముబ్బడి అయ్యాయి. ఏటేటా రసాయనిక ఎరువులతో పాటు పురుగుమందులు తదితర వ్యవసాయ రసాయనాల వాడకం పెరుగుతూనే ఉంది.పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు తదితర వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తిని పెంచవలసి వస్తోంది. అయితే, రసాయనిక ఎరువుల వాడకాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోవటం వల్ల పర్యావరణ సంబంధమైన సమస్యలు వస్తున్నాయి. నేలలు చౌడుబారిపోతున్నాయి. నీటి వనరులు రసాయనిక ఎరువుల అవశేషాలతో కలుషితం అవుతున్నాయన్న ఆందోళనలు సైతం పెరిగిపోతున్నాయి. అందువల్లనే పర్యావరణానికి అంతగా హాని చేయని సుస్థిర / సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇటీవల కాలంలో గతమెన్నడూ లేనంతగా ఆదరణ పొందుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ నూటికి 95 శాతం మంది రైతులు రసాయనిక ఎరువులతోనే వ్యవసాయం చేస్తున్నారు. ఇంతకీ, ఏయే దేశాల్లో పంటలకు ఎంతెంత మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతున్నారు? నత్రజని అనగానే యూరియా గుర్తొస్తుంది. పంటలకు యూరియా యేతర మార్గాల ద్వారా నత్రజని ఎంతెంత అందుతుంది? ఎరువులను ఎంతెంత వాడుతున్నారు? వీటిని శాస్త్రవేత్తలు సూచించిన దానికన్నా అనేక రెట్లు ఎక్కువ వాడుతుండటం వల్ల వస్తున్న పరిణామాలేంటి? ఇటువంటి ఆసక్తికరమైన అంశాలను పరిశీలిద్దాం.. కాసేపు రసాయనిక ఎరువుల లోకంలోకి తొంగి చూద్దాం...పంట మొక్కలు, తోటలు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలసాయాన్ని ఇవ్వాలంటే వాటి పెరుగుదలకు అవసరమైనంత మోతాదులో 17 రకాల పోషకాలు అవసరం. ఇవి రెండు రకాలు.. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. కర్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్.. ఈ మూడింటిని వాతావరణం నుంచి మొక్కలు గ్రహిస్తాయి. మిగతా 14 రకాలు నేల నుంచి వేర్ల ద్వారా పంటలు గ్రహిస్తాయి.చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?అదేవిధంగా ఎరువుల్లో రెండు రకాలు. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు (జీవన ఎరువులు కూడా ఈ కోవలోకే వస్తాయి). నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అనేవి స్థూల పోషకాలు. ఇవి పెద్ద పరిమాణంలో పంటలకు అవసరం. ఐరన్, జింక్, బోరాన్, మెగ్నీషియం.. వంటి సూక్ష్మపోషకాలు. ఇవి స్వల్ప పరిమాణంలో అవసరం. సాధారణంగా రసాయనిక ఎరువులు అని అంటే చాలా వరకు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అనే అర్థం. ఎన్పీకే ఎరువులని అంటుంటాం. 2024లో 19.54 కోట్ల మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులను ప్రపంచవ్యాప్తంగా రైతులు పంటల సాగు కోసం ఉపయోగించారు. 2023 కన్నా ఇది కొంచెం ఎక్కువ. 2022లో 18.5 కోట్ల టన్నులు వాడారు. 2021తో పోల్చితే ఇది 7% తక్కువ. కొవిడ్ నేపథ్యంలో రసాయనిక ఎరువుల ధరలు బాగా పెరిగిపోవటంతో కొన్ని చోట్ల వాడకం తగ్గినా అది తాత్కాలిక పరాణామమేనని చెప్పాచ్చు.రసాయనిక ఎరువుల ఉత్పత్తి, ఎగుమతి యూరప్, అమెరికా ఖండాల్లో ఎక్కువ. ఐదు దేశాలు ఎరువుల ఎగుమతిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే వాడకం ఆసియాలో ఎక్కువ. భారత్ సహా ఆసియా దేశాలన్నీ రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకుంటూ వ్యవసాయానికి మద్దతు పలుకుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధ కాలంలో ఎరువుల సరఫరా తగ్గి, ధర పెరిగిపోవటం మనకు తెలుసు. ఆయా దేశాల్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, నేలల్లో సారం, రైతుల స్థోమత, వారు అనుసరిస్తున్న సాంకేతికత, స్థానిక ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలు వంటి అనేక పర్యావరణ, ఆర్థిక, భౌగోళిక అంశాలపై ఎరువుల వాడకం మోతాదులు, దిగుబడులు వంటివి ఆధారపడి ఉంటాయి.ఎరువుల వినియోగం 18.5 కోట్ల టన్నులుప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం (పంటలు, పశుపోషణ, ఆక్వాకల్చర్, అడవుల పెంపకం, చేపల వేటసహా) ద్వారా సమకూరే ఆదాయం 2000–2022 మధ్య కాలంలో 89 శాతం పెరిగింది. 2022లో 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో ఆసియా దేశాలదే 66%తో ప్రధాన పాత్ర. ప్రపంచ దేశాల వార్షిక ఆదాయంలో 4% మాత్రమే వ్యవసాయ రంగం నుంచి వస్తున్నప్పటికీ స్వతంత్ర ఆహారోత్పత్తి వ్యవస్థను కలిగి ఉండటం ఏ దేశానికైనా ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవటానికి అవసరమే. అందుకు ఈ రోజుకు ప్రధాన సాధనంగా రసాయనిక ఎరువులే నిలుస్తున్నాయి. ఇదీ చదవండి: పెళ్లైన 20 ఏళ్లకు.. మా ఆవిడ బెదిరిస్తోంది : కేసు అవుతుందా?ఆహార వ్యవసాయ సంస్థ (యుఎన్–ఎఫ్పిఓ) ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం.. 2022 నాటికి ప్రపంచంలో రసాయనిక ఎరువుల వార్షిక వినియోగం 18.5 కోట్ల టన్నులకు చేరింది. ఇందులో సింహభాగం 58% నత్రజని ఎరువులే. 10.8 కోట్ల టన్నుల యూరియా వాడకం జరిగింది. 4.2 కోట్ల టన్నుల ఫాస్ఫరస్ (23%), 3.5 కోట్ల టన్నుల పొటాషియం (19%) ఎరువులను రైతులు వాడారు. 2022లో రసాయనిక ఎరువుల వాడకంలో 55 శాతం వాటాతో ఆసియా ముందంజలో ఉంది. అమెరికా దేశాలు రెండోస్థానంలో, యూరప్ మూడో స్థానంలో, ఓసియానా నాలుగో స్థానంలో ఉన్నాయి. చైనా, భారత్, బ్రెజిల్, అమెరికా దేశాలు అధికంగా రసాయనిక ఎరువులు వాడుతున్నాయి. ఆసియా దేశాల్లో వాడుతున్న ఎరువుల్లో నత్రజని ఎరువుల వాటా 61–62% మేరకు ఉంది.హెక్టారుకు 130 కిలోలుహెక్టారు పొలంలో రసాయనిక ఎరువుల వాడకం 130 కిలోల మేరకు ఆసియా దేశాల్లోనే అత్యధికంగా ఉంది. అమెరికా ఖండంలో 130 కిలోలు, ఓసియానా దేశాల్లో 84 కిలోలు, యూరప్‌లో 64 కిలోలు, ఆఫ్రికాలో అతి తక్కువగా 22 కిలోల మేరకు రసాయనిక ఎరువులు వాడుతున్నారు. అమెరికా ఖండంలో 2000–2022 మధ్యకాలంలో వినియోగం 57% పెరిగింది. ఆసియాలో 37%, ఆఫ్రికాలో 32%, ఓసియానాలో 15% పెరగ్గా, యూరప్ దేశాల్లో 2% తగ్గింది. చెరకు, మొక్కజొన్న. గోధుమ, వరి పంటలను అత్యధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.వర్షం ద్వారా 9.8 కిలోల నత్రజని!ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పంటలకు నత్రజని అందేది యూరియా ద్వారా మాత్రమే కాదు. అందుకు అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. యుఎన్–ఎఫ్ఎఓ గణాంకాల ప్రకారం (2022).. ప్రపంచవ్యాప్తంగా సగటున హెక్టారుకు ఏడాదికి సేంద్రియ ఎరువుల ద్వారా 16.2 కిలోల నత్రజని పంటలకు అందుతోంది. రసాయనిక ఎరువుల ద్వారా అందుతోంది 64.3 కిలోలు. వర్షం/మంచు ద్వారా 9.8 కిలోల నత్రజని వాతావరణంలో నుంచి గ్రహించి సూక్ష్మజీవులు అందిస్తున్నది 25.5 కిలోలు. పంట కోతల ద్వారా (ఫలసాయం, పంట వ్యర్థాలతో కలుపుకొని) మనం భూమి నుంచి పొందుతున్న నత్రజని 65.1 కిలోలు మాత్రమే. చదవండి: 125 రోజుల పొట్టి కంది.. ఏడాదికి 3 పంటలు!అయితే, వర్షం, మంచు ద్వారా భారత్‌లో పొలాలకు 2022లో అందిన నత్రజని సగటున హెక్టారుకు 21.2 కిలోలు! ఇది ప్రపంచ సగటు 9.8 కిలోలతో పోల్చితే రెట్టింపు కన్నా ఎక్కువ కావటం విశేషం. 2021లో వివిధ మార్గాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా హెక్టారు భూమికి సగటున 116.9 కిలోల నత్రజని అందింది. అందులో నుంచి, పంట పండిన తర్వాత మనం పొందే ఫలసాయం ద్వారా 65.1 కిలోల నత్రజని పోగా మిగతా 51.8 కిలోల నత్రజని ప్రతి హెక్టారు భూమిలో మిగిలిందని ఎఫ్.ఎ.ఓ. లెక్కగట్టింది. 2000 సంవత్సరంలో ఇలా మిగిలింది 48.3 కిలోలు మాత్రమేనట. -
ఇకపై ఈ దుకాణాలకి.. ధ్రువీకరణ ఉండాల్సిందే..
కరీంనగర్: దుకాణాల్లో విరామం లేకుండా గడిపే డీలర్లు తరగతి గదిలో కూర్చోవాల్సిందే. ఇక విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లెక్కలతో కుస్తీ పట్టేవారంతా నిపుణుల బోధనలు వినాల్సిందే. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతీ డీలర్ వ్యవసాయ శాఖ నుంచి డీఏఈఎస్ఐ డిప్లమా కోర్సు ధ్రువీకరణ పత్రం పొందాల్సిందేనని స్పష్టం చేసింది. లేదంటే వారిక విక్రయాలు చేసే అవకాశం ఉండదు.కట్టుదిట్టమైన శిక్షణ.. తదుపరి డిప్లమా కోర్సు ధ్రువీకరణ పత్రం, ఆపై రైతులకు విక్రయిస్తున్న వాటిపై నిఘా వంటి ప్రత్యేక కార్యాచరణ ఉండనుంది. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) నేతృత్వంలో డిప్లొమా కోర్సు నిర్వహించనున్నారు. గతంలో జమ్మికుంట కేవీకేలో పలువురు డీలర్లకు డిప్లమా కోర్సు శిక్షణ జరగగా ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను సవరించింది. రైతు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు ఇచ్చి ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. డీలర్లు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని రైతు శిక్షణ కేంద్రం డీడీ ఛత్రునాయక్ పేర్కొన్నారు.48 వారాలు.. నిపుణులతో బోధన..డీలర్లకు ఏడాది పాటు శిక్షణనివ్వనున్నారు. వారంలో ఒక రోజు ప్రతీ ఆదివారం తప్పనిసరిగా హాజరుకావాల్సిందే. కృషి భవన్‌ను శిక్షణకు వేదికగా నిర్ణయించారు. జిల్లా కేంద్రంలోనే డిప్లమా కోర్సు శిక్షణ ఉండాలని కేంద్రం నిర్దేశించగా తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు శిక్షణ కేంద్రం ఏడీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శిక్షణలో 48 ఆదివారాలు తరగతి గదిలో దుక్కుల నుంచి విత్తనాలు, సస్యరక్షణ చర్యలు తదితర సమగ్ర అంశాలను వివరించనున్నారు. మిగతా 8 వారాలు క్షేత్రస్థాయి శిక్షణ ఉండనుంది. వివరాలకు 81796 49595 నంబర్‌ను సంప్రదించాలని ఏడీ సూచించారు.ఒక్కో బ్యాచ్‌కు 40మంది డీలర్లు..విత్తన క్రిమిసంహారక, ఎరువు విక్రయ డీలర్లకు డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ టు ఇన్పుట్ డీలర్స్ (డీఏఈఎస్ఐ) డిప్లమా కోర్సుకు ఒక్కో బ్యాచ్‌కు 40 మందిని ఎంపిక చేయనున్నారు. లైసెన్స్ పొందిన డీలర్ల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కలెక్టరేట్ వ్యవసాయ శాఖలోని రైతు శిక్షణ కేంద్రం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. డీలర్ల లైసెన్స్ ప్రతిని సంబంధిత ఏడీఏ ధ్రువీకరణతో సమర్పించాలి. దరఖాస్తుదారు తప్పకుండా పదో తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు రూ.10వేలు డీడీ చెల్లించి, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతనివ్వనున్నారు.పరీక్ష పాసైతేనే ధ్రువీకరణ..ఏదో మొక్కుబడిగా కాకుండా సమగ్ర అవగాహన కలిగేలా కోర్సును ఏర్పాటు చేశారు. కాలక్షేపం చేస్తే సదరు డీలరుకు ఇబ్బందులు తప్పవు. 48 వారాలు జరిగిన కోర్సుపై పరీక్షలు నిర్వహించనున్నారు. ప్ర తీ అంశంపై పట్టు సాధించాల్సిందే. పరీక్షలో ఉత్తీర్ణుడైతేనే ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ తరగతులు జరుగనుండగా భోజన వసతి కల్పించనున్నారు.ఫెసిలిటేటర్ నియామకానికి గడువు 15ఇందుకు ఫెసిలెటేటర్ను నియమించేందుకు ఆత్మ ప్రకటన విడుదల చేసింది. బీఎస్సీ(అగ్రికల్చర్) లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివి వ్యవసాయశాఖ లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదా కేవీకేలో 20 ఏళ్ల అనుభవం ఉన్నవారిని ఫెసిలిటేటర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్దేశించింది. వీరికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15 గడువు. ప్రతి ఆదివారం జరిగే శిక్షణలో శాస్త్రవేత్తలు, నిపుణులతో తరగతులు నిర్వహించడం వీరి విధి. త్వరలో శిక్షణ ప్రారంభిస్తామని, డీలర్ల నుంచి దరఖాస్తులు వస్తున్నాయని రైతు శిక్షణ కేంద్రం డీడీ ఛత్రునాయక్ వివరించారు.ఇవి చదవండి: బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..! -
రైతులకు మరింత ‘సహకారం’
సాక్షి, హైదరాబాద్: ఎరువుల నుంచి విత్తనాలు, పురుగుల మందులు ఇలా అన్నీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనే అందుబాటులోకి రానున్నాయి. రైతులకు అవసరయ్యే సేవలు విస్తరించేందుకు ‘వన్‌స్టాప్ షాప్’ విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాస్ (పీఎంకేఎస్కే) పథకంలో భాగంగా దీనిని ప్రవేశపెట్టింది. ఇది ఇక్కడ కూడా అమలులోకి వస్తే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ‘వన్‌స్టాప్ షాప్’ కేంద్రాలుగా మార్చుతారు. ఒకేచోట అన్ని సేవలు... దేశవ్యాప్తంగా లక్ష ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) ఉన్నాయి. వాటిల్లో 73,098 ప్యాక్స్‌లు ఎరువుల లైసెన్స్ కలిగి ఉన్నాయి. మిగిలిన వాటిని కూడా లైసెన్స్ పరిధిలోకి తీసుకొస్తారు. తెలంగాణలో 1,423 ప్యాక్స్ ఉన్నాయి. అందులో 1,261 చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 16,915 ఎరువుల రిటైల్ దుకాణాలుండగా, 14,870 చురుగ్గా పనిచేస్తున్నాయి. అన్ని ప్యాక్స్‌లను ఎరువుల వ్యాపారంలోకి తీసుకొచ్చి అవన్నీ చురుగ్గా పనిచేసేలా కృషి చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ప్యాక్స్‌ల ద్వారా రైతులకు యూరియా, డీఏపీ వంటి ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇకనుంచి వాటిల్లో అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా అన్ని రకాల వ్యవసాయ ఉపకరణాలు అందించాలనేదే ఉద్దేశం. నాణ్యమైన సేవలు అందించవచ్చు దేశంలో సహకార వ్యవసాయ పద్ధతులు అనుసరించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అంటున్నారు. ప్రైవేట్‌లో ఎరువులు, పురుగు మందులు, విత్తన వ్యాపారుల ద్వారా అనేకచోట్ల కల్తీ, నకిలీ రాజ్యమేలుతోంది. ఆ దందాకు చెక్ పెట్టాలంటే ‘వన్‌స్టాప్ షాప్’ విధానం మేలని కేంద్రం చెబుతోంది. ప్యాక్స్ ద్వారా యూరియా వెళ్లడం వల్ల బ్లాక్ మార్కెట్ జరగకుండా చూసుకోవచ్చు. అంతేగాకుండా కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు రైతులకు అంటగట్టకుండా నిరోధించవచ్చు. తక్కువ ధరల్లో రైతులకు వ్యవసాయ పనిముట్లు , సేంద్రీయ ఎరువులు కూడా ఇవ్వొచ్చు. భవిష్యత్‌లో ప్యాక్స్ ద్వారానే మార్కెటింగ్ వసతి కల్పించే ఆలోచనలో కూడా ఉన్నారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్యాక్స్‌ల్లో అనేకం అప్పుల్లో కూరుకుపోయాయని, అవి ప్యాక్స్ రాజకీయాల్లో మునిగిపోవడం వల్ల వాటిల్లో కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయన్న చర్చ జరుగుతోంది. వాటిని అన్ని రకాలుగా బలోపేతం చేస్తే ‘వన్‌స్టాప్ షాప్’ విధానం విజయవంతమవుతుందని అధికారులు అంటున్నారు. -
ఎరువులను 24 గంటల్లో ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ వద్ద నున్న కేంద్రం పంపించిన ఎరువుల ను 24 గంటల్లో రైతులకు ఇవ్వక పోతే...ఆ కార్యాలయాలను బీజేపీ కార్యకర్తలు ముట్టడించి ప్రజలకు పంపిణీ చేస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 17న సభ కోసం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్ ఇవ్వా లంటూ కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ–బీఆర్ఎస్ ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల మధ్య వ్యాపార సంబంధాలు, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్లు కలిసి పోటీ చేయడంపై చెప్పాలని డిమాండ్ చేశారు. -
పెరిగిన ఎరువుల దిగుమతి
న్యూఢిల్లీ: భారత్ ఎరువుల దిగుమతి పరిమాణం జనవరిలో 3.9 శాతం పెరిగి 19.04 లక్షల టన్నులకు చేరింది. 2022 జనవరిలో ఈ పరిమాణం 18.33 లక్షల టన్నులు. ఎరువుల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. ► 2023 జనవరి మొత్తం 19.04 లక్షల టన్నుల దిగుమతుల్లో యూరియా 10.65 లక్షల టన్నులు. డీ అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) 5.62 లక్షల టన్నులు. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) 1.14 లక్షల టన్నులు. కాంప్లెక్స్‌లు 1.63 లక్షల టన్నులు. 2022 జనవరిలో యూరియా దిగుమతుల పరిమాణం 12.48 లక్షల టన్నులు. డీఏపీ 2.45 లక్షల టన్నులు. ఎంఓపీ 3.40 లక్షల టన్నులు. ఎంఓపీ పరిమాణం వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు రెండింటి వినియోగానికి ఉద్దేశించినది. ► ఈ ఏడాది జనవరిలో దేశీయ ఎరువుల ఉత్పత్తి 2022 ఇదే నెలతో పోల్చితే 32.16 లక్షల టన్నుల నుంచి 39.14 లక్షల టన్నులకు పెరిగింది. ► అంతర్జాతీయ మార్కెట్లో పలు రకాలు ఎరువుల ధరలు తగ్గుముఖం పట్టాయి. యూరియా ధరలు (రవాణాకు సిద్ధమైన) ఈ ఏడాది జనవరిలో టన్నుకు 44.26 శాతం క్షీణించి 897 డాలర్ల నుండి 500 డాలర్లుగా నమోదయ్యాయి.డీఏపీ ధరలు 26.28 శాతం క్షీణించి టన్నుకు 679 డాలర్లకు చేరాయి. ఫాస్పరిక్ యాసిడ్ ధర 11.65 శాతం తగ్గి, టన్నుకు 1176 డాలర్లకు తగ్గింది. అమోనియా రేటు 17.42 శాతం తగ్గి, టన్నుకు 928 డాలర్లకు దిగివచ్చింది. సల్ఫర్ ధర కూడా టన్నుకు 52.51 శాతం తగ్గి 161 డాలర్లకు చేరింది. ► కాగా, ఎంఓపీ ధర మాత్రం 2023 జనవరిలో 2022 జనవరితో పోల్చి టన్నుకు 32.58 శాతం పెరిగి 445 డాలర్ల నుంచి 590 డాలర్లకు చేరింది. రాక్ ఫాస్పేట్ ధర సైతం ఇదే కాలంలో 68.06 శాతం పెరిగి టన్నుకు 144 డాలర్ల నుంచి 242 డాలర్లకు ఎగసింది. -
RFCL: వెయ్యి ఎకరాల విస్తీర్ణం.. 5 రాష్ట్రాలకు బాసట.. సగం వాటా తెలంగాణకే
సాక్షి, కరీంనగర్: తెలంగాణ సిగలో మరో మణిహారంగా నిలవనున్న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని (ఆర్ఎఫ్సీఎల్) శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అడుగడుగునా ఏర్పడిన అవాంతరాలను అధిగమిస్తూ పునరుద్ధరించిన ఆర్ఎఫ్సీఎల్ జోరుగా ఉత్పత్తి కొనసాగిస్తూ తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల రైతులకు బాసటగా నిలుస్తోంది. దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మూతపడిన ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించి 2015లో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా రామగుండంలో మూతపడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కర్మాగారాన్ని కేంద్రప్రభుత్వం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) పేరుతో పునరుద్ధరించింది. 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ చేతులమీదుగా ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక గత మార్చి 22 నుంచి వాణిజ్యకార్యకలాపాలు ప్రారంభించారు. ఉత్పత్తిలో సగం వాటా తెలంగాణ రాష్ట్ర అవసరాలకే కేటాయించనున్నారు. వేప నూనె, విదేశీ సాంకేతికతతో.. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆర్ఎఫ్సీఎల్ ప్రాజెక్టు విలువ రూ.6,338.16 కోట్లు కాగా, వార్షిక ఉత్పత్తి లక్ష్యం 12.75 లక్షల మెట్రిక్ టన్నులు. ఆర్ఎఫ్సీఎల్ అమ్మోనియాను డెన్మార్క్ దేశానికి చెందిన హల్టోర్ కంపెనీ, యూరియాను ఇటలీ దేశానికి చెందిన సాయ్‌పేయ్ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తోంది. గ్యాస్‌ను ఇంధనంగా మార్చి నీటి నుంచి ఆవిరి ఉత్పత్తి చేసి, వేపనూనెతో యూరియా, అమ్మోనియా తయారుచేయడం ఆర్ఎఫ్సీఎల్ ప్రత్యేకత. చదవండి: మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..! -
రైతులకు వెన్నుదన్నుగా అగ్రిల్యాబ్‌లు
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం కేంద్రంగా నిర్వహిస్తున్న ఎరువులు, విత్తన, పురుగుమందుల పరీక్షా కేంద్రాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ నాలుగు దశాబ్దాలుగా విశేష సేవలందిస్తున్నాయి. అధునాతన పరిజ్ఞానంతో పరీక్ష ఫలితాలను సకాలంలో రైతులకు అందిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను పండించేందుకు ఎంతో దోహపడుతున్నాయి. ఇక్కడి సెంట్రల్ ల్యాబ్ ద్వారా నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్ సిబ్బందికి సైతం నైపుణ్యంలో శిక్షణ అందిస్తూ రైతు సేవలో తరిస్తున్నాయి. తాడేపల్లిగూడెం: భూమాతను నమ్ముకుని హలం పట్టి పొలం దున్ని స్వేదం చిందించి పుడమితల్లి ధాన్యపు రాశులతో, పంటలతో విరాజిల్లడానికి కృషి చేసే రైతులకు విత్తనం నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు దివిటీలుగా మారాయి. ఆర్బీకేలు, అగ్రిల్యాబ్‌లు వ్యవసాయంలో వినూత్న మార్పులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుండటంతో వ్యవసాయం పండుగగా మారింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా తాడేపల్లిగూడెంలో ఎరువులు, పురుగుమందులు, విత్తన పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని నియోజకవర్గాలలో ఏర్పాటు చేసే అగ్రిల్యాబ్‌లలో పనిచేసే సిబ్బందికి నైపుణ్య శిక్షణ, సాంకేతిక మార్గదర్శనం సైతం గూడెంలోని సెంట్రల్ ల్యాబ్ ద్వారా అందుతోంది. ఈ ల్యాబ్‌ల ద్వారా అందుతున్న సేవలు ఇలా ఉన్నాయి. ఆరు జిల్లాలకు విత్తన పరీక్షలు ధాన్యం, కూరగాయలు, అపరాల వంగడాలలో మొలకశాతాన్ని విశ్లేషించి ఫలితాలను రైతులకు అందజేయడానికి తాడేపల్లిగూడెంలో 1972లో విత్తన పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయలు, అపరాలు, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలలో మొలకశాతాన్ని విశ్లేషించి నాణ్యతను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులకు సేవలందిస్తున్నారు. వ్యవసాయాధికారులు, ఏడీఏల ద్వారా వంగడాల శాంపిల్స్ ఇక్కడకు వస్తాయి. వాటిలో మొలకశాతాలను వివిధ దశల్లో పరీక్షల ద్వారా నిర్థారించి ఫలితాలను 30 రోజుల వ్యవధిలో పంపిస్తారు. శీతలీకరణ పద్ధతుల్లో విత్తనాలను భద్రపర్చి తర్వాత మొలకశాతాలను పరిశీలిస్తారు. రాష్ట్రంలోని మూడింటిలో ఒకటి 1979 ఫిబ్రవరి 17న ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ద్వారా ఎరువుల పరీక్ష కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇటువంటి కేంద్రాలు మొత్తం మూడు ఉండగా, ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయగా, మిగిలినవి అనంతపురం, బాపట్లలో ఉన్నాయి. వీటిని లీగల్ ల్యాబ్స్ అని కూడా అంటారు. అగ్రిల్యాబ్‌లలో పనిచేసే సిబ్బందికి, సాంకేతికపరమైన శిక్షణ ఈ ల్యాబ్ ద్వారా ఇచ్చారు. ఎరువులలో కల్తీ, నాణ్యత పరిశీలనకు నమూనాలను ఇక్కడకు పంపిస్తారు. గుంటూరులో కోడింగ్ సెంటర్‌కు ఈ నమూనాలు చేరితే, అక్కడి నుంచి ఇక్కడి పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నారు. గతంలో 60 రోజుల్లో ఫలితాలను వెల్లడించాల్సి ఉండగా, ప్రస్తుతం అధునాతన పరీక్ష యంత్రాలు అందుబాటులోకి రావడంతో 2018 నుంచి 15 రోజుల్లోనే ఫలితాలను తేల్చేస్తున్నారు. ఫరీదాబాద్‌లోని సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన నిపుణులు ఈ ల్యాబ్‌లో సేవలందిస్తున్నారు. ప్రమాణాలకు తగ్గట్టుగా పురుగుమందు పరీక్షలు 1984 మే రెండో తేదీన ఇక్కడ పురుగుమందుల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా 68 ఉండగా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏడు ల్యాబ్‌లుండగా, రాష్ట్ర విభజనలో రెండు వరంగల్, రాజేంద్రనగర్ ల్యాబ్‌లు తెలంగాణలోకి వెళ్లాయి. మిగిలిన ఐదు ల్యాబ్‌లు రాష్ట్రానికి దక్కాయి. వాటిలో ఒకటి తాడేపల్లిగూడెం ల్యాబ్ కాగా, గుంటూరు అనంతపురం, కర్నూలు, విశాఖపట్టణాలలో ల్యాబ్‌లు ఉన్నాయి. పురుగుమందుల్లో మూల పదార్థం స్థాయి ప్రమాణాల పరిమితికి అనుకూలంగా ఉందో లేదా అనేది ఈ పరీక్ష కేంద్రాల్లో నిర్ధారిస్తారు. గుంటూరులో ఉన్న కోడింగ్ సెంటర్‌కు తిరిగి ఫలితాలను పంపిస్తారు. పురుగుమందుల్లో క్రియాశీల పదార్థా శాతాన్ని పరీక్షిస్తారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా నమూనాలు ఉన్నాయో లేవో పరిశీలిస్తారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చాం జిల్లాలో ఏర్పాటుచేసే అగ్రిల్యాబ్ లలో పనిచేసే సిబ్బందికి సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చాం. సెంట్రల్ యాక్టు ద్వారా ఏర్పాటైన ఈ ల్యాబ్‌లో పరిశోధనా పద్ధతులు, ఇతర విషయాలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో వచ్చిన వారికి పరిపూర్ణమైన శిక్షణ ఇచ్చాం. – జె.శశిబిందు, ఏడీఏ, ఎరువుల పరిశోధన, సెంట్రల్ ల్యాబ్, తాడేపల్లిగూడెం -
త్వరలోనే రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఎన్ఎఫ్ఎల్, ఈఐఎల్, ఎఫ్‌సీఐ అనే మూడు ప్రభుత్వరంగ సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ఈ కర్మాగారాన్ని పునరుద్ధరిస్తాయని లోక్‌సభలో పెట్రోలియంశాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం తెలిపారు. డిసెంబర్ 31లోగా జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటవుతుందని, వచ్చే మార్చి 31 నాటికి ఒప్పందం కుదురుతుందని వివరించారు.