కామినేని పుష్ప కన్నుమూత | Kamineni Pushpa Passed Away | Sakshi
Sakshi News home page

కామినేని పుష్ప కన్నుమూత

Jan 24 2023 1:44 AM | Updated on Jan 24 2023 3:49 PM

Kamineni Pushpa Passed Away - Sakshi

దోమకొండ: కామారెడ్డి జిల్లా లోని దోమకొండ గడికోట వార సులైన దివంగత రిటైర్డు ఐఏఎస్‌ అధికారి కామినేని ఉమాపతిరావు సతీమణి పుష్ప (71) సోమవారం హైదరాబాద్‌ లోని స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతదేహా నికి జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వ హించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆమె కుమారుడు, జాతీయ అర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ కుమార్తె ఉపాసనను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుమారుడు రాంచరణ్‌తో దోమ కొండలో వివాహం జరిపించిన విషయం తెలిసిందే. పుష్ప ప్రతి మహా శివరాత్రి నాడు గడికోటలోని మహ దేవుని ఆలయానికి వచ్చి పూజల్లో పాల్గొనేవారు. ఆమె గడికోటకు వచ్చిన ప్రతిసారీ అందరితో కలుపుగోలుగా  ఉండేవారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement