
ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: రహదారులపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనచోదకులకు ఈ–చలాన్లు విధించడంలో జరుగుతున్న పొరపాట్లపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. ‘ఈ–చలాన్ మా ఇష్టం’ పేరుతో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనిని పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో ఈ–చలాన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాహనచోదకులకు ఇబ్బంది కలిగించే ఇలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు.
చదవండి: మూసీపై నిర్మించనున్న వంతెనలకు కొత్త అందాలు
తక్షణ చర్యలకు ఉపక్రమించిన ట్రాఫిక్ పోలీసులు పొరపాటున జారీ అయిన చలాన్లలో కొన్నింటిని తొలగించారు. మిగిలిన వాటిపై పరిశీలన చేపట్టారు. ఇకపై ఈ–చలాన్ విధింపుల్లో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ సీపీ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా తమ వాహనంపై తమ తప్పు లేకుండా చలాన్ పడిందనో, డబుల్ చలాన్ వచ్చిందనో ఫిర్యాదు చేస్తే తక్షణం దానిని పరిష్కరించాలని కమిషనర్ స్పష్టం చేశారు.
చదవండి: బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా..