సాక్షి, హైదరాబాద్ : రేపు అక్టోబర్ 14న భారత- వెస్టిండీస్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెటింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మ్యాచ్ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురిని ఈ రోజు (మంగళవారం) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11 కాంప్లిమెంటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు సోషల్ మీడియా మాద్యమాలైన వాట్సాఫ్, ఇన్‌స్టా ద్వారా టికెట్ల విక్రయానికి ప్రచారం చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఈ బ్లాక్ మార్కెటింగ్ సభ్యులు హెచ్‌సీఏ సభ్యుడి ద్వారా టికెట్లు పొందినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు అక్షరిత్ శ్రీవాస్తవ, అవినాష్ దారక్, మోహిత్ సోమాని, సతీష్ చంద్ర శ్రీవాస్తవను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


