సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ‘నీళ్లు-నిజాలు’ అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణ-గోదావరి నదీజలాల నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చ జరిగింది. డీప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, కార్పోరేషన్ ఛైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
2014 నుంచి నేటి వరకు కృష్ణా- గోదావరి నదిలో నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలపై సీఎం అవగాహన కల్పించారు. రేపు అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సమావేశంలో అవగాహన కల్పించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై నేతలు చర్చించారు.
పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేశామని బీఆర్‌ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ చెప్తున్నది అబద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డికి కేసీఆర్ రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని.. పాలమూరు-రంగారెడ్డి పూర్తి కావాలంటే ఇంకా రూ.80 వేల కోట్లు కావాలన్నారు.


