
హైదరాబాద్: వైద్యులు నిర్లక్ష్యం కారణంగా ఇంజక్షన్ వికటింక్షో వ్యక్తి మృతి చెందిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్ రోడ్డు సమీపంలోని హై కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు.
ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించిందని తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని, వెంటనే మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఐలయ్య మృతి చెంది ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడికి ఇచ్చింది ఇంజక్షన్లను పరిశీలించగా అవి మార్చి నెలలోనే ఎక్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిని ఇంజక్షన్ ఇచి్చనందునే అతను మృతి చెందాడని ఆరోపిస్తూ మృత దేహంతో ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.