Telangana CM KCR Announces House Site And 1 Crore To Sakini Ramachandraiah Kanakaraju - Sakshi
Sakshi News home page

Sakini Ramachandraiah-CM KCR: రామచంద్రయ్యకు కేసీఆర్‌ సర్కార్‌ బంపరాఫర్‌ ఇంటి స్థలానికి రూ. కోటి నగదు 

Feb 2 2022 5:51 AM | Updated on Feb 2 2022 9:02 AM

Kcr Announces House Site And 1 Crore To Sakini Ramachandraiah Kanakaraju - Sakshi

సీఎం కేసీఆర్‌ను కలసిన రామచంద్రయ్య  

సాక్షి, హైదరాబాద్‌: పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు అతని సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు రూ.కోటి రివార్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకోనున్న నేపథ్యంలో సీఎంను మంగళవారం ప్రగతిభవన్‌లో మర్యాద పూర్వకంగా రామచంద్రయ్య కలిశారు.

అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు సీఎం అభినందించారు. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును పొందడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగక్షేమాలను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. ఇంటి స్థలం, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్‌ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం ఆదేశించారు. 

పద్మశ్రీ కనకరాజుకు రివార్డు ప్రకటించిన సీఎం 
గతేడాది పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో ఇంటి స్థలాన్ని, నిర్మాణం ఖర్చుల కోసం రూ.1 కోటి సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ఆత్రం సక్కును సీఎం ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement