త్వరలోనే రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణ | Restoration of ramagundam FCI | Sakshi
Sakshi News home page

త్వరలోనే రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణ

Nov 26 2014 4:05 AM | Updated on Sep 2 2017 5:06 PM

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించనున్నట్టు కేంద్రం వెల్లడించింది.

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఎన్‌ఎఫ్‌ఎల్, ఈఐఎల్, ఎఫ్‌సీఐ అనే మూడు ప్రభుత్వరంగ సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ఈ కర్మాగారాన్ని పునరుద్ధరిస్తాయని లోక్‌సభలో పెట్రోలియంశాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం తెలిపారు. డిసెంబర్ 31లోగా జాయింట్ వెంచర్ కంపెనీ  ఏర్పాటవుతుందని, వచ్చే మార్చి 31 నాటికి ఒప్పందం కుదురుతుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement