
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కామారెడ్డి: యువతపై మాయదారి గుండెపోట్లు పగబట్టినట్లున్నాయి. గతంలో ఎటువంటి అనారోగ్యం ఆనవాలు లేని వ్యక్తులు కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. చూస్తుండగానే హార్ట్ స్ట్రోక్‌తో మరణిస్తున్నారు. తాజాగా కామారెడ్డిలో అలాంటి ఘటనే బుధవారం వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోనె సంతోష్ (33) అనే యువకుడు ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలాడు.
(చదవండి: చిన్నవయసులోనే గుండెపోటు సంఘటనలు ఎందుకు?)
వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సంతోష్ మృతితో కుంటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత ఐదు రోజుల్లో జిల్లాలో గుండెపోటుకు గురై నలుగురు ప్రాణాలు విడిచారు.
(చదవండి: కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన బీ ఫార్మసీ విద్యార్థి.. చూస్తుండగానే...)