
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో డబ్బు కాజేశారు. సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సార్ నగర్‌కు చెందిన శివ అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్‌లైన్ బెట్టింగ్ వైపు మళ్లాడు. ఆన్‌లైన్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి చెప్పిన విధంగా వెగాస్–11 బెట్టింగ్ అనే యాప్‌లో ఏడాదిన్నరగా బెట్టింగ్ చేస్తున్నాడు. బెట్టింగ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ వైపు మళ్లించి అతడి నుంచి రూ.30 లక్షలు కాజేశారు.
మరో ఘటనలో..
మలక్‌పేటకు చెందిన యువతి స్టడీ టేబుల్ అమ్మేందుకు ఓఎల్‌ఎక్స్‌లో యాడ్ పోస్ట్ చేసింది. దానిని చూసిన నేరగాడు స్టడీ టేబుల్ కొంటానని నమ్మించి క్యూఆర్ కోడ్‌లు పంపి పలు దఫాలుగా రూ.14 లక్షలు స్వాహా చేశాడు. ఇలా ఇద్దరి నుంచి సైబర్ నేరగాళ్లు మొత్తం రూ.44 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.