జాబ్ నోటిఫికేషన్లు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి | Hyderabad: Mlc Vani Devi Arrange Study Environment To Job Aspirants | Sakshi
Sakshi News home page

జాబ్ నోటిఫికేషన్లు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

Mar 29 2022 9:35 PM | Updated on Mar 29 2022 9:38 PM

Hyderabad: Mlc Vani Devi Arrange Study Environment To Job Aspirants - Sakshi

సనత్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో బేగంపేట బ్రాహ్మణవాడీలోని స్వామి రామానందతీర్థ మెమోరియల్‌ కమిటీలో పీవీ నరసింహారావు స్మారక గ్రంథాలయంలో ఉద్యోగార్థులు చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించనున్నట్లు ఎమ్మెల్సీ, కమిటీ చైర్‌పర్సన్‌ వాణీదేవి తెలిపారు. కమిటీ ప్రాంగణంలోని ఎమ్మెల్సీ క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థులకు ఇక్కడి గ్రంథాలయంలో అవసరమైన సమాచారం, పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు.  

గ్రంథాలయంలో చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పీవీ స్మారక గ్రంథాలయం తెరిచి ఉంటుందని ఆమె తెలిపారు. సమావేశంలో సురభి సోలార్‌ ఎనర్జీ కేంద్రం డైరెక్టర్‌ శేఖర్‌ మారంరాజు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement