
కుటుంబ కలహాలతో ఇద్దరు కొడుకులను చంపేసిన తల్లి
మహబూబాబాద్ జిల్లాలో తల్లి అరెస్టు
కేసముద్రం: కన్నబిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే.. తొమ్మిది నెలల్లో ఇద్దరు కొడుకులను హత్య చేసింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపురం గ్రామానికి చెందిన ఉపేందర్, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంఖానిపేటకు చెందిన శిరీషను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు మనీష్ కుమార్, మోక్షిత్, నిహాల్ ఉన్నారు.
లారీడ్రైవర్‌గా పనిచేస్తున్న ఉపేందర్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. భర్త తనతో ప్రేమగా ఉండటం లేదని, ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శిరీష మనస్తాపా నికి గురైంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. తాను ఆత్మ హత్య చేసుకుంటే పిల్లలు అనాథలు అవుతారని శిరీష భావించింది. ముందుగా బిడ్డలను చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఈ ఏడాది జనవరి 15న రెండేళ్ల చిన్నకుమారుడు నిహాల్‌ను నీటిసంపులో పడేసి, ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ప్రమాదవశాత్తు సంపులో పడి చనిపోయినట్లు చిత్రీకరించింది. ఆ తర్వాత గత జూలై 31న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పెద్దకుమారుడు మనీష్ మెడపై కత్తితో దాడి చేసింది.

గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడి చేశారని అందరూ భావించారు. ఈనెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి మనీష్ (6) మెడకు నైలాన్‌దారం చుట్టి హత్య చేసింది. ఏమీ తెలియనట్లుగా బతుకమ్మ ఆడేందుకు వెళ్లింది. శిరీష అత్త మంగమ్మ పనికి వెళ్లి వచి్చంది. మనీష్ ఎక్కడున్నాడని శిరీషను అడగ్గా, జ్వరంగా ఉంటే ఇంట్లో పడుకోబెట్టానని చెప్పింది. అన్నం తినిపిద్దామని మనుమడి వద్దకు వెళ్లి లేపే ప్రయత్నం చేయగా, మనీష్ చనిపోయి ఉండటంతో కేకలు పెడు తూ బోరున విలపించింది. శిరీషపై అనుమానం వచి్చన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఇద్దరు కుమారులను తానే చంపినట్లు ఒప్పుకుంది. శిరీషను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సర్వయ్య తెలిపారు.