
సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలు అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.
కవిత ట్విట్టర్ వేదికగా.. ‘తెలంగాణ ఆత్మగౌరవ పతాక.. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఇంటిల్లిపాదీ సంబరంగా జరుపుకునే ప్రకృతి పండుగ ఇది. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో తొలి రోజు జరుపుకునే ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు.
తెలంగాణ ఆత్మగౌరవ పతాక.. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఇంటిల్లిపాదీ సంబరంగా జరుపుకునే ప్రకృతి పండుగ ఇది.
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో తొలి రోజు జరుపుకునే ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు#Bathukamma pic.twitter.com/wcjxWVVtiU— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 21, 2025