సత్వరమే ఉద్యోగ నియామకాలు.. పెండింగ్‌ అంశాలను పరిష్కరించి నోటిఫికేషన్లు: సీఎస్‌ శాంతికుమారి

Immediate Recruitment After Solving Pending Issues Telangana CS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివిధ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డ్యాష్‌ బోర్డును ఏర్పాటు చేసి నిరంతరం సమీక్షించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. సరీ్వసు అంశాలు, రోస్టర్‌ పాయింట్లు, రిజర్వేషన్లకు సంబంధించిన పలు శాఖలలో పెండింగ్‌ అంశాలను తక్షణమే పరిష్కరించి ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఉద్యోగ నియామకాలపై బీఆర్‌కేఆర్‌ భవన్‌లో మంగళవారం ఆమె ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 17,516 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ కాగా, ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేశామని, ఏప్రిల్‌లో రాత పరీక్షలు పూర్తి చేసి సెపె్టంబర్‌లోగా నియామకాలు జరుపుతామని సీఎస్‌ పేర్కొన్నారు. రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 10 వేల పోస్టులకు సెపె్టంబర్‌లోగా నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ భేటీలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, రోనాల్డ్‌ రోస్, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ శ్రీనివాసరావు, వర్సిటీ కామన్‌ బోర్డు చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి పాల్గొన్నారు.
చదవండి: నిఘా లేదు.. సర్వర్‌ లేదు! కీలకమైన టీఎస్‌పీఎస్సీలో ‘సెక్యూరిటీ’ లోపాలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top